యూడీఐడీ కార్డుల జారీని వేగవంతం చేయాలి ములుగు: అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సదరం– యూడీఐడీ కార్డులు సకాలంలో అందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య సదరం– యూడీఐడీ కార్డుల జారీ పురోగతిపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారులు, ముఖ్య వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ కార్యాలయం నుండి శనివారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సంపత్ రావు తో కలిసి పాల్గొన్నారు. సదరం–యూడీఐడీ కార్డుల జారీ పురోగతి, జిల్లాల వారీగా నమోదవుతున్న దరఖాస్తులు, పెండింగ్ కేసులు, కేంద్రాల పనితీరు, మౌళిక వసతులపై సెర్ప్ సీఈఓ వీసీ ద్వారా సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సదరం– యూడీఐడీ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులలో అర్హులైన వారందరికీ సదరం ధృవపత్రాల జారీని వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సదరం– యూడీఐడీ కార్డులు అందేలా క్షేత్రస్థాయిలో చురుకుగా పని చేయాలని సూచించారు. జిల్లాలో యూడీఐడీ మూల్యాంకన కేంద్రంలో అవసరమైన పరికరాలు, స్పెషలిస్ట్ వైద్యులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సకాలంలో సదరం– యూడీఐడీ ధృవ పత్రాలు జారీకి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

- కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.1
- ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.1
- అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....1
- చీకుపల్లి కల్వర్టును పరిశీలించిన మంత్రి సీతక్క.. వరద నష్టాల నివారణకు వేగవంతమైన చర్యలు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద జాతీయ రహదారిపై వరదలతో దెబ్బతిన్న కల్వర్టును మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఆమె, రాకపోకలను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లతో పాటు శాశ్వత పరిష్కారానికి అవసరమైన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు రెండేళ్లుగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి చేరుకున్నప్పటికీ ముందస్తు ఏర్పాట్ల వల్ల పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నారు. రామన్నగూడెం వద్ద లీకేజీల నివారణకు తాత్కాలిక పనులు పూర్తయ్యాయని, శాశ్వత పరిష్కారం కోసం రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.1
- నిరపుత్రి పూజ కోసం శబరిమల కు వెళ్ళిన తెలంగాణ అయ్యప్ప స్వాములు కేరళలోని పందలం శబరిమలలో ఆగస్టు 3వ తేదీన జరిగే నీరపుత్రి పూజకు తెలంగాణ రాష్ట్రంలోని అయ్యప్ప స్వాములు శబరిమల కు ప్రయాణమయ్యారు.1
- కరీంనగర్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తా...విమర్శించే వారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్పాలి- కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివృద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో తప్పులు చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శించే వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని మేయర్ డిప్యూటీ మేయర్ ను ఆదేశించారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో 80 లక్షలు యూఐడీఎఫ్ నిధులు కాగా, మిగిలిన రూ.20 లక్షలు మున్సిపల్ సాధారణ ఫండ్ కు సంబంధించినవని తెలిపారు. 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి 40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహ కాలనీలో 57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి 10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘‘వన మహోత్సవం-2026’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 22 వేల కోట్లు నిధులు ఖర్చు పెట్టామని త్వరలోనే వివిధ కేంద్ర పథకాల కింద మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.1
- కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం... పలువురు బిజేవైఎం నాయకుల అరెస్ట్ విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులను సీఎం క్రిమినల్స్ అన్నాడని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ధర్నాకు దిగి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు కళ్ళుగప్పి బీజేవైఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు దగ్ధమవుతున్న దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకొని , బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.2