logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుల కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైకల్యం విజయానికి అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన అడ్డంకి అని మంత్రి ఉద్ఘాటించారు. శరీరానికి పరిమితులు ఉండొచ్చు కానీ సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవని, హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికి శాశ్వత స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. కేవలం 19 నెలల వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా ఆమె తన సంకల్పబలంతో ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. విద్యార్థులను ఉద్దేశించి మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, దివ్యాంగులు జాలి కోరేవారు కాదని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు అని అన్నారు. వారి వైకల్యం వారి గుర్తింపు కాదని, వారి విజయమే అసలైన గుర్తింపు అని స్పష్టం చేశారు. ప్రపంచం లోపాన్ని గుర్తుంచుకోదని, సాధించిన విజయాన్ని మాత్రమే చరిత్ర గుర్తుంచుకుంటుందని ఉద్బోధించారు. దృష్టిలోపాన్ని అధిగమించి సివిల్ సర్వీసుల్లో అత్యున్నత విజయాలు సాధించిన యువతను ఉదాహరణగా పేర్కొంటూ, కుటుంబం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని తెలిపారు. ఈ రోజు బెంచ్‌పై కూర్చున్న విద్యార్థులే రేపు జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు కావాలని ఆకాంక్షించారు. వారి పేరు ముందు 'దివ్యాంగుడు' కాదు, 'విజేత' అని సమాజం పిలిచే రోజు రావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హెలెన్ కెల్లర్ తన గురువు ఆన్ సలివన్ మార్గదర్శకత్వంలో స్పర్శ ద్వారా విద్యను అభ్యసించి, దృష్టి-శ్రవణ వైకల్యం ఉన్న తొలి డిగ్రీధారిణిగా చరిత్ర సృష్టించిందని, రచయిత్రిగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. ఆమె చీకటిలో జీవించినా ప్రపంచానికి వెలుగు చూపించిందని, హెలెన్ కెల్లర్ కేవలం ఒక వ్యక్తి కాదని, పట్టుదల అనే పదానికి ప్రత్యక్ష రూపం అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దివ్యాంగులను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అడ్లూరి వెల్లడించారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచడం, స్కూటీలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు, సహాయక పరికరాల పంపిణీ వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు పారదర్శకంగా సహాయం అందించామని వివరించారు. దివ్యాంగ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీలు పొందేందుకు జీవో నెం. 34 ద్వారా అవకాశం కల్పించడం ఈ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తూ కరీంనగర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న ప్రత్యేక పాఠశాలలను త్వరలో ఇంటర్మీడియట్ వరకు విస్తరించనున్నామని, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల్లో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దివ్యాంగుల పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 4,000 నుంచి రూ. 6,000కు పెంచే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు వారి కోటా ప్రకారం ప్రాధాన్యతనిస్తూ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల్లోనూ వారికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు. దివ్యాంగుల కష్టాలు తనకు బాగా తెలుసని, తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. మీకు మంత్రిగా కాకుండా, మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, మీ సమస్యల పరిష్కారం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. గత పాలకులు దాదాపు పదేళ్లపాటు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం మాత్రం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. వికలాంగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన జావేద్ అబిద్ విగ్రహాన్ని త్వరలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తానని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన పలువురు దివ్యాంగ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర సహాయక పరికరాలు అందజేశారు. అవరోధాలను అవకాశాలుగా, పరిమితులను విజయాలుగా మార్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని, తెలంగాణ అభివృద్ధి గాథలో మన విజయాలను స్వర్ణాక్షరాలతో లిఖిద్దామని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దివ్యాంగ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ వేడుకల్లో మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, దివ్యాంగుల శాఖ సంచాలకురాలు శైలజ, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ప్రభంజన్, వివిధ దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Sk chaitanya
Sk chaitanya
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
2 hrs ago

హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుల కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైకల్యం విజయానికి అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన అడ్డంకి అని మంత్రి ఉద్ఘాటించారు. శరీరానికి పరిమితులు ఉండొచ్చు కానీ సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవని, హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికి శాశ్వత స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. కేవలం 19 నెలల వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా ఆమె తన సంకల్పబలంతో ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. విద్యార్థులను ఉద్దేశించి మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, దివ్యాంగులు జాలి కోరేవారు కాదని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు అని అన్నారు. వారి వైకల్యం వారి గుర్తింపు కాదని, వారి విజయమే అసలైన గుర్తింపు అని స్పష్టం చేశారు. ప్రపంచం లోపాన్ని గుర్తుంచుకోదని, సాధించిన విజయాన్ని మాత్రమే చరిత్ర గుర్తుంచుకుంటుందని ఉద్బోధించారు. దృష్టిలోపాన్ని అధిగమించి సివిల్ సర్వీసుల్లో అత్యున్నత విజయాలు సాధించిన యువతను ఉదాహరణగా పేర్కొంటూ, కుటుంబం, పట్టుదల,

828bd159-1192-40b2-a76f-f5a964179c3a

ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని తెలిపారు. ఈ రోజు బెంచ్‌పై కూర్చున్న విద్యార్థులే రేపు జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు కావాలని ఆకాంక్షించారు. వారి పేరు ముందు 'దివ్యాంగుడు' కాదు, 'విజేత' అని సమాజం పిలిచే రోజు రావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హెలెన్ కెల్లర్ తన గురువు ఆన్ సలివన్ మార్గదర్శకత్వంలో స్పర్శ ద్వారా విద్యను అభ్యసించి, దృష్టి-శ్రవణ వైకల్యం ఉన్న తొలి డిగ్రీధారిణిగా చరిత్ర సృష్టించిందని, రచయిత్రిగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. ఆమె చీకటిలో జీవించినా ప్రపంచానికి వెలుగు చూపించిందని, హెలెన్ కెల్లర్ కేవలం ఒక వ్యక్తి కాదని, పట్టుదల అనే పదానికి ప్రత్యక్ష రూపం అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దివ్యాంగులను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అడ్లూరి వెల్లడించారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచడం, స్కూటీలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు, సహాయక పరికరాల పంపిణీ వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా

d26f830e-98e0-4ad5-9a0a-00fbf8689926

33 జిల్లాల్లో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు పారదర్శకంగా సహాయం అందించామని వివరించారు. దివ్యాంగ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీలు పొందేందుకు జీవో నెం. 34 ద్వారా అవకాశం కల్పించడం ఈ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తూ కరీంనగర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న ప్రత్యేక పాఠశాలలను త్వరలో ఇంటర్మీడియట్ వరకు విస్తరించనున్నామని, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల్లో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దివ్యాంగుల పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 4,000 నుంచి రూ. 6,000కు పెంచే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు వారి కోటా ప్రకారం ప్రాధాన్యతనిస్తూ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల్లోనూ వారికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు. దివ్యాంగుల కష్టాలు తనకు బాగా తెలుసని, తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. మీకు మంత్రిగా కాకుండా, మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, మీ సమస్యల

5eac8693-6d26-4c3e-9cde-d93c52ed08d6

పరిష్కారం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. గత పాలకులు దాదాపు పదేళ్లపాటు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం మాత్రం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. వికలాంగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన జావేద్ అబిద్ విగ్రహాన్ని త్వరలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తానని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన పలువురు దివ్యాంగ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర సహాయక పరికరాలు అందజేశారు. అవరోధాలను అవకాశాలుగా, పరిమితులను విజయాలుగా మార్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని, తెలంగాణ అభివృద్ధి గాథలో మన విజయాలను స్వర్ణాక్షరాలతో లిఖిద్దామని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దివ్యాంగ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ వేడుకల్లో మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, దివ్యాంగుల శాఖ సంచాలకురాలు శైలజ, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ప్రభంజన్, వివిధ దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కోనరావుపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, మల్కపేట గ్రామ సర్పంచ్ బోయిని దేవరాజు, ధాన్యం అక్రమ రవాణా వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ దురుద్దేశంతో కూడినవిగా అభివర్ణించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. శనివారం వేములవాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు షేక్ ఫిరోజ్ పాషా, చేపూరి గంగాధర్, ఫ్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవరాజు మాట్లాడారు. చెల్మెడ లక్ష్మీనరసింహారావు స్వగ్రామంలో కాంగ్రెస్ తరఫున సర్పంచ్‌గా తాను గెలవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కొందరు బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ చంద్రయ్య తనపై రాజకీయ కుట్రలు పన్నుతున్నారని ఆయన పేర్కొన్నారు. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ వద్దకు తాను గ్రామస్థుల సమాచారంతో, కేవలం సర్పంచ్ హోదాలో మాత్రమే వెళ్లానని దేవరాజు వివరించారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను సాక్ష్యాధారాల కోసం తానే తీయించానని చెప్పారు. ధాన్యం అక్రమ రవాణాతో గానీ, సంబంధిత వ్యక్తులతో గానీ తనకు ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. మల్కపేట గ్రామ సర్పంచ్‌గా తాను ఏ తప్పు చేసినా, ప్రజాక్షేత్రంలో నిరూపిస్తే వెంటనే పదవికి రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించిన దేవరాజు, మాజీ ఎంపీపీ చంద్రయ్య ప్రజల ముందుకు వచ్చి నిజానిజాలు తేల్చాలని మరోసారి సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
    1
    కోనరావుపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, మల్కపేట గ్రామ సర్పంచ్ బోయిని దేవరాజు, ధాన్యం అక్రమ రవాణా వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ దురుద్దేశంతో కూడినవిగా అభివర్ణించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు.

శనివారం వేములవాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు షేక్ ఫిరోజ్ పాషా, చేపూరి గంగాధర్, ఫ్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవరాజు మాట్లాడారు. చెల్మెడ లక్ష్మీనరసింహారావు స్వగ్రామంలో కాంగ్రెస్ తరఫున సర్పంచ్‌గా తాను గెలవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కొందరు బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ చంద్రయ్య తనపై రాజకీయ కుట్రలు పన్నుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ వద్దకు తాను గ్రామస్థుల సమాచారంతో, కేవలం సర్పంచ్ హోదాలో మాత్రమే వెళ్లానని దేవరాజు వివరించారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను సాక్ష్యాధారాల కోసం తానే తీయించానని చెప్పారు. ధాన్యం అక్రమ రవాణాతో గానీ, సంబంధిత వ్యక్తులతో గానీ తనకు ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. మల్కపేట గ్రామ సర్పంచ్‌గా తాను ఏ తప్పు చేసినా, ప్రజాక్షేత్రంలో నిరూపిస్తే వెంటనే పదవికి రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించిన దేవరాజు, మాజీ ఎంపీపీ చంద్రయ్య ప్రజల ముందుకు వచ్చి నిజానిజాలు తేల్చాలని మరోసారి సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 min ago
  • కరీంనగర్ శాసనసభ్యులు, మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు శనివారం కరీంనగర్‌లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోయిన ఎల్ఎండీ జలాశయంలో ఆటలు ఆడుతూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిరసన తెలియజేశారు. కరీంనగర్ నగర ప్రజలు, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరువు వచ్చినప్పుడే ఆదుకునే కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నర ఏళ్లలో కెసిఆర్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించారని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు కూడా చేయలేక చేతగానితనాన్ని ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. కేవలం కెసిఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించడం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్ చరిత్రలో రెండు దశాబ్దాలలో జూలై మాసంలో ఎల్ఎండీ నీటి నిల్వలు డేడ్ స్టోరేజ్‌కు పడిపోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. మేడిగడ్డను మరమ్మత్తు చేయకపోవడం వల్ల ప్రతిరోజు 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తుందని గంగుల కమలాకర్ తెలిపారు. ఆ నీటిని నిల్వ చేసి, మేడిగడ్డ నుండి కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లిలకు తరలించి, ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి, వరద కాల్వ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండీలను నీటితో నింపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా, మిడ్ మానేరుపై ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేసి కొత్తపెళ్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగుల మల్యాల, బద్దిపల్లి, కమాన్‌పూర్, శ్రీరాములపల్లి, కాజీపూర్ గ్రామ చెరువులను నింపాలని సూచించారు. ప్రస్తుతం ఎల్ఎండీలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని, ఇందులో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కాగా, కేవలం రెండు టీఎంసీల నీటితో కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందించలేమని వివరించారు. గత టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు తాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీళ్లు అందిస్తోందని ఆయన ఎత్తిచూపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరీంనగర్ ప్రజలకు తాగునీటికి, ఎల్ఎండీపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఏప్రిల్, మే మాసాలలోనే ప్రాజెక్టులన్నింటినీ నింపి, చెరువులకు నీరు తరలించి మత్తడులు దుంకించిన విషయాన్ని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఎండీలో ఎప్పుడూ 10.5 టీఎంసీలు నిలువ ఉండేవిధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కన్నెపల్లిలోని మోటార్లను ఆన్ చేసి, మిడ్ మానేరు, ఎల్ఎండీలను నింపాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బేషజాలకు పోకుండా ప్రజలకు నీరందించాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే, కెసిఆర్ నాయకత్వంలో కెటిఆర్, హరీష్ రావు, ఇతర బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బారాస కార్పొరేటర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్ శాసనసభ్యులు, మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు శనివారం కరీంనగర్‌లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోయిన ఎల్ఎండీ జలాశయంలో ఆటలు ఆడుతూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిరసన తెలియజేశారు. కరీంనగర్ నగర ప్రజలు, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరువు వచ్చినప్పుడే ఆదుకునే కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నర ఏళ్లలో కెసిఆర్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించారని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు కూడా చేయలేక చేతగానితనాన్ని ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. కేవలం కెసిఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించడం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్ చరిత్రలో రెండు దశాబ్దాలలో జూలై మాసంలో ఎల్ఎండీ నీటి నిల్వలు డేడ్ స్టోరేజ్‌కు పడిపోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు.

మేడిగడ్డను మరమ్మత్తు చేయకపోవడం వల్ల ప్రతిరోజు 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తుందని గంగుల కమలాకర్ తెలిపారు. ఆ నీటిని నిల్వ చేసి, మేడిగడ్డ నుండి కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లిలకు తరలించి, ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి, వరద కాల్వ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండీలను నీటితో నింపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా, మిడ్ మానేరుపై ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేసి కొత్తపెళ్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగుల మల్యాల, బద్దిపల్లి, కమాన్‌పూర్, శ్రీరాములపల్లి, కాజీపూర్ గ్రామ చెరువులను నింపాలని సూచించారు. ప్రస్తుతం ఎల్ఎండీలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని, ఇందులో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కాగా, కేవలం రెండు టీఎంసీల నీటితో కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందించలేమని వివరించారు.

గత టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు తాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీళ్లు అందిస్తోందని ఆయన ఎత్తిచూపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరీంనగర్ ప్రజలకు తాగునీటికి, ఎల్ఎండీపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఏప్రిల్, మే మాసాలలోనే ప్రాజెక్టులన్నింటినీ నింపి, చెరువులకు నీరు తరలించి మత్తడులు దుంకించిన విషయాన్ని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఎండీలో ఎప్పుడూ 10.5 టీఎంసీలు నిలువ ఉండేవిధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కన్నెపల్లిలోని మోటార్లను ఆన్ చేసి, మిడ్ మానేరు, ఎల్ఎండీలను నింపాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బేషజాలకు పోకుండా ప్రజలకు నీరందించాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే, కెసిఆర్ నాయకత్వంలో కెటిఆర్, హరీష్ రావు, ఇతర బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బారాస కార్పొరేటర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో, స్వస్తివాచనంతో ఘన స్వాగతం పలికారు. ఆయన భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శని త్రయోదశి సందర్భంగా ఆలయంలోని నవగ్రహ మండపంలో శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం నల్ల వస్త్రం సమర్పించి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు చేసి, శని దోష నివారణ కోసం ప్రత్యేక అర్చనలు జరిపారు. పూజల అనంతరం, ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు స్వామివారి తీర్థప్రసాదం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి, సహాయ కార్య నిర్వహణాధికారులు ఏఈఓలు జి. శ్రావణ్ కుమార్, జి. అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నూగూరి నరేందర్, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు.

ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో, స్వస్తివాచనంతో ఘన స్వాగతం పలికారు. ఆయన భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

శని త్రయోదశి సందర్భంగా ఆలయంలోని నవగ్రహ మండపంలో శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం నల్ల వస్త్రం సమర్పించి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు చేసి, శని దోష నివారణ కోసం ప్రత్యేక అర్చనలు జరిపారు.

పూజల అనంతరం, ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు స్వామివారి తీర్థప్రసాదం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి, సహాయ కార్య నిర్వహణాధికారులు ఏఈఓలు జి. శ్రావణ్ కుమార్, జి. అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నూగూరి నరేందర్, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద, జూలై 5న భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్వహించనున్న "రాజ్యాధికార సమరభేరి" బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్ అల్లి సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి, కో-కన్వీనర్ రంజిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ, బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా జరుగుతున్న ఈ సభ చారిత్రాత్మకమైనదని అన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం జరిగే ఈ సభకు మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, బహుజన ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంజిత్, రవీంద్ర, మహేష్ వర్మ, దినకర్, శివ, రవీందర్, రూప, దిలీప్, లతీఫ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద, జూలై 5న భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్వహించనున్న "రాజ్యాధికార సమరభేరి" బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్ అల్లి సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి, కో-కన్వీనర్ రంజిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ, బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా జరుగుతున్న ఈ సభ చారిత్రాత్మకమైనదని అన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం జరిగే ఈ సభకు మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, బహుజన ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రంజిత్, రవీంద్ర, మహేష్ వర్మ, దినకర్, శివ, రవీందర్, రూప, దిలీప్, లతీఫ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని రాజవొమ్మంగి మండలం, అప్పలరాజుపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో వెండి రంగు బిందెలో పూజా సామగ్రి కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ వస్తువులను చూసిన వాహనదారులు తమ వాహనాలను ఆపి పరిశీలించగా, విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. రహదారిపై కనిపించిన ఈ బిందె, పూజా సామగ్రిని ఎవరు ఉంచారు, ఏ ఉద్దేశంతో ఉంచారు, మరియు శుక్రవారం రాత్రి ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్నలు స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామస్థులు ఈ వస్తువులు క్షుద్ర పూజల కోసం ఉంచి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. రాత్రి వేళ రహదారిపై ఇటువంటి వస్తువులు కనిపించడం వల్ల మహిళలు, చిన్నారులు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, ఈ వస్తువులను రహదారిపై ఉంచిన వారిని గుర్తించాలని, ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మరియు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని రాజవొమ్మంగి మండలం, అప్పలరాజుపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో వెండి రంగు బిందెలో పూజా సామగ్రి కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ వస్తువులను చూసిన వాహనదారులు తమ వాహనాలను ఆపి పరిశీలించగా, విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

రహదారిపై కనిపించిన ఈ బిందె, పూజా సామగ్రిని ఎవరు ఉంచారు, ఏ ఉద్దేశంతో ఉంచారు, మరియు శుక్రవారం రాత్రి ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్నలు స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామస్థులు ఈ వస్తువులు క్షుద్ర పూజల కోసం ఉంచి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. రాత్రి వేళ రహదారిపై ఇటువంటి వస్తువులు కనిపించడం వల్ల మహిళలు, చిన్నారులు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, ఈ వస్తువులను రహదారిపై ఉంచిన వారిని గుర్తించాలని, ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మరియు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    9 hrs ago
  • జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో ఎమ్‌ఎల్‌ఏ డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ పనులు EGS నిధుల కింద ₹10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టబడుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనంతారం నేషనల్ హైవే వంతెన విషయమై కేంద్రం మరియు ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం రాలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి అని, చిన్న, సన్నకారు రైతులు, అంటే రెండు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాకుండా, పేద మరియు మధ్యతరగతి ప్రజల కోసం సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సేవలు, రేషన్ కార్డులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన వివరించారు. గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలకు స్థలం గుర్తిస్తే, నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల్లో నూతన రోడ్లకు మహర్దశ పడుతుందని, వర్షాకాలంలో రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ రవీనా మహేష్, నాయకులు బాలముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, గంగన్న, గాదె శ్రీనివాస్, ఏఈ విజయ్, మాజీ ఎంపీటీసీ సురేందర్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్, సురేష్, ఇతర గ్రామ మండల నాయకులు పాల్గొన్నారు.
    2
    జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో ఎమ్‌ఎల్‌ఏ డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ పనులు EGS నిధుల కింద ₹10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టబడుతున్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనంతారం నేషనల్ హైవే వంతెన విషయమై కేంద్రం మరియు ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం రాలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి అని, చిన్న, సన్నకారు రైతులు, అంటే రెండు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాకుండా, పేద మరియు మధ్యతరగతి ప్రజల కోసం సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సేవలు, రేషన్ కార్డులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన వివరించారు. గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలకు స్థలం గుర్తిస్తే, నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల్లో నూతన రోడ్లకు మహర్దశ పడుతుందని, వర్షాకాలంలో రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ రవీనా మహేష్, నాయకులు బాలముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, గంగన్న, గాదె శ్రీనివాస్, ఏఈ విజయ్, మాజీ ఎంపీటీసీ సురేందర్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్, సురేష్, ఇతర గ్రామ మండల నాయకులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల మానేరు బ్రిడ్జిపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బ్రిడ్జిపైకి చేరుకుని నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంపై నిరసనగా ఈ ధర్నాకు దిగినట్లు యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 89 పరీక్ష పత్రాలు లీకయ్యాయని వారు తీవ్రంగా విమర్శించారు. దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ చదువులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రధాని మోడీ ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఎంతో కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలన్నీ ఆవిరయ్యాయని వారు పేర్కొన్నారు.
    2
    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల మానేరు బ్రిడ్జిపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బ్రిడ్జిపైకి చేరుకుని నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంపై నిరసనగా ఈ ధర్నాకు దిగినట్లు యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 89 పరీక్ష పత్రాలు లీకయ్యాయని వారు తీవ్రంగా విమర్శించారు. దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ చదువులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రధాని మోడీ ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఎంతో కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలన్నీ ఆవిరయ్యాయని వారు పేర్కొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • కోరిన కోరికలు తీర్చే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి కొత్త ఆలయం రాజన్న సన్నిధిలో భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి శైలజ రామయ్యర్ ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా, దేవస్థానం విస్తరణ పనుల్లో ఇప్పటివరకు 35 శాతం పూర్తయినట్లు ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు. మిగతా పనులను వచ్చే సంవత్సరం జూలైలోగా పూర్తి చేసి, ఆగస్టు నుంచి రాజన్న సన్నిధిలోనే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయని ఆమె పేర్కొన్నారు. వెయ్యేళ్లపాటు గుర్తుండేలా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ పనుల కోసం మరో ₹100 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు శైలజ రామయ్యర్ వెల్లడించారు.
    4
    కోరిన కోరికలు తీర్చే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి కొత్త ఆలయం రాజన్న సన్నిధిలో భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి శైలజ రామయ్యర్ ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా, దేవస్థానం విస్తరణ పనుల్లో ఇప్పటివరకు 35 శాతం పూర్తయినట్లు ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు. మిగతా పనులను వచ్చే సంవత్సరం జూలైలోగా పూర్తి చేసి, ఆగస్టు నుంచి రాజన్న సన్నిధిలోనే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయని ఆమె పేర్కొన్నారు. వెయ్యేళ్లపాటు గుర్తుండేలా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ పనుల కోసం మరో ₹100 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు శైలజ రామయ్యర్ వెల్లడించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లా కథలాపూర్ తహశీల్దార్ రమేష్ గౌడ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వేములవాడ నుండి కథలాపూర్ వైపు కారులో వెళ్తుండగా, పోసానిపేట వద్ద కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, తహశీల్దార్ రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆయనను వేములవాడకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన చేతికి ఫ్యాక్చర్ అయినట్లు నిర్ధారించారు. కారులో బెలూన్ ఓపెన్ కావడంతో తృటిలో ప్రాణాపాయం తప్పినట్లు భావిస్తున్నారు. పోసానిపేట వద్ద గత రెండు సంవత్సరాల్లో ఆరుగురు వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. నిత్యం కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలను నివారించేందుకు, మూల మలుపుల వద్ద సూచిక బోర్డులతో పాటు తగిన ఏర్పాట్లను సత్వరమే చేపట్టాలని వాహనదారులు, ప్రజలు ఆర్ అండ్ బి అధికారులను కోరుతున్నారు.
    3
    జగిత్యాల జిల్లా కథలాపూర్ తహశీల్దార్ రమేష్ గౌడ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వేములవాడ నుండి కథలాపూర్ వైపు కారులో వెళ్తుండగా, పోసానిపేట వద్ద కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, తహశీల్దార్ రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆయనను వేములవాడకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన చేతికి ఫ్యాక్చర్ అయినట్లు నిర్ధారించారు. కారులో బెలూన్ ఓపెన్ కావడంతో తృటిలో ప్రాణాపాయం తప్పినట్లు భావిస్తున్నారు.

పోసానిపేట వద్ద గత రెండు సంవత్సరాల్లో ఆరుగురు వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. నిత్యం కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలను నివారించేందుకు, మూల మలుపుల వద్ద సూచిక బోర్డులతో పాటు తగిన ఏర్పాట్లను సత్వరమే చేపట్టాలని వాహనదారులు, ప్రజలు ఆర్ అండ్ బి అధికారులను కోరుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.