logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రోడ్డు ఆక్రమణ లో పిల్లర్ల నిర్మాణం.. విషయం తెలిసిన వెంటనేఅడ్డుకున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు యజమాని ప్రతిఘటనతో పోలీసుల రంగప్రవేశం.. రెండు రోజుల గడువు అచ్చంపేట, సెప్టెంబర్ 15(షురూ న్యూస్ ఆప్ ప్రతినిధి ): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పునుంతల రోడ్డులో గల రోడ్డు స్థలాన్ని ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని మున్సిపల్‌ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టవద్దని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మనోజ హెచ్చరించడంతో భూ యజమాని వర్కాల శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మనోజ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌అండ్‌బీకి వెళ్లే రోడ్డును ఆక్రమించి గతంలో రేకుల గోడ నిర్మించారంటూ మున్సిపాలిటీకి ఫిర్యాదు అందింది.దీంతో అధికారులు స్థలాన్ని పరిశీలించగా ప్రధాన రహదారి నుంచి సుమారు 8అడుగులముందుభాగంలో పిల్లర్ల నిర్మాణానికి గుంతలు తవ్వుతున్నట్లు గుర్తించారు. వెంటనే భూ యజమాని శ్రీనివాసులు ను హెచ్చరించినట్లు ఆమె తెలిపారు. అయినా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పిల్లర్ల నిర్మాణం చేపట్టడంతో మంగళవారం అధికారులు జేసీబీతో స్థలానికి చేరుకున్నారు. నిర్మాణాన్నితొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా భూ యజమాని జేసీబీ కి అడ్డం పడిప్రతిఘటించారు. దీంతోపోలీసులురంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల సహకారంతో నిర్మాణానికి తవ్విన గుంతలు, ఏర్పాటు చేసిన పిల్లర్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భూ యజమాని, కుటుంబ సభ్యుల నుంచి కొంతసేపు ప్రతిఘటన ఎదురైంది. చివరకు కొంత సమయం ఇవ్వాలని వారు కోరడంతో అధికారులు రెండు రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా అక్రమంగా ఏర్పాటు చేసిన పిల్లర్లను తొలగించకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మనోజ స్పష్టం చేశారు

14 hrs ago
user_Taluka press club president:Sambu.chandra sekhar
Taluka press club president:Sambu.chandra sekhar
అచ్చంపేట, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
14 hrs ago
32444eb3-ef1a-4d02-9cea-a6ecabac85e2

రోడ్డు ఆక్రమణ లో పిల్లర్ల నిర్మాణం.. విషయం తెలిసిన వెంటనేఅడ్డుకున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు యజమాని ప్రతిఘటనతో పోలీసుల రంగప్రవేశం.. రెండు రోజుల గడువు అచ్చంపేట, సెప్టెంబర్ 15(షురూ న్యూస్ ఆప్ ప్రతినిధి ): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పునుంతల రోడ్డులో గల రోడ్డు స్థలాన్ని ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని మున్సిపల్‌ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టవద్దని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మనోజ హెచ్చరించడంతో భూ యజమాని వర్కాల శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మనోజ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌అండ్‌బీకి వెళ్లే రోడ్డును ఆక్రమించి గతంలో రేకుల గోడ నిర్మించారంటూ మున్సిపాలిటీకి ఫిర్యాదు అందింది.దీంతో అధికారులు స్థలాన్ని పరిశీలించగా ప్రధాన రహదారి నుంచి సుమారు 8అడుగులముందుభాగంలో పిల్లర్ల నిర్మాణానికి గుంతలు తవ్వుతున్నట్లు గుర్తించారు. వెంటనే భూ యజమాని శ్రీనివాసులు ను హెచ్చరించినట్లు ఆమె తెలిపారు. అయినా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పిల్లర్ల నిర్మాణం చేపట్టడంతో మంగళవారం అధికారులు జేసీబీతో స్థలానికి చేరుకున్నారు. నిర్మాణాన్నితొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా భూ యజమాని జేసీబీ కి అడ్డం పడిప్రతిఘటించారు. దీంతోపోలీసులురంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల సహకారంతో నిర్మాణానికి తవ్విన గుంతలు, ఏర్పాటు చేసిన పిల్లర్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భూ యజమాని, కుటుంబ సభ్యుల నుంచి కొంతసేపు ప్రతిఘటన ఎదురైంది. చివరకు కొంత సమయం ఇవ్వాలని వారు కోరడంతో అధికారులు రెండు రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా అక్రమంగా ఏర్పాటు చేసిన పిల్లర్లను తొలగించకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మనోజ స్పష్టం చేశారు

More news from తెలంగాణ and nearby areas
  • మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.
    1
    మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు
బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    23 hrs ago
  • పత్రికా ప్రకటన నంద్యాల జిల్లా 15.09.2026 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆత్మకూరు:నంద్యాల జిల్లా. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
    4
    పత్రికా ప్రకటన

నంద్యాల జిల్లా 
15.09.2026

 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS.
అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. 

ఆత్మకూరు:నంద్యాల జిల్లా.
వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS  నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ  సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ  సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.
    1
    తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత
తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    18 hrs ago
  • పుల్లలచెరువులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి దేవాలయం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది.మహిళలు, చిన్నారులు సంయుక్తంగా చేసిన ఈ కోలాటాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. మాస్టర్ కోటయ్య ఆధ్వర్యంలో కోలాటం చేశారు.ఈ సందర్బంగా కోలాటమాడిన మహిళలకు కమిటీ సభ్యులు చీరలను బహుమతిగా అందజేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
    1
    పుల్లలచెరువులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా  ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన 
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి దేవాలయం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది.మహిళలు, చిన్నారులు సంయుక్తంగా చేసిన ఈ కోలాటాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. మాస్టర్ కోటయ్య ఆధ్వర్యంలో కోలాటం చేశారు.ఈ సందర్బంగా కోలాటమాడిన మహిళలకు కమిటీ సభ్యులు చీరలను బహుమతిగా అందజేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
    user_ఏడుకొండలు. జర్నలిస్ట్
    ఏడుకొండలు. జర్నలిస్ట్
    Local News Reporter పుల్లలచెరువు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • మార్కాపురం జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న రహదారులు భవనముల శాఖ అతిథి గృహం మార్కాపురం జిల్లా కేంద్రంలో రహదారులు భవనముల శాఖ అతిథి గృహము శిథిలావస్థకు చేరింది. భవనం లోపల పై కప్పుకున్న పిఓపి ఊడి కింద పడిపోయింది. గత ప్రభుత్వంలో ఎంతో కొంత ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉపయోగించుకున్నారు. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో నిరుపయోగంగా మారి సరైన అధికారుల పర్యవేక్షణ లేక పరిసరాలు చిట్ట అడివిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు
    1
    మార్కాపురం జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న రహదారులు భవనముల శాఖ అతిథి గృహం 
మార్కాపురం జిల్లా కేంద్రంలో రహదారులు భవనముల శాఖ అతిథి గృహము శిథిలావస్థకు చేరింది. భవనం లోపల పై కప్పుకున్న పిఓపి ఊడి కింద పడిపోయింది. గత ప్రభుత్వంలో ఎంతో కొంత ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉపయోగించుకున్నారు. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో నిరుపయోగంగా మారి సరైన అధికారుల పర్యవేక్షణ లేక పరిసరాలు చిట్ట అడివిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    10 min ago
  • వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం.. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ గారు ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    2
    వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, 
అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం..
వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్,  ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ  సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ  సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ గారు ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.
    1
    ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత
ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ,  ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    19 hrs ago
  • నాగర్ కర్నూల్ టి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు ప్రియుడు తో కత్తితో పొడిచిన ప్రియుడు విషయం భార్యకు ప్రియుడు కు అడ్డుగా ఉన్నా డ ని చంపేశారు పోలీసులు ఈ కేసును చే దించారు వీడియో
    1
    నాగర్ కర్నూల్ టి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు ప్రియుడు తో కత్తితో పొడిచిన ప్రియుడు
విషయం భార్యకు ప్రియుడు కు అడ్డుగా ఉన్నా డ ని చంపేశారు పోలీసులు ఈ కేసును చే దించారు వీడియో
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.