కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో ఆదివారం రోజున రైతులతో కలిసి మహా ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో నియోజకవర్గ రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ డిమాండ్‌లు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించాలని, అలాగే వరద కాలువపై ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలైన నాగుల మల్యాల, బావుపేట, కామన్ పూర్, కొండాపూర్, ఎలగంధల్, శ్రీరాములపల్లె రైతులకు సాగునీటిని విడుదల చేసి చెరువులను నింపాలని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఇక పోరాటం తప్పదని భావించి ఈ మహా ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ నుండి రాజమండ్రికి నీటిని తరలించడంపై చూపే శ్రద్ధ, తెలంగాణ ప్రజలు నీటి కోసం గోస పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఎమ్మెల్యే గంగుల మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బారసా ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండుటెండల్లో చెరువులను మత్తడులు దుంకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆదివారం నిర్వహించే ఈ ధర్నాకు రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, బారస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో ఆదివారం రోజున రైతులతో కలిసి మహా ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో నియోజకవర్గ రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ డిమాండ్‌లు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించాలని, అలాగే వరద కాలువపై ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలైన నాగుల మల్యాల, బావుపేట, కామన్ పూర్, కొండాపూర్, ఎలగంధల్, శ్రీరాములపల్లె రైతులకు సాగునీటిని విడుదల చేసి చెరువులను నింపాలని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఇక పోరాటం తప్పదని భావించి ఈ మహా ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ నుండి రాజమండ్రికి నీటిని తరలించడంపై చూపే శ్రద్ధ, తెలంగాణ ప్రజలు నీటి కోసం గోస పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఎమ్మెల్యే గంగుల మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బారసా ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండుటెండల్లో చెరువులను మత్తడులు దుంకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆదివారం నిర్వహించే ఈ ధర్నాకు రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, బారస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో ఆదివారం రోజున రైతులతో కలిసి మహా ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో నియోజకవర్గ రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ డిమాండ్‌లు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించాలని, అలాగే వరద కాలువపై ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలైన నాగుల మల్యాల, బావుపేట, కామన్ పూర్, కొండాపూర్, ఎలగంధల్, శ్రీరాములపల్లె రైతులకు సాగునీటిని విడుదల చేసి చెరువులను నింపాలని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఇక పోరాటం తప్పదని భావించి ఈ మహా ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ నుండి రాజమండ్రికి నీటిని తరలించడంపై చూపే శ్రద్ధ, తెలంగాణ ప్రజలు నీటి కోసం గోస పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఎమ్మెల్యే గంగుల మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బారసా ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండుటెండల్లో చెరువులను మత్తడులు దుంకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆదివారం నిర్వహించే ఈ ధర్నాకు రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, బారస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ శుక్రవారం విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రయాణికులు, విద్యార్థులు, యువత, ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని డీవైఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. నరేష్ పటేల్ మాట్లాడుతూ, నేడు దేశంలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందని, డ్రగ్స్ మాఫియా యువతను లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు వారి భవిష్యత్తు కూడా నాశనం అవుతోందని, కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా కొంతమంది యువత చెడు అలవాట్ల వైపు మళ్లడానికి కారణమవుతోందని నరేష్ పటేల్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగకుండా పోలీసు, ఎక్సైజ్ శాఖలు నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, విద్యాసంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని కోరారు. సినిమాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా మాదక ద్రవ్యాలను గ్లామరైజ్ చేసే ధోరణిని అరికట్టాలని, యువతలో శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యత పెంపొందించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన శిక్షలు అమలు చేయాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ బారిన పడిన యువతకు ఉచిత వైద్య, కౌన్సెలింగ్ సేవలు అందించాలని కోరారు. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని డీవైఎఫ్ఐ సూచించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం డీవైఎఫ్ఐ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అవసరమైతే ఉద్యమాలు కూడా చేపడుతుందని స్పష్టం చేసింది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు సమాజమంతా కృషి చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. నరేష్ పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్, కృష్ణ, నాయకులు దినేష్, కౌశిక్, ప్రసాద్, నాగరాజు, మురళి, చిన్ను, జీవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.3
- తెలంగాణలోని కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, కాసింపేట గ్రామంలో ఉన్న స్వయంభు మానస దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- మొహర్రం సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలో పీర్ల సంప్రదాయ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ ఆచారంలో భాగంగా, భక్తులు పీర్లను మూడుసార్లు వంచి తలలు కొట్టే సంప్రదాయాన్ని విశ్వాసంతో పాటించారు. ఈ వేడుకలో పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి హిందూ, ముస్లిం మతాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ వర్గాల వారు పెద్ద సంఖ్యలో హాజరై భక్తితో పాల్గొన్నారు. మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఈ వేడుకను నిర్వహించడం స్థానికంగా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగగా, భక్తుల రద్దీతో బెజ్జంకి సందడిగా మారింది. ఈ తరహా వేడుకలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పలువురు పెద్దలు అభిప్రాయపడ్డారు. బెజ్జంకిలో మతసామరస్యాన్ని చాటిన పీర్ల పండుగ సాంప్రదాయ వేడుక ఇది.1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం 'డ్రగ్స్ రహిత తెలంగాణ' లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ లక్ష్యం దిశగా, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ మీదుగా పద్మనాయక కల్యాణ మండపం వరకు సాగింది. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, నష్టాలపై స్కూల్ విద్యార్థులు, సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేశాయి. అనంతరం, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ముఖ్య అతిథులు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 'పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట', 'సే నో టూ డ్రగ్స్.. సే ఎస్ టూ లైఫ్' వంటి నినాదాలు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారని గుర్తు చేశారు. దీనిలో భాగంగా, డ్రగ్స్ ను నిర్మూలించడానికి రాష్ట్రంలో ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులకు డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. సీఎం పిలుపు మేరకు యువత మత్తు పదార్థాల బాట వీడి మైదానం బాట పట్టాలని సూచించారు. పోలీస్ శాఖ శాంతి భద్రతలతో పాటు రోడ్డు భద్రతా చర్యలు, హెల్మెట్, సీటు బెల్ట్ ధారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సామాజిక బాధ్యతను చాటుతోందని అభినందించారు. చదువుతో పాటు ఆటల్లోనూ యువత రాణించేలా ఒలింపిక్స్ లో పతకాలు సాధించేలా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారని శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, యువత, విద్యార్థులు తమకు నచ్చిన అంశాల్లో రాణించాలని, శారీరక, మానసిక ఆరోగ్యం చాలా అవసరమని తెలిపారు. యువత డ్రగ్స్ కు బానిస కావద్దని, ఖాళీగా ఉండకుండా తమకు నచ్చిన రంగాల్లో సమయాన్ని కేటాయించాలని సూచించారు. మానసికంగా ఇబ్బంది పడితే సైకాలజిస్ట్ ను సంప్రదించాలని, డ్రగ్స్ కు బానిసైన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రానికి తరలించాలని కోరారు. డ్రగ్స్ వ్యాప్తి చేసే వారిపై, డ్రగ్స్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని విద్యాలయాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు డ్రగ్స్ రహితం కావాలని ఆకాంక్షిస్తూ, ఆ దిశగా పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1908, కంట్రోల్ రూం నంబర్లు 8712671111, 112 సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సీఎం కప్ పేరిట జిల్లాలో వివిధ ఆటల పోటీలు నిర్వహించి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేసినందుకు కలెక్టర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్.బి. డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ మహేష్, సిఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు తదితరులు పాల్గొన్నారు.1
- గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ, 'ఫ్యూచర్ సిటీలో అవకతవకలు జరిగాయని, మంత్రి శ్రీధర్ బాబు అవినీతికి పాల్పడుతున్నారన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. శ్రీధర్ బాబుపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే బహిరంగపరచాలని ఆయన సవాల్ విసిరారు. అవినీతిని రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని, ఒకవేళ రుజువు చేయలేకపోతే జీవన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. 2016 నుంచి మంథని ప్రాంతంలో ఇసుక దందాను ఎవరు ప్రారంభించారో ధైర్యం ఉంటే రుజువు చేయాలని, ఇసుక మాఫియాను విచ్చలవిడిగా కొనసాగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు ఎకరాల భూమి ఏమైందని, దళితులకు ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను తీసుకొని స్మశాన వాటికల్లో రైతు వేదికలు నిర్మించిన సంగతి నిజం కాదా అని ప్రశ్నించారు. నాడు కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవన్ రెడ్డి ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు తండ్రితో పనిచేశానని చెప్పుకుంటూ ఆయనను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. శ్రీధర్ బాబు నిజాయితీ గురించి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసని, జీవన్ రెడ్డి తన గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వామన్ రావు దంపతుల హత్య ఉదంతం, మంథనిలో శాంతిభద్రతల లోపించడానికి ఎవరు బాధ్యులో జీవన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌కే ఎందుకు పరిమితం చేశారని, రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదని, దీని గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడరని మండిపడ్డారు. కులాలకు, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని, వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 100 శాతం న్యాయం చేసిందని వివరించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలు తమ ఉనికి కోల్పోతున్నారని, 'SIR' పేరుతో నియోజకవర్గాల పర్యటనలు చేపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. పుట్ట మధుకర్ అనే వ్యక్తి ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ అని, నేటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఇసుక కాంట్రాక్టర్లను, రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి వంత పాడుతూ జీవన్ రెడ్డి మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరంలో రెండు గేట్లు కుంగిపోతే దానిని చిన్నచూపు చూస్తూ ఏం నష్టం జరుగుతుందని హేళన చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనమని మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకొని, సొంత ఖజానాకు తరలించి, అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు కాకపోవడానికి కారణం బీఆర్ఎస్ చేసిన అప్పులేనని స్పష్టం చేశారు. గ్రానైట్ క్వారీలలో బ్లాక్ మెయిల్‌కు పాల్పడి వసూలు చేసింది కేటీఆర్, హరీశ్ రావు కాదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో శ్రీధర్ బాబు లాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం ఇవ్వడం ప్రజా వంచన అవుతుందా అని ప్రశ్నించారు. బాధ్యతగల మంత్రిగా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీధర్ బాబు గారు ఎంతో శ్రమిస్తున్నారని వెల్లడించారు.1
- కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ శివారులోని ఓ రిసార్ట్‌లో జరిగిన బర్త్ డే వేడుకలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు, తన మిత్రుడు అరవింద్ బర్త్ డే సందర్భంగా జరిగిన ఈ వేడుకల్లో రాత్రంతా ఆడిపాడి, తెల్లారేసరికి స్విమ్మింగ్ పూల్‌లో శవమై తేలడం కలకలం రేపింది. అరవింద్ పుట్టినరోజు వేడుకలకు 9 మంది యువకులు మరియు 8 మంది యువతులు హాజరయ్యారు. వారందరూ మందు, విందు భోజనాలతో రాత్రంతా ఉల్లాసంగా గడిపారు. అయితే, అఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి; స్నేహితుల మధ్య జరిగిన గొడవ వల్ల ప్రాణాలు కోల్పోయాడా, లేక ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోయాడా అనే కోణంలో చర్చ జరుగుతోంది. మృతుడి తల్లిదండ్రులు మాత్రం ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, బర్త్ డే పార్టీలో పాల్గొన్న మొత్తం 16 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. యువకుడి అనుమానాస్పద మృతి సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రిసార్ట్‌లపై చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.3