logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ శాసనసభ్యులు, మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు శనివారం కరీంనగర్‌లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోయిన ఎల్ఎండీ జలాశయంలో ఆటలు ఆడుతూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిరసన తెలియజేశారు. కరీంనగర్ నగర ప్రజలు, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరువు వచ్చినప్పుడే ఆదుకునే కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నర ఏళ్లలో కెసిఆర్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించారని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు కూడా చేయలేక చేతగానితనాన్ని ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. కేవలం కెసిఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించడం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్ చరిత్రలో రెండు దశాబ్దాలలో జూలై మాసంలో ఎల్ఎండీ నీటి నిల్వలు డేడ్ స్టోరేజ్‌కు పడిపోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. మేడిగడ్డను మరమ్మత్తు చేయకపోవడం వల్ల ప్రతిరోజు 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తుందని గంగుల కమలాకర్ తెలిపారు. ఆ నీటిని నిల్వ చేసి, మేడిగడ్డ నుండి కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లిలకు తరలించి, ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి, వరద కాల్వ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండీలను నీటితో నింపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా, మిడ్ మానేరుపై ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేసి కొత్తపెళ్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగుల మల్యాల, బద్దిపల్లి, కమాన్‌పూర్, శ్రీరాములపల్లి, కాజీపూర్ గ్రామ చెరువులను నింపాలని సూచించారు. ప్రస్తుతం ఎల్ఎండీలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని, ఇందులో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కాగా, కేవలం రెండు టీఎంసీల నీటితో కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందించలేమని వివరించారు. గత టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు తాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీళ్లు అందిస్తోందని ఆయన ఎత్తిచూపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరీంనగర్ ప్రజలకు తాగునీటికి, ఎల్ఎండీపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఏప్రిల్, మే మాసాలలోనే ప్రాజెక్టులన్నింటినీ నింపి, చెరువులకు నీరు తరలించి మత్తడులు దుంకించిన విషయాన్ని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఎండీలో ఎప్పుడూ 10.5 టీఎంసీలు నిలువ ఉండేవిధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కన్నెపల్లిలోని మోటార్లను ఆన్ చేసి, మిడ్ మానేరు, ఎల్ఎండీలను నింపాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బేషజాలకు పోకుండా ప్రజలకు నీరందించాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే, కెసిఆర్ నాయకత్వంలో కెటిఆర్, హరీష్ రావు, ఇతర బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బారాస కార్పొరేటర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
2 hrs ago

కరీంనగర్ శాసనసభ్యులు, మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు శనివారం కరీంనగర్‌లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోయిన ఎల్ఎండీ జలాశయంలో ఆటలు ఆడుతూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిరసన తెలియజేశారు. కరీంనగర్ నగర ప్రజలు, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరువు వచ్చినప్పుడే ఆదుకునే కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నర ఏళ్లలో కెసిఆర్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించారని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు కూడా చేయలేక చేతగానితనాన్ని ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. కేవలం కెసిఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించడం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్ చరిత్రలో రెండు దశాబ్దాలలో జూలై మాసంలో ఎల్ఎండీ నీటి నిల్వలు డేడ్ స్టోరేజ్‌కు పడిపోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. మేడిగడ్డను మరమ్మత్తు చేయకపోవడం వల్ల ప్రతిరోజు 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తుందని గంగుల కమలాకర్ తెలిపారు. ఆ నీటిని నిల్వ చేసి, మేడిగడ్డ నుండి కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లిలకు తరలించి, ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి, వరద కాల్వ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండీలను నీటితో నింపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా, మిడ్ మానేరుపై ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేసి కొత్తపెళ్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగుల మల్యాల,

బద్దిపల్లి, కమాన్‌పూర్, శ్రీరాములపల్లి, కాజీపూర్ గ్రామ చెరువులను నింపాలని సూచించారు. ప్రస్తుతం ఎల్ఎండీలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని, ఇందులో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కాగా, కేవలం రెండు టీఎంసీల నీటితో కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందించలేమని వివరించారు. గత టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు తాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీళ్లు అందిస్తోందని ఆయన ఎత్తిచూపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరీంనగర్ ప్రజలకు తాగునీటికి, ఎల్ఎండీపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఏప్రిల్, మే మాసాలలోనే ప్రాజెక్టులన్నింటినీ నింపి, చెరువులకు నీరు తరలించి మత్తడులు దుంకించిన విషయాన్ని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఎండీలో ఎప్పుడూ 10.5 టీఎంసీలు నిలువ ఉండేవిధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కన్నెపల్లిలోని మోటార్లను ఆన్ చేసి, మిడ్ మానేరు, ఎల్ఎండీలను నింపాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బేషజాలకు పోకుండా ప్రజలకు నీరందించాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే, కెసిఆర్ నాయకత్వంలో కెటిఆర్, హరీష్ రావు, ఇతర బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బారాస కార్పొరేటర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 137-A, కరీంనగర్ మరియు వాసుదేవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న "అలయన్స్ గ్రీన్ అవార్డ్స్" పోస్టర్ డ్రాయింగ్ పోటీని అచీవర్స్ స్కూల్‌లో ఘనంగా ప్రారంభించారు. అలయన్స్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది "ప్రకృతి ప్రేరణ – మన భవిష్యత్తు కోసం వాతావరణం" అనే థీమ్‌తో ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో 4 నుండి 8 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు మొదటి కేటగిరీగా, 9 నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు రెండవ కేటగిరీగా పాల్గొనవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. విద్యార్థులు రూపొందించిన పోస్టర్‌లను జూలై 13వ తేదీలోపు అలయన్స్ జిల్లా గవర్నర్ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది, అనంతరం వాటిని ఇంటర్నేషనల్ స్థాయికి పంపిస్తారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.25,000, రెండవ బహుమతిగా రూ.15,000, మరియు మూడవ బహుమతిగా రూ.5,000 నగదు బహుమతులు అందజేయబడతాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఎలగండుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థుల ఉత్తమ చిత్రాలను అలయన్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌లో ప్రచురిస్తామని తెలిపారు. ప్రకృతి మనకు ప్రసాదించిన గాలి, నీరు, చెట్లు, భూమి వంటి అమూల్యమైన వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. "పచ్చదనాన్ని పరిరక్షిద్దాం – మన భవిష్యత్తును కాపాడుదాం" అనే సందేశంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలయన్స్ గ్రీన్ పోస్టర్ అవార్డును జిల్లా స్థాయిలో తొలిసారిగా అచీవర్స్ స్కూల్‌లో స్కూల్ చైర్మన్ శ్రీ చెరిమాల వెంకటేశ్వర్లు గారు అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎ శ్రీనివాస్, స్కూల్ చైర్మన్ చెరిమాల వెంకటేశ్వర్లు, జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, కుమారస్వామి, నాగేశ్వర్, పులాల శ్యామ్, సుద్దపల్లి ప్రసాద్, అల్లాడి ఆనంద్ కుమార్, అచీవర్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన అచీవర్స్ స్కూల్‌కు చెందిన సుమారు 50 మంది విద్యార్థులకు ప్రశంసా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
    1
    అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 137-A, కరీంనగర్ మరియు వాసుదేవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న "అలయన్స్ గ్రీన్ అవార్డ్స్" పోస్టర్ డ్రాయింగ్ పోటీని అచీవర్స్ స్కూల్‌లో ఘనంగా ప్రారంభించారు. అలయన్స్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది "ప్రకృతి ప్రేరణ – మన భవిష్యత్తు కోసం వాతావరణం" అనే థీమ్‌తో ఈ పోటీని నిర్వహిస్తోంది.

ఈ పోటీలో 4 నుండి 8 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు మొదటి కేటగిరీగా, 9 నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు రెండవ కేటగిరీగా పాల్గొనవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. విద్యార్థులు రూపొందించిన పోస్టర్‌లను జూలై 13వ తేదీలోపు అలయన్స్ జిల్లా గవర్నర్ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది, అనంతరం వాటిని ఇంటర్నేషనల్ స్థాయికి పంపిస్తారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.25,000, రెండవ బహుమతిగా రూ.15,000, మరియు మూడవ బహుమతిగా రూ.5,000 నగదు బహుమతులు అందజేయబడతాయి.

ఈ సందర్భంగా డాక్టర్ ఎలగండుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థుల ఉత్తమ చిత్రాలను అలయన్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌లో ప్రచురిస్తామని తెలిపారు. ప్రకృతి మనకు ప్రసాదించిన గాలి, నీరు, చెట్లు, భూమి వంటి అమూల్యమైన వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. "పచ్చదనాన్ని పరిరక్షిద్దాం – మన భవిష్యత్తును కాపాడుదాం" అనే సందేశంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలయన్స్ గ్రీన్ పోస్టర్ అవార్డును జిల్లా స్థాయిలో తొలిసారిగా అచీవర్స్ స్కూల్‌లో స్కూల్ చైర్మన్ శ్రీ చెరిమాల వెంకటేశ్వర్లు గారు అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎ శ్రీనివాస్, స్కూల్ చైర్మన్ చెరిమాల వెంకటేశ్వర్లు, జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, కుమారస్వామి, నాగేశ్వర్, పులాల శ్యామ్, సుద్దపల్లి ప్రసాద్, అల్లాడి ఆనంద్ కుమార్, అచీవర్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన అచీవర్స్ స్కూల్‌కు చెందిన సుమారు 50 మంది విద్యార్థులకు ప్రశంసా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని రాజవొమ్మంగి మండలం, అప్పలరాజుపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో వెండి రంగు బిందెలో పూజా సామగ్రి కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ వస్తువులను చూసిన వాహనదారులు తమ వాహనాలను ఆపి పరిశీలించగా, విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. రహదారిపై కనిపించిన ఈ బిందె, పూజా సామగ్రిని ఎవరు ఉంచారు, ఏ ఉద్దేశంతో ఉంచారు, మరియు శుక్రవారం రాత్రి ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్నలు స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామస్థులు ఈ వస్తువులు క్షుద్ర పూజల కోసం ఉంచి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. రాత్రి వేళ రహదారిపై ఇటువంటి వస్తువులు కనిపించడం వల్ల మహిళలు, చిన్నారులు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, ఈ వస్తువులను రహదారిపై ఉంచిన వారిని గుర్తించాలని, ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మరియు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని రాజవొమ్మంగి మండలం, అప్పలరాజుపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో వెండి రంగు బిందెలో పూజా సామగ్రి కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ వస్తువులను చూసిన వాహనదారులు తమ వాహనాలను ఆపి పరిశీలించగా, విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

రహదారిపై కనిపించిన ఈ బిందె, పూజా సామగ్రిని ఎవరు ఉంచారు, ఏ ఉద్దేశంతో ఉంచారు, మరియు శుక్రవారం రాత్రి ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్నలు స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామస్థులు ఈ వస్తువులు క్షుద్ర పూజల కోసం ఉంచి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. రాత్రి వేళ రహదారిపై ఇటువంటి వస్తువులు కనిపించడం వల్ల మహిళలు, చిన్నారులు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, ఈ వస్తువులను రహదారిపై ఉంచిన వారిని గుర్తించాలని, ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మరియు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    4 hrs ago
  • అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ శుక్రవారం విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రయాణికులు, విద్యార్థులు, యువత, ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని డీవైఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. నరేష్ పటేల్ మాట్లాడుతూ, నేడు దేశంలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందని, డ్రగ్స్ మాఫియా యువతను లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు వారి భవిష్యత్తు కూడా నాశనం అవుతోందని, కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా కొంతమంది యువత చెడు అలవాట్ల వైపు మళ్లడానికి కారణమవుతోందని నరేష్ పటేల్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగకుండా పోలీసు, ఎక్సైజ్ శాఖలు నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, విద్యాసంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని కోరారు. సినిమాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా మాదక ద్రవ్యాలను గ్లామరైజ్ చేసే ధోరణిని అరికట్టాలని, యువతలో శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యత పెంపొందించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన శిక్షలు అమలు చేయాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ బారిన పడిన యువతకు ఉచిత వైద్య, కౌన్సెలింగ్ సేవలు అందించాలని కోరారు. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని డీవైఎఫ్ఐ సూచించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం డీవైఎఫ్ఐ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అవసరమైతే ఉద్యమాలు కూడా చేపడుతుందని స్పష్టం చేసింది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు సమాజమంతా కృషి చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. నరేష్ పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్, కృష్ణ, నాయకులు దినేష్, కౌశిక్, ప్రసాద్, నాగరాజు, మురళి, చిన్ను, జీవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
    3
    అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ శుక్రవారం విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రయాణికులు, విద్యార్థులు, యువత, ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని డీవైఎఫ్ఐ పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. నరేష్ పటేల్ మాట్లాడుతూ, నేడు దేశంలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందని, డ్రగ్స్ మాఫియా యువతను లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు వారి భవిష్యత్తు కూడా నాశనం అవుతోందని, కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా కొంతమంది యువత చెడు అలవాట్ల వైపు మళ్లడానికి కారణమవుతోందని నరేష్ పటేల్ పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగకుండా పోలీసు, ఎక్సైజ్ శాఖలు నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, విద్యాసంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని కోరారు. సినిమాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా మాదక ద్రవ్యాలను గ్లామరైజ్ చేసే ధోరణిని అరికట్టాలని, యువతలో శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యత పెంపొందించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన శిక్షలు అమలు చేయాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ బారిన పడిన యువతకు ఉచిత వైద్య, కౌన్సెలింగ్ సేవలు అందించాలని కోరారు.

విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని డీవైఎఫ్ఐ సూచించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం డీవైఎఫ్ఐ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అవసరమైతే ఉద్యమాలు కూడా చేపడుతుందని స్పష్టం చేసింది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు సమాజమంతా కృషి చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. నరేష్ పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్, కృష్ణ, నాయకులు దినేష్, కౌశిక్, ప్రసాద్, నాగరాజు, మురళి, చిన్ను, జీవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణలోని కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, కాసింపేట గ్రామంలో ఉన్న స్వయంభు మానస దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    తెలంగాణలోని కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, కాసింపేట గ్రామంలో ఉన్న స్వయంభు మానస దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి, జలాశయాలు ఎడారిని తలపిస్తున్నాయని, ముఖ్యంగా ఎల్‌ఎండీ (లోయర్ మానేరు డ్యామ్) నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కు చేరడంతో తీవ్ర నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాగునీరు కూడా దొరకని పరిస్థితులు ఏర్పడగా, సాగునీటి సంగతి దేవుడెరుగు అని పేర్కొంటూ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఎండిపోయిన ఎల్‌ఎండీ అంతర్భాగంలోనే క్రికెట్, హాకీ, వాలీబాల్, ఫుట్‌బాల్ ఆడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం లేని నేపథ్యంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి నీటి కష్టాలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా కన్నెపల్లి లేదా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకుంటే, పాదయాత్రతో కన్నెపల్లికి వెళ్లి పంపులు ఆన్ చేస్తామని నిరసనకారులు హెచ్చరించారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతోందని ఆరోపిస్తూ, అక్కడ కాపర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తి పోయాలని కోరారు. ఎడారిని తలపిస్తున్న ఎల్‌ఎండీ, మిడ్ మానేరును నింపి తాగు, సాగునీటి కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండు వేసవిలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి చెరువులు, కుంటలు నింపి నీటి కష్టాలు రాకుండా చూశామని వారు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని తరలించకుండా ఎందుకు తాత్సారం చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే, రైతులు, ప్రజలతో కలిసి ప్రజా ఆందోళనను ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
    3
    ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి, జలాశయాలు ఎడారిని తలపిస్తున్నాయని, ముఖ్యంగా ఎల్‌ఎండీ (లోయర్ మానేరు డ్యామ్) నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కు చేరడంతో తీవ్ర నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాగునీరు కూడా దొరకని పరిస్థితులు ఏర్పడగా, సాగునీటి సంగతి దేవుడెరుగు అని పేర్కొంటూ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో ఈ ఆందోళన నిర్వహించారు.

ఎండిపోయిన ఎల్‌ఎండీ అంతర్భాగంలోనే క్రికెట్, హాకీ, వాలీబాల్, ఫుట్‌బాల్ ఆడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం లేని నేపథ్యంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి నీటి కష్టాలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు.

వారం రోజుల్లోగా కన్నెపల్లి లేదా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకుంటే, పాదయాత్రతో కన్నెపల్లికి వెళ్లి పంపులు ఆన్ చేస్తామని నిరసనకారులు హెచ్చరించారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతోందని ఆరోపిస్తూ, అక్కడ కాపర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తి పోయాలని కోరారు. ఎడారిని తలపిస్తున్న ఎల్‌ఎండీ, మిడ్ మానేరును నింపి తాగు, సాగునీటి కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండు వేసవిలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి చెరువులు, కుంటలు నింపి నీటి కష్టాలు రాకుండా చూశామని వారు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని తరలించకుండా ఎందుకు తాత్సారం చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే, రైతులు, ప్రజలతో కలిసి ప్రజా ఆందోళనను ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో, స్వస్తివాచనంతో ఘన స్వాగతం పలికారు. ఆయన భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శని త్రయోదశి సందర్భంగా ఆలయంలోని నవగ్రహ మండపంలో శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం నల్ల వస్త్రం సమర్పించి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు చేసి, శని దోష నివారణ కోసం ప్రత్యేక అర్చనలు జరిపారు. పూజల అనంతరం, ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు స్వామివారి తీర్థప్రసాదం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి, సహాయ కార్య నిర్వహణాధికారులు ఏఈఓలు జి. శ్రావణ్ కుమార్, జి. అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నూగూరి నరేందర్, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు.

ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో, స్వస్తివాచనంతో ఘన స్వాగతం పలికారు. ఆయన భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

శని త్రయోదశి సందర్భంగా ఆలయంలోని నవగ్రహ మండపంలో శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం నల్ల వస్త్రం సమర్పించి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు చేసి, శని దోష నివారణ కోసం ప్రత్యేక అర్చనలు జరిపారు.

పూజల అనంతరం, ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు స్వామివారి తీర్థప్రసాదం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి, సహాయ కార్య నిర్వహణాధికారులు ఏఈఓలు జి. శ్రావణ్ కుమార్, జి. అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నూగూరి నరేందర్, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాలలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శుక్రవారం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం విద్యార్థుల కోసం ఒక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యాలయ వైస్ ఛాన్సలర్ జి. శ్రీనివాసు, ఫిజిక్స్ ప్రొఫెసర్ వెంకటరమణల ఆధ్వర్యంలో, సంఘం నాయకులు సిరిసిల్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం తమ సౌకర్యాలు, వివిధ సబ్జెక్టులు, అధ్యాపక బృందం అనుభవం వంటి అంశాలను విద్యార్థులకు వివరించింది. స్వయంపాలిత తమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లోని ప్రతి విభాగానికి అదనంగా సంస్కృతం కోర్ సబ్జెక్ట్‌గా ఉంటుందని, అలాగే ఏఐ ఇంజనీరింగ్ అన్ని విభాగాలకు, బీఏ, బీకాం వంటి సబ్జెక్టులకు సైతం ఏఐ సబ్జెక్టు అనుసంధానంగా ఉంటుందని తెలిపారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు ఉంటాయని, కులమతాలకు అతీతంగా ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే, 'లా' సీట్లు కేవలం బాలికలకు మాత్రమే కేటాయించబడతాయని పేర్కొన్నారు. పరిచయ కార్యక్రమం అనంతరం వర్షిణి, రిత్విక్, మణిచంద్ర అనే విద్యార్థులు కంచి పీఠం (తమిళనాడు) వారి విశ్వవిద్యాలయం సౌకర్యాలపై సంతృప్తి చెంది అడ్మిషన్ పొందారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు ఉమాకాంత్ శర్మ, రఘుపతి శర్మ, శ్రీధర గణపతి శర్మ, మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, వేణుగోపాల్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాలయ వైస్ ఛాన్సలర్ జి. శ్రీనివాసు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయలో ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ సబ్జెక్టులపై అవగాహన కల్పించబడుతుందని తెలిపారు.
    1
    జగిత్యాలలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శుక్రవారం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం విద్యార్థుల కోసం ఒక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యాలయ వైస్ ఛాన్సలర్ జి. శ్రీనివాసు, ఫిజిక్స్ ప్రొఫెసర్ వెంకటరమణల ఆధ్వర్యంలో, సంఘం నాయకులు సిరిసిల్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం తమ సౌకర్యాలు, వివిధ సబ్జెక్టులు, అధ్యాపక బృందం అనుభవం వంటి అంశాలను విద్యార్థులకు వివరించింది. స్వయంపాలిత తమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లోని ప్రతి విభాగానికి అదనంగా సంస్కృతం కోర్ సబ్జెక్ట్‌గా ఉంటుందని, అలాగే ఏఐ ఇంజనీరింగ్ అన్ని విభాగాలకు, బీఏ, బీకాం వంటి సబ్జెక్టులకు సైతం ఏఐ సబ్జెక్టు అనుసంధానంగా ఉంటుందని తెలిపారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు ఉంటాయని, కులమతాలకు అతీతంగా ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే, 'లా' సీట్లు కేవలం బాలికలకు మాత్రమే కేటాయించబడతాయని పేర్కొన్నారు.

పరిచయ కార్యక్రమం అనంతరం వర్షిణి, రిత్విక్, మణిచంద్ర అనే విద్యార్థులు కంచి పీఠం (తమిళనాడు) వారి విశ్వవిద్యాలయం సౌకర్యాలపై సంతృప్తి చెంది అడ్మిషన్ పొందారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు ఉమాకాంత్ శర్మ, రఘుపతి శర్మ, శ్రీధర గణపతి శర్మ, మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, వేణుగోపాల్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాలయ వైస్ ఛాన్సలర్ జి. శ్రీనివాసు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయలో ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ సబ్జెక్టులపై అవగాహన కల్పించబడుతుందని తెలిపారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • కరీంనగర్ శాసనసభ్యులు, మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు శనివారం కరీంనగర్‌లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోయిన ఎల్ఎండీ జలాశయంలో ఆటలు ఆడుతూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిరసన తెలియజేశారు. కరీంనగర్ నగర ప్రజలు, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరువు వచ్చినప్పుడే ఆదుకునే కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నర ఏళ్లలో కెసిఆర్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించారని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు కూడా చేయలేక చేతగానితనాన్ని ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. కేవలం కెసిఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించడం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్ చరిత్రలో రెండు దశాబ్దాలలో జూలై మాసంలో ఎల్ఎండీ నీటి నిల్వలు డేడ్ స్టోరేజ్‌కు పడిపోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. మేడిగడ్డను మరమ్మత్తు చేయకపోవడం వల్ల ప్రతిరోజు 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తుందని గంగుల కమలాకర్ తెలిపారు. ఆ నీటిని నిల్వ చేసి, మేడిగడ్డ నుండి కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లిలకు తరలించి, ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి, వరద కాల్వ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండీలను నీటితో నింపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా, మిడ్ మానేరుపై ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేసి కొత్తపెళ్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగుల మల్యాల, బద్దిపల్లి, కమాన్‌పూర్, శ్రీరాములపల్లి, కాజీపూర్ గ్రామ చెరువులను నింపాలని సూచించారు. ప్రస్తుతం ఎల్ఎండీలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని, ఇందులో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కాగా, కేవలం రెండు టీఎంసీల నీటితో కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందించలేమని వివరించారు. గత టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు తాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీళ్లు అందిస్తోందని ఆయన ఎత్తిచూపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరీంనగర్ ప్రజలకు తాగునీటికి, ఎల్ఎండీపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఏప్రిల్, మే మాసాలలోనే ప్రాజెక్టులన్నింటినీ నింపి, చెరువులకు నీరు తరలించి మత్తడులు దుంకించిన విషయాన్ని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఎండీలో ఎప్పుడూ 10.5 టీఎంసీలు నిలువ ఉండేవిధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కన్నెపల్లిలోని మోటార్లను ఆన్ చేసి, మిడ్ మానేరు, ఎల్ఎండీలను నింపాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బేషజాలకు పోకుండా ప్రజలకు నీరందించాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే, కెసిఆర్ నాయకత్వంలో కెటిఆర్, హరీష్ రావు, ఇతర బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బారాస కార్పొరేటర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్ శాసనసభ్యులు, మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు శనివారం కరీంనగర్‌లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోయిన ఎల్ఎండీ జలాశయంలో ఆటలు ఆడుతూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిరసన తెలియజేశారు. కరీంనగర్ నగర ప్రజలు, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరువు వచ్చినప్పుడే ఆదుకునే కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నర ఏళ్లలో కెసిఆర్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించారని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు కూడా చేయలేక చేతగానితనాన్ని ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. కేవలం కెసిఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించడం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్ చరిత్రలో రెండు దశాబ్దాలలో జూలై మాసంలో ఎల్ఎండీ నీటి నిల్వలు డేడ్ స్టోరేజ్‌కు పడిపోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు.

మేడిగడ్డను మరమ్మత్తు చేయకపోవడం వల్ల ప్రతిరోజు 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తుందని గంగుల కమలాకర్ తెలిపారు. ఆ నీటిని నిల్వ చేసి, మేడిగడ్డ నుండి కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లిలకు తరలించి, ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి, వరద కాల్వ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండీలను నీటితో నింపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా, మిడ్ మానేరుపై ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేసి కొత్తపెళ్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగుల మల్యాల, బద్దిపల్లి, కమాన్‌పూర్, శ్రీరాములపల్లి, కాజీపూర్ గ్రామ చెరువులను నింపాలని సూచించారు. ప్రస్తుతం ఎల్ఎండీలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని, ఇందులో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కాగా, కేవలం రెండు టీఎంసీల నీటితో కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందించలేమని వివరించారు.

గత టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు తాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీళ్లు అందిస్తోందని ఆయన ఎత్తిచూపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరీంనగర్ ప్రజలకు తాగునీటికి, ఎల్ఎండీపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఏప్రిల్, మే మాసాలలోనే ప్రాజెక్టులన్నింటినీ నింపి, చెరువులకు నీరు తరలించి మత్తడులు దుంకించిన విషయాన్ని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఎండీలో ఎప్పుడూ 10.5 టీఎంసీలు నిలువ ఉండేవిధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కన్నెపల్లిలోని మోటార్లను ఆన్ చేసి, మిడ్ మానేరు, ఎల్ఎండీలను నింపాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బేషజాలకు పోకుండా ప్రజలకు నీరందించాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే, కెసిఆర్ నాయకత్వంలో కెటిఆర్, హరీష్ రావు, ఇతర బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బారాస కార్పొరేటర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.