ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి ధాన్యం కటింగ్ పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం కారణంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోందని తెలిపారు. కొనుగోళ్లలో ఆలస్యం, అనవసర కట్టింగ్‌లు లేకుండా రైతుల పక్షాన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు . రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు “మాది రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ నినాదం. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాము అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదనపు తూకం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, రైస్ మిల్లర్లు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా చూడాలని అన్నారు. రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు స్టోరేజ్ కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు ట్రాక్టర్ల, లారీలకొరత లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేల కోట్ల రూపాయలను రైతు సంక్షేమానికి ఖర్చు చేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరారు. అనవసర కటింగ్ పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారుల సమన్వయంతో దాన్యం కొనుగోళ్ళను వేగవంతంగా చేపడుతున్నామని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని మండలాల్లో ఎంపీడీవోలు తాసిల్దారులు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారని, కొనుగోలు వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. అకాల వర్షం కురిస్తే ధాన్యం తడవకుండా వెంట వెంటనే మిల్లులకు స్టోరేజ్ కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. అదనపు తూకం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు. లారీలు, ట్రాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు..
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి ధాన్యం కటింగ్ పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం కారణంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోందని తెలిపారు. కొనుగోళ్లలో ఆలస్యం, అనవసర కట్టింగ్‌లు లేకుండా రైతుల పక్షాన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు . రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు “మాది రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ నినాదం. రైతులకు
అన్ని విధాలా అండగా ఉంటాము అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదనపు తూకం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, రైస్ మిల్లర్లు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా చూడాలని అన్నారు. రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు స్టోరేజ్ కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు ట్రాక్టర్ల, లారీలకొరత లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేల కోట్ల రూపాయలను రైతు సంక్షేమానికి ఖర్చు చేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు
చేపట్టాలని కోరారు. అనవసర కటింగ్ పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారుల సమన్వయంతో దాన్యం కొనుగోళ్ళను వేగవంతంగా చేపడుతున్నామని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని మండలాల్లో ఎంపీడీవోలు తాసిల్దారులు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారని, కొనుగోలు వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. అకాల వర్షం కురిస్తే ధాన్యం తడవకుండా వెంట వెంటనే మిల్లులకు స్టోరేజ్ కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. అదనపు తూకం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు. లారీలు, ట్రాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు..
- కరీంనగర్ లో శ్రీశైలం మూలిక వైద్యం...దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదిక్ మందులు పనిచేస్తాయని శ్రీశైలం మూలిక వైద్యం నిర్వాహకులు ఎం.కే నిఖిల్ తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్ లోని వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ లో శ్రీశైల మూలిక వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆయుర్వేద వైద్యులు ఎంకే నిఖిల్, క్యాంప్ ఆర్గనైజర్ నాగేంద్ర కుమార్ పాల్గొని ఆయుర్వేద వైద్యం గురించి వివరించారు. మోకాళ్ళ నొప్పులకు, కీళ్ల నొప్పులకు, వాతం, నడుము నొప్పి తలనొప్పి, సయాటికా, స్పాండిలైటీస్, గ్యాస్ ట్రబుల్, షుగర్, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు దీర్ఘకాల వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. మూలికల యొక్క గుణం ఏ రోజుకు ఆ రోజు రక్తాన్ని శుద్ధి చేస్తాయని తెలిపారు. ఆయుర్వేద మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆహారంలో ఒక భాగమని స్పష్టం చేశారు. ప్రతి నెల 11వ తేదీన కరీంనగర్లో శిబిరం ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు తక్కువ ధరలో మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.4
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వేసవి ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసంతో పాటు పలు అంశాల్లో శిక్షణ అందిస్తారు. మే 11 నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ విద్యార్థులకు సూచించారు.4
- వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ హనుమాన్ జయంతి, వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం భక్తులలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అలాగే తెలంగాణలో ఏ శుభకార్యం, పండుగ జరిగినా ముందుగా వేములవాడ కు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 58,867 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, కోడె మొక్కులు చెల్లించడం, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చనలు తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, క్యూ లైన్లు, విశ్రాంతి ఏర్పాట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి.1
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.1
- మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.1
- బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు… ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… గత మూడు రోజులుగా ఘటనపై ఎలాంటి స్పందన లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. “రక్షకుడే భక్షకుడు అయ్యాడు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సాధారణ వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీకి చెందిన వారి విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు..బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని, బాలికకు పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులు ఈ ఘటనపై స్పందించి ఆ చిన్నారికి న్యాయం జరిగేలా ముందుకు రావాలని కోరారు..మహిళల భద్రతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు…1
- మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్, గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.3
- హైదరాబాద్ లో యువకుడు హత్య...పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో శవం...11 రోజుల తర్వాత దొరికిన ఆచూకీ, మహిళతో సహా ముగ్గురు అరెస్టు. ప్రేమ యవ్వారం వేధింపులు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమించిన యువతి దక్కకపోవడంతో ఫోన్ లో వేధిస్తు ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళడంతో పక్క ప్లాన్ తో. హైదరాబాద్ లో హత్య చేసి మంథని అటవీ ప్రాంతంలో శవాన్ని పడేశారు. 11 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవం లభించడంతో పోలీసులు హత్య కేసును చేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ దారుణ హత్యకు గురయ్యారు. పది రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో అతని శవం లభించింది. హైదరాబాదులో హత్యకు గురైతే శవం మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులోని గాడిదలగండి వద్ద లోయలో లభించింది. ప్రేమ యవ్వారం, వేధింపులే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. గోదావరిఖని ఏ సి పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వంశీ కి అదే గ్రామానికి చెందిన అలేఖ్యతో టెన్త్ క్లాస్ లో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమాయణం సాగించారు. కానీ అలేఖ్య మరో యువకుడు నీలం నవీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల టెన్త్ క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ లో కలిసిన వంశీ, అలేఖ్య ఫోన్ నెంబర్ తీసుకొని నిత్యం ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులతోపాటు ఏకంగా వారి ఇంటికే వెళ్ళి గొడవపడ్డాడు. విసిగిపోయిన అలేఖ్య తన భర్తకు విషయం చెప్పడంతో పక్కా ప్లాన్ తో అతన్ని అంతమొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అలేఖ్యకు వంశీ ఫోన్ చేయగానే హైదరాబాదులో తన ప్లాట్ కు రమ్మంది. వెంటనే వంశీ ఏప్రిల్ 30న హైదరాబాద్ కు వెళ్లాడు. అలేఖ్య ప్లాట్ కు వెళ్ళిన వంశీని నవీన్ భాస్కర్ కారులో తీసుకుని భాస్కర్ రూమ్ కి వెళ్లారు. డ్యూటీ ఉందని నవీన్ బయటికి వెళ్లి పోగా వంశీ, భాస్కర్ మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం తాగిన అనంతరం కత్తి తీసుకుని వంశీని హత్య చేసి చాపలో చుట్టి కార్ లో భాస్కర్ ఒక్కరే మంథని కి తరలించి గాడుదులగండి వద్ద లోయలో పడేశారు. 29న ఇంటి నుంచి వెళ్లిన వంశీ తిరిగి రాకపోవడంతో తల్లి శంకరమ్మ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీ కాల్ డాటా సేకరించగా అలేఖ్య నవీన్ భాస్కర్ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా మృతదేహాన్ని మంథని వద్ద గాడుదలగండి లోయలో పడేసినట్టు తెలుపడంతో ఆదివారం పోలీసులు శవాన్ని వెలికి తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువుల ఆందోళనకు దిగారు. బంధువుల డిమాండ్ మేరకు పోలీసులు హత్య కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు ఏసిపి రమేష్ తెలిపారు.3
- సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . దేశం కోసం,, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడంలేదు. నోర్లు మూతపడ్డాయెందుకు ప్రశ్నించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.2