Shuru
Apke Nagar Ki App…
పాత పెన్షన్ విధానం అమలు చేయాలని సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జనజాగరణ బైక్ యాత్ర.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం జనగామ జిల్లాలో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గురువారం జనజాగరణ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 23న నిర్వహించే 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
M D Azizuddin

More news from తెలంగాణ and nearby areas
- నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ నిరసన ములుగు జిల్లా:నీట్ పేపర్ లీకేజీ ఘటన, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మండల యూత్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వై జంక్షన్ వద్ద జరిగిన నిరసనలో ఆర్టీఏ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.1
- ఆపిల్ పండ్ల డీసీఎం బోల్తా... నిమిషాల్లోనే ఆపిల్ పండ్లు మాయం చేసిన ప్రజలు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు గ్రామ శివారులో వరంగల్–ఖమ్మం హైవే పై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులో ఉన్న ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పరిసర ప్రాంత ప్రజలు రోడ్డుపైన వెళ్లే వాహనదారులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల లోడును పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది బస్తాలు, సంచులు, వాహనాల్లో ఆపిల్ పండ్లను తరలించగా, మరికొందరు చేతులతోనే తీసుకెళ్లిన సందర్భం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు,. జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది...1