logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భైంసా : ఘనంగా ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయకుల నిమజ్జనం... నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు.తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకున్న భక్తులు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భైంసాలోని స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భక్తులు తమ తమ ఇంట్లో నుండి వినాయక ప్రతిమలను తీసుకోని గణపతి బప్పా మోరియా అంటూ జలాశయం వద్దకు తీసుకవెళ్లి అక్కడ ఆ గణేశునికి హారతులు నిర్వహించి నిమజ్జనం చేశారు.దీంతో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.

9 hrs ago
user_Murali
Murali
Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
9 hrs ago

భైంసా : ఘనంగా ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయకుల నిమజ్జనం... నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు.తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకున్న భక్తులు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భైంసాలోని స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భక్తులు తమ తమ ఇంట్లో నుండి వినాయక ప్రతిమలను తీసుకోని గణపతి బప్పా మోరియా అంటూ జలాశయం వద్దకు తీసుకవెళ్లి అక్కడ ఆ గణేశునికి హారతులు నిర్వహించి నిమజ్జనం చేశారు.దీంతో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.

More news from తెలంగాణ and nearby areas
  • భైంసా : ఘనంగా ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయకుల నిమజ్జనం... నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు.తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకున్న భక్తులు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భైంసాలోని స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భక్తులు తమ తమ ఇంట్లో నుండి వినాయక ప్రతిమలను తీసుకోని గణపతి బప్పా మోరియా అంటూ జలాశయం వద్దకు తీసుకవెళ్లి అక్కడ ఆ గణేశునికి హారతులు నిర్వహించి నిమజ్జనం చేశారు.దీంతో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.
    1
    భైంసా : ఘనంగా ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయకుల నిమజ్జనం...
నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు.తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకున్న భక్తులు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భైంసాలోని స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భక్తులు తమ తమ ఇంట్లో నుండి వినాయక ప్రతిమలను తీసుకోని గణపతి బప్పా మోరియా అంటూ జలాశయం వద్దకు తీసుకవెళ్లి అక్కడ ఆ గణేశునికి హారతులు నిర్వహించి నిమజ్జనం చేశారు.దీంతో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్.... బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.
    1
    నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్....
బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    8 hrs ago
  • శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    1
    శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
  • నిర్మల్ జిల్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా: *విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బందికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటల మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని తరగతులకు సంబంధించిన సిలబస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం వారిని సిద్ధం చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, రోజువారిగా అందిస్తున్న భోజనం, వసతి, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి పలు లెక్కలను బోర్డుపై విద్యార్థులతో చేయించి, లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, పెన్నులను బహుమతులుగా ఇచ్చారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. ఏ సబ్జెక్టులో అయినా ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమీపంలో నిర్మాణం చివరి దశకు చేరుకున్న పాఠశాల భవంతిని కలెక్టర్ పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి భవనాన్ని వినియోగానికి తేవాలని తెలిపారు. ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    2
    నిర్మల్ జిల్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. 
   మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నిర్మల్ జిల్లా:
*విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పాలి:  జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. 
మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బందికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటల మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని తరగతులకు సంబంధించిన సిలబస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం వారిని సిద్ధం చేయాలన్నారు.
పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, రోజువారిగా అందిస్తున్న భోజనం, వసతి, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి పలు లెక్కలను బోర్డుపై విద్యార్థులతో చేయించి, లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, పెన్నులను బహుమతులుగా ఇచ్చారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. ఏ సబ్జెక్టులో అయినా ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.    సమీపంలో నిర్మాణం చివరి దశకు చేరుకున్న పాఠశాల భవంతిని కలెక్టర్ పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి భవనాన్ని వినియోగానికి తేవాలని తెలిపారు.
ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_Douda karthik
    Douda karthik
    Local News Reporter నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    6 hrs ago
  • బోధన్ రకాసిపేట్‌లోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్‌లో షష్మాహీ పరీక్షల ఫలితాలు.. విద్యార్థులకు ఘనంగా బహుమతుల ప్రదానం బోధన్: బోధన్ రకాసిపేట్ ప్రాంతంలోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాల సందర్భంగా ఘనంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మదర్సా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ధార్మిక విద్య, క్రమశిక్షణ కూడా అందించడం ఎంతో అవసరమని తెలిపారు. సమాజంలో జ్ఞానం, నైతికత, మానవత్వం కోసం మదర్సాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రెసెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మీర్ జావేద్ అలీ మాట్లాడుతూ.. దైవిక విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టమని, విద్యార్థులు దైవిక విద్యతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఆధునిక విద్యను కూడా అభ్యసించాలని సూచించారు. వివిధ భాషల విద్యను అందించే ఉపాధ్యాయుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మదర్సా అధ్యక్షుడు సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు ధార్మిక విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో హాఫిజ్‌లు, ఆలిమ్‌లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దైవిక విద్యతో పాటు ఆధునిక విద్య, కంప్యూటర్ విద్య కూడా అవసరమని, విద్యార్థుల కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మదర్సా ప్రధాన నిర్వాహకులు హాజీ సుల్తాన్ ఖాద్రీ పర్యవేక్షణలో విద్యార్థులకు ధార్మిక విద్యతో పాటు విద్యా రంగంలో కూడా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నారు. హాఫిజ్ అబ్దుల్ మతీన్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జీ టుడే న్యూస్ చానల్ చీఫ్ ఎడిటర్ నాసిర్ మిర్జా పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ, జనరల్ సెక్రటరీ అక్బర్ ఖాన్ ఖాద్రీ, గౌస్ ఖాద్రీ, లతీఫ్ అహ్మద్ ఖాద్రీ, కౌన్సిలర్ రఫీ, కౌన్సిలర్ జావేద్, మీర్ జావేద్ అలీ, సనా పటేల్, హాఫిజ్ అబ్దుల్ మతీన్, ప్రధాన నిర్వాహకులు సుల్తాన్ ఖాద్రీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
    1
    బోధన్ రకాసిపేట్‌లోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్‌లో షష్మాహీ పరీక్షల ఫలితాలు.. విద్యార్థులకు ఘనంగా బహుమతుల ప్రదానం
బోధన్: బోధన్ రకాసిపేట్ ప్రాంతంలోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాల సందర్భంగా ఘనంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా మదర్సా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ధార్మిక విద్య, క్రమశిక్షణ కూడా అందించడం ఎంతో అవసరమని తెలిపారు. సమాజంలో జ్ఞానం, నైతికత, మానవత్వం కోసం మదర్సాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రెసెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మీర్ జావేద్ అలీ మాట్లాడుతూ.. దైవిక విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టమని, విద్యార్థులు దైవిక విద్యతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఆధునిక విద్యను కూడా అభ్యసించాలని సూచించారు. వివిధ భాషల విద్యను అందించే ఉపాధ్యాయుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
మదర్సా అధ్యక్షుడు సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు ధార్మిక విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో హాఫిజ్‌లు, ఆలిమ్‌లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దైవిక విద్యతో పాటు ఆధునిక విద్య, కంప్యూటర్ విద్య కూడా అవసరమని, విద్యార్థుల కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
మదర్సా ప్రధాన నిర్వాహకులు హాజీ సుల్తాన్ ఖాద్రీ పర్యవేక్షణలో విద్యార్థులకు ధార్మిక విద్యతో పాటు విద్యా రంగంలో కూడా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నారు. హాఫిజ్ అబ్దుల్ మతీన్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో జీ టుడే న్యూస్ చానల్ చీఫ్ ఎడిటర్ నాసిర్ మిర్జా పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు.
కార్యక్రమంలో సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ, జనరల్ సెక్రటరీ అక్బర్ ఖాన్ ఖాద్రీ, గౌస్ ఖాద్రీ, లతీఫ్ అహ్మద్ ఖాద్రీ, కౌన్సిలర్ రఫీ, కౌన్సిలర్ జావేద్, మీర్ జావేద్ అలీ, సనా పటేల్, హాఫిజ్ అబ్దుల్ మతీన్, ప్రధాన నిర్వాహకులు సుల్తాన్ ఖాద్రీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • చెరువును తలపిస్తున్న భీంపూర్ మండలంలోని ప్రధాన రహదారులు భీంపూర్ మండలంలోని వడూరు నుంచి ఆర్లీ(టీ) గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం గుంతలలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆయా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    1
    చెరువును తలపిస్తున్న భీంపూర్ మండలంలోని ప్రధాన రహదారులు
భీంపూర్ మండలంలోని వడూరు నుంచి ఆర్లీ(టీ) గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం గుంతలలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆయా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    31 min ago
  • గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా బేల్లూరిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము న్యూస్, జైనాథ్: మండలంలోని బేల్లూరి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒకచోటికి చేరారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లంబోదరుడి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా బేల్లూరిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము


న్యూస్, జైనాథ్: మండలంలోని బేల్లూరి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒకచోటికి చేరారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లంబోదరుడి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    45 min ago
  • బాసర లో పిచ్చి కుక్కల, కోతుల స్వైర విహారం.. ఆందోళన లో స్థానికులు... బాసర మండలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం పెరిగిపోతుంది. కాలనీలతో పాటు, బాసర లోని ప్రధాన రోడ్ల పై కుక్కలు, కోతులు యధేచ్చగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతం లో చిన్నారులపై, మహిళల పై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ వైపు కోతులు మరోవైపు కుక్కల వల్ల చిన్నారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోతులు, కుక్కల బెడద నుండి అరకట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    బాసర లో పిచ్చి కుక్కల, కోతుల స్వైర విహారం.. ఆందోళన లో స్థానికులు...
బాసర మండలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం పెరిగిపోతుంది. కాలనీలతో పాటు, బాసర లోని ప్రధాన రోడ్ల పై కుక్కలు, కోతులు యధేచ్చగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతం లో చిన్నారులపై, మహిళల పై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ వైపు కోతులు మరోవైపు కుక్కల వల్ల చిన్నారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోతులు, కుక్కల బెడద నుండి అరకట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.