అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 137-A, కరీంనగర్ మరియు వాసుదేవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న "అలయన్స్ గ్రీన్ అవార్డ్స్" పోస్టర్ డ్రాయింగ్ పోటీని అచీవర్స్ స్కూల్‌లో ఘనంగా ప్రారంభించారు. అలయన్స్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది "ప్రకృతి ప్రేరణ – మన భవిష్యత్తు కోసం వాతావరణం" అనే థీమ్‌తో ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో 4 నుండి 8 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు మొదటి కేటగిరీగా, 9 నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు రెండవ కేటగిరీగా పాల్గొనవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. విద్యార్థులు రూపొందించిన పోస్టర్‌లను జూలై 13వ తేదీలోపు అలయన్స్ జిల్లా గవర్నర్ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది, అనంతరం వాటిని ఇంటర్నేషనల్ స్థాయికి పంపిస్తారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.25,000, రెండవ బహుమతిగా రూ.15,000, మరియు మూడవ బహుమతిగా రూ.5,000 నగదు బహుమతులు అందజేయబడతాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఎలగండుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థుల ఉత్తమ చిత్రాలను అలయన్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌లో ప్రచురిస్తామని తెలిపారు. ప్రకృతి మనకు ప్రసాదించిన గాలి, నీరు, చెట్లు, భూమి వంటి అమూల్యమైన వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. "పచ్చదనాన్ని పరిరక్షిద్దాం – మన భవిష్యత్తును కాపాడుదాం" అనే సందేశంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలయన్స్ గ్రీన్ పోస్టర్ అవార్డును జిల్లా స్థాయిలో తొలిసారిగా అచీవర్స్ స్కూల్‌లో స్కూల్ చైర్మన్ శ్రీ చెరిమాల వెంకటేశ్వర్లు గారు అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎ శ్రీనివాస్, స్కూల్ చైర్మన్ చెరిమాల వెంకటేశ్వర్లు, జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, కుమారస్వామి, నాగేశ్వర్, పులాల శ్యామ్, సుద్దపల్లి ప్రసాద్, అల్లాడి ఆనంద్ కుమార్, అచీవర్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన అచీవర్స్ స్కూల్‌కు చెందిన సుమారు 50 మంది విద్యార్థులకు ప్రశంసా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 137-A, కరీంనగర్ మరియు వాసుదేవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న "అలయన్స్ గ్రీన్ అవార్డ్స్" పోస్టర్ డ్రాయింగ్ పోటీని అచీవర్స్ స్కూల్‌లో ఘనంగా ప్రారంభించారు. అలయన్స్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది "ప్రకృతి ప్రేరణ – మన భవిష్యత్తు కోసం వాతావరణం" అనే థీమ్‌తో ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో 4 నుండి 8 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు మొదటి కేటగిరీగా, 9 నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు రెండవ కేటగిరీగా పాల్గొనవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. విద్యార్థులు రూపొందించిన పోస్టర్‌లను జూలై 13వ తేదీలోపు అలయన్స్ జిల్లా గవర్నర్ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది, అనంతరం వాటిని ఇంటర్నేషనల్ స్థాయికి పంపిస్తారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.25,000, రెండవ బహుమతిగా రూ.15,000, మరియు మూడవ బహుమతిగా రూ.5,000 నగదు బహుమతులు అందజేయబడతాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఎలగండుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థుల ఉత్తమ చిత్రాలను అలయన్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌లో ప్రచురిస్తామని తెలిపారు. ప్రకృతి మనకు ప్రసాదించిన గాలి, నీరు, చెట్లు, భూమి వంటి అమూల్యమైన వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. "పచ్చదనాన్ని పరిరక్షిద్దాం – మన భవిష్యత్తును కాపాడుదాం" అనే సందేశంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలయన్స్ గ్రీన్ పోస్టర్ అవార్డును జిల్లా స్థాయిలో తొలిసారిగా అచీవర్స్ స్కూల్‌లో స్కూల్ చైర్మన్ శ్రీ చెరిమాల వెంకటేశ్వర్లు గారు అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎ శ్రీనివాస్, స్కూల్ చైర్మన్ చెరిమాల వెంకటేశ్వర్లు, జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, కుమారస్వామి, నాగేశ్వర్, పులాల శ్యామ్, సుద్దపల్లి ప్రసాద్, అల్లాడి ఆనంద్ కుమార్, అచీవర్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన అచీవర్స్ స్కూల్‌కు చెందిన సుమారు 50 మంది విద్యార్థులకు ప్రశంసా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
- కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో ఆదివారం నాడు రైతులతో కలిసి మహా ధర్నా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించాలని, వరద కాలువ పైన ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల, బావుపేట, కమన్ పూర్, కొండాపూర్, ఎలగంధల్, శ్రీరాములపల్లె గ్రామాలకు చెందిన ఏడు గ్రామాల రైతులకు సాగునీరు విడుదల చేసి చెరువులు నింపాలని గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించామని గంగుల కమలాకర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుండి రాజమండ్రికి నీటి తరలింపుపై చూపుతున్న శ్రద్ధ, తెలంగాణ ప్రజలు నీటి కోసం గోస పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ ద్వారా నీటిని తరలించి మండుటెండల్లో కూడా చెరువులను మత్తడులు దుంకించిన విషయాన్ని గంగుల కమలాకర్ గుర్తు చేశారు. ఈ పోరాటం తప్పదని భావించి నీటిని సాధించేందుకు రైతులతో కలిసి మహా ధర్నా చేపడుతున్నామని, ఈ ధర్నాకు రైతులందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో, స్వస్తివాచనంతో ఘన స్వాగతం పలికారు. ఆయన భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శని త్రయోదశి సందర్భంగా ఆలయంలోని నవగ్రహ మండపంలో శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం నల్ల వస్త్రం సమర్పించి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు చేసి, శని దోష నివారణ కోసం ప్రత్యేక అర్చనలు జరిపారు. పూజల అనంతరం, ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు స్వామివారి తీర్థప్రసాదం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి, సహాయ కార్య నిర్వహణాధికారులు ఏఈఓలు జి. శ్రావణ్ కుమార్, జి. అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నూగూరి నరేందర్, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.3
- జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఆశీర్వదించి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావడానికి అనేక చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో జగిత్యాల జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా, జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం, 450 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నాయని వెల్లడించారు. అలాగే, జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో జిల్లా కేంద్రాన్ని మెడికల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బీర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో పాటు సిబ్బంది ఉండేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అడగకుండానే ప్రమాద బీమా కల్పించిందని, రాష్ట్రంలోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మారుమూల మండలమైన బీర్‌పూర్ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు, బీర్‌పూర్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మారుమూల మండలాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు సాధించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రాన్ని వైద్య సేవలకు నిలయంగా మార్చడానికి చేస్తున్న కృషికి మంత్రి అడ్లూరితో పాటు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఏడాది లోపలే బీర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేశామని, పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరీష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు.1
- నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు స్థానిక మండల విద్యా శాఖ అధికారి (ఎం.ఈ.ఓ) కొర్ర. సారయ్యకు వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏటా తరగతుల వారీగా ఫీజులను పెంచుతున్నాయని ఆరోపిస్తూ, ఫీజుల భారం తగ్గించి, వాటిని క్రమబద్ధీకరించాలని వారు వేడుకున్నారు. తల్లిదండ్రులు తమ వినతి పత్రంలో, బుక్స్, స్టేషనరీల రేట్లు సైతం చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. నర్సరీ పిల్లలకు రూ.30వేల ట్యూషన్ ఫీజుతో ప్రారంభమై, ప్రతీ ఏటా రూ.3-5 వేలు పెంచుతున్నారని స్పష్టం చేశారు. వీటికి అదనంగా, బుక్స్ ఫీజు వేలల్లో ఉంటుందని, ముఖ్యంగా ఎల్.కే.జీ పిల్లలకు రూ.2-4 వేల వరకు బుక్స్ ఫీజు ఉండటం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు తమకు నచ్చిన బుక్ స్టాళ్లలో మాత్రమే పుస్తకాలు కొనేలా ఒత్తిడి తెస్తున్నాయని, బయట కొన్న విద్యార్థుల పట్ల వివక్ష చూపిస్తున్నాయని వారు తెలిపారు. బుక్స్, స్టేషనరీలను ఎక్కడైనా కొనుగోలు చేసేలా అనుమతించాలని, అలాగే ఫీజులను క్రమ పద్ధతిలో నియంత్రించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వినతి పత్రాన్ని సమర్పించారు.2
- జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన ఈ తనిఖీలలో, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులను పోలీసులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో తొర్రూర్ ఎస్సై మహేందర్ రెడ్డితో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాత్రిపూట ఈ విస్తృత స్థాయి పోలీసు తనిఖీలు కొనసాగాయి.1
- కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో ఆదివారం రోజున రైతులతో కలిసి మహా ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో నియోజకవర్గ రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ డిమాండ్‌లు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించాలని, అలాగే వరద కాలువపై ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలైన నాగుల మల్యాల, బావుపేట, కామన్ పూర్, కొండాపూర్, ఎలగంధల్, శ్రీరాములపల్లె రైతులకు సాగునీటిని విడుదల చేసి చెరువులను నింపాలని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఇక పోరాటం తప్పదని భావించి ఈ మహా ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ నుండి రాజమండ్రికి నీటిని తరలించడంపై చూపే శ్రద్ధ, తెలంగాణ ప్రజలు నీటి కోసం గోస పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఎమ్మెల్యే గంగుల మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బారసా ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండుటెండల్లో చెరువులను మత్తడులు దుంకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆదివారం నిర్వహించే ఈ ధర్నాకు రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, బారస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు, దీనివల్ల సాగుబడి ముందుకు సాగక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో ఉపాధి హామీ కూలీలు వర్షాల కోసం వినూత్న పద్ధతిలో వరుణుడిని వేడుకున్నారు. వారు బతుకమ్మ ఆటలతో వర్షాలు కురవాలని, రైతుల పంటలు పండాలని కోరారు. చెరువులు నిండి రైతుల కష్టాలు తీరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల మానేరు బ్రిడ్జిపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బ్రిడ్జిపైకి చేరుకుని నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంపై నిరసనగా ఈ ధర్నాకు దిగినట్లు యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 89 పరీక్ష పత్రాలు లీకయ్యాయని వారు తీవ్రంగా విమర్శించారు. దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ చదువులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రధాని మోడీ ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఎంతో కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలన్నీ ఆవిరయ్యాయని వారు పేర్కొన్నారు.2
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హన్మకొండ జిల్లా ప్రభుత్వ భూముల్లో పేదల గుడిసెలను కూల్చివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడాబాబులు నిర్మించిన ఇళ్లను వదిలేసి, పేదల గుడిసెలను కూల్చివేయడం అన్యాయమని ఆయన విమర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం కూడా సరికాదని ఆయన అన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే, జూలై 1న జిల్లా కేంద్రాల్లో, జూలై 6న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.1