Shuru
Apke Nagar Ki App…
ఈరోజు నిజామాబాద్లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్ను ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు గారు, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ గారు పరామర్శించారు. ఈరోజు నిజామాబాద్లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్ను ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు గారు, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ గారు పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి దిగంబర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Dantulwar Sopan D
ఈరోజు నిజామాబాద్లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్ను ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు గారు, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ గారు పరామర్శించారు. ఈరోజు నిజామాబాద్లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్ను ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు గారు, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ గారు పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి దిగంబర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
More news from తెలంగాణ and nearby areas
- 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేత లొంగుబాటు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు నిక్కా శశీల అలియాస్ రాజి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 57 ఏళ్ల నిక్కా శశీల 1992లో పీపుల్స్ వార్‌లో చేరి.. 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. అనారోగ్య సమస్యల కారణంగా మావోయిస్టు పార్టీని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన శశీలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చెక్‌తో పాటు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన మావోయిస్టు కేడర్లు కూడా హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.1
- రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో మహా గర్జన సభ సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో సంగమేశ్వర గౌడ్ మాట్లాడుతూ..1-03-2026 నుంచి 31-08-2026 వరకు చేసిన జమ కర్చుల గురించి చదివి వినిపించారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్,తదితరులు ఉన్నారు1
- నయాబాది టీచర్స్ కాలనీలో చిన్నారులచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం చిన్నారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్దలు పాల్గొని చిన్నారులకు సహకరించారు.1
- నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్.... బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.1
- నాగిరెడ్డిపేట:పోచారం ప్రాజెక్టులోకి 306 క్యూసెక్కుల వరద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. రాత్రి కురిసిన వర్షాలకు మంగళవారం ఉదయం 6 గంటలకు 306 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ఏఈ అక్షయ్‌కుమార్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 230 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. మరో 38 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందని పేర్కొన్నారు.ప్రాజెక్టు నుండి ప్రతిరోజు మీరు విడుదల కావడంతో రెండు అడుగుల ప్రాజెక్టు నీటిమట్టం తగ్గి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 కాడులు కాగా 19 అడుగులకు చేరింది మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్ పొంగిపొర్లి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంజీరా నదిలోకి చేరి నిజం సార్ ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది1
- అమర ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు కొంగలి వెంకటి నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగడం జరుగుతుంది, ఈ దీక్షకు అంబేద్కర్ సంఘం, జిల్లా అధ్యక్షుడు కొత్తోల గంగారాం, ప్రధాన కార్యదర్శి గైనీ రాజు,గౌరవ అధ్యక్షులు మల్లన్న రాష్ట్ర నాయకులు సంగీ రాజలింగం, సూపర్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ ఆశన్న,బహుజన దళిత పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర శివరాజు జిల్లా అధ్యక్షుడు సబ్బాని స్వామి,ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మీ, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య, లింగంపేట్ మాజీ ఎంపీపీ ముధం సాయిలు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవాసమితి అధ్యక్షులు భూపతి , తెలంగాణ రక్షణ సేన నాయకులు పెరుమాండ్ల రాములు, ఆర్టిఐ రాష్ట్ర కార్యదర్శి లెగ్గిల రాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదుచేసి రాసిన పుస్తకన్నీ వెంటనే నిషేధించాలని అమర ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమర ప్రసాద్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కూడా పట్టించుకోవడం లేదని, వెంటనే పట్టించుకోనీ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.2
- భైంసా : ఘనంగా ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయకుల నిమజ్జనం... నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు.తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకున్న భక్తులు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భైంసాలోని స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భక్తులు తమ తమ ఇంట్లో నుండి వినాయక ప్రతిమలను తీసుకోని గణపతి బప్పా మోరియా అంటూ జలాశయం వద్దకు తీసుకవెళ్లి అక్కడ ఆ గణేశునికి హారతులు నిర్వహించి నిమజ్జనం చేశారు.దీంతో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.1
- బోధన్ రకాసిపేట్‌లోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాలు.. విద్యార్థులకు ఘనంగా బహుమతుల ప్రదానం బోధన్: బోధన్ రకాసిపేట్ ప్రాంతంలోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాల సందర్భంగా ఘనంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మదర్సా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ధార్మిక విద్య, క్రమశిక్షణ కూడా అందించడం ఎంతో అవసరమని తెలిపారు. సమాజంలో జ్ఞానం, నైతికత, మానవత్వం కోసం మదర్సాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రెసెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మీర్ జావేద్ అలీ మాట్లాడుతూ.. దైవిక విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టమని, విద్యార్థులు దైవిక విద్యతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఆధునిక విద్యను కూడా అభ్యసించాలని సూచించారు. వివిధ భాషల విద్యను అందించే ఉపాధ్యాయుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మదర్సా అధ్యక్షుడు సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు ధార్మిక విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో హాఫిజ్‌లు, ఆలిమ్‌లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దైవిక విద్యతో పాటు ఆధునిక విద్య, కంప్యూటర్ విద్య కూడా అవసరమని, విద్యార్థుల కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మదర్సా ప్రధాన నిర్వాహకులు హాజీ సుల్తాన్ ఖాద్రీ పర్యవేక్షణలో విద్యార్థులకు ధార్మిక విద్యతో పాటు విద్యా రంగంలో కూడా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నారు. హాఫిజ్ అబ్దుల్ మతీన్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జీ టుడే న్యూస్ చానల్ చీఫ్ ఎడిటర్ నాసిర్ మిర్జా పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ, జనరల్ సెక్రటరీ అక్బర్ ఖాన్ ఖాద్రీ, గౌస్ ఖాద్రీ, లతీఫ్ అహ్మద్ ఖాద్రీ, కౌన్సిలర్ రఫీ, కౌన్సిలర్ జావేద్, మీర్ జావేద్ అలీ, సనా పటేల్, హాఫిజ్ అబ్దుల్ మతీన్, ప్రధాన నిర్వాహకులు సుల్తాన్ ఖాద్రీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.1