కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ శివారులోని ఓ రిసార్ట్‌లో జరిగిన బర్త్ డే వేడుకలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు, తన మిత్రుడు అరవింద్ బర్త్ డే సందర్భంగా జరిగిన ఈ వేడుకల్లో రాత్రంతా ఆడిపాడి, తెల్లారేసరికి స్విమ్మింగ్ పూల్‌లో శవమై తేలడం కలకలం రేపింది. అరవింద్ పుట్టినరోజు వేడుకలకు 9 మంది యువకులు మరియు 8 మంది యువతులు హాజరయ్యారు. వారందరూ మందు, విందు భోజనాలతో రాత్రంతా ఉల్లాసంగా గడిపారు. అయితే, అఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి; స్నేహితుల మధ్య జరిగిన గొడవ వల్ల ప్రాణాలు కోల్పోయాడా, లేక ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోయాడా అనే కోణంలో చర్చ జరుగుతోంది. మృతుడి తల్లిదండ్రులు మాత్రం ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, బర్త్ డే పార్టీలో పాల్గొన్న మొత్తం 16 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. యువకుడి అనుమానాస్పద మృతి సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రిసార్ట్‌లపై చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ శివారులోని ఓ రిసార్ట్‌లో జరిగిన బర్త్ డే వేడుకలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు, తన మిత్రుడు అరవింద్ బర్త్ డే సందర్భంగా జరిగిన ఈ వేడుకల్లో రాత్రంతా ఆడిపాడి, తెల్లారేసరికి స్విమ్మింగ్ పూల్‌లో శవమై తేలడం కలకలం రేపింది. అరవింద్ పుట్టినరోజు వేడుకలకు 9
మంది యువకులు మరియు 8 మంది యువతులు హాజరయ్యారు. వారందరూ మందు, విందు భోజనాలతో రాత్రంతా ఉల్లాసంగా గడిపారు. అయితే, అఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి; స్నేహితుల మధ్య జరిగిన గొడవ వల్ల ప్రాణాలు కోల్పోయాడా, లేక ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోయాడా అనే కోణంలో చర్చ జరుగుతోంది. మృతుడి తల్లిదండ్రులు మాత్రం ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, బర్త్ డే పార్టీలో పాల్గొన్న మొత్తం 16 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. యువకుడి అనుమానాస్పద మృతి సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రిసార్ట్‌లపై చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
- మొహర్రం సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలో పీర్ల సంప్రదాయ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ ఆచారంలో భాగంగా, భక్తులు పీర్లను మూడుసార్లు వంచి తలలు కొట్టే సంప్రదాయాన్ని విశ్వాసంతో పాటించారు. ఈ వేడుకలో పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి హిందూ, ముస్లిం మతాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ వర్గాల వారు పెద్ద సంఖ్యలో హాజరై భక్తితో పాల్గొన్నారు. మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఈ వేడుకను నిర్వహించడం స్థానికంగా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగగా, భక్తుల రద్దీతో బెజ్జంకి సందడిగా మారింది. ఈ తరహా వేడుకలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పలువురు పెద్దలు అభిప్రాయపడ్డారు. బెజ్జంకిలో మతసామరస్యాన్ని చాటిన పీర్ల పండుగ సాంప్రదాయ వేడుక ఇది.1
- తెలంగాణలోని కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, కాసింపేట గ్రామంలో ఉన్న స్వయంభు మానస దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో ఆదివారం రోజున రైతులతో కలిసి మహా ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో నియోజకవర్గ రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ డిమాండ్‌లు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించాలని, అలాగే వరద కాలువపై ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలైన నాగుల మల్యాల, బావుపేట, కామన్ పూర్, కొండాపూర్, ఎలగంధల్, శ్రీరాములపల్లె రైతులకు సాగునీటిని విడుదల చేసి చెరువులను నింపాలని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఇక పోరాటం తప్పదని భావించి ఈ మహా ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ నుండి రాజమండ్రికి నీటిని తరలించడంపై చూపే శ్రద్ధ, తెలంగాణ ప్రజలు నీటి కోసం గోస పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఎమ్మెల్యే గంగుల మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బారసా ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండుటెండల్లో చెరువులను మత్తడులు దుంకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆదివారం నిర్వహించే ఈ ధర్నాకు రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, బారస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ శుక్రవారం విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రయాణికులు, విద్యార్థులు, యువత, ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని డీవైఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. నరేష్ పటేల్ మాట్లాడుతూ, నేడు దేశంలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందని, డ్రగ్స్ మాఫియా యువతను లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు వారి భవిష్యత్తు కూడా నాశనం అవుతోందని, కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా కొంతమంది యువత చెడు అలవాట్ల వైపు మళ్లడానికి కారణమవుతోందని నరేష్ పటేల్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగకుండా పోలీసు, ఎక్సైజ్ శాఖలు నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, విద్యాసంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని కోరారు. సినిమాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా మాదక ద్రవ్యాలను గ్లామరైజ్ చేసే ధోరణిని అరికట్టాలని, యువతలో శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యత పెంపొందించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన శిక్షలు అమలు చేయాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ బారిన పడిన యువతకు ఉచిత వైద్య, కౌన్సెలింగ్ సేవలు అందించాలని కోరారు. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని డీవైఎఫ్ఐ సూచించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం డీవైఎఫ్ఐ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అవసరమైతే ఉద్యమాలు కూడా చేపడుతుందని స్పష్టం చేసింది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు సమాజమంతా కృషి చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. నరేష్ పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్, కృష్ణ, నాయకులు దినేష్, కౌశిక్, ప్రసాద్, నాగరాజు, మురళి, చిన్ను, జీవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.3
- మండలం లోని పలు గ్రామాలలో గురువారం రాత్రి మొహరం వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా నర్సింగాపూర్ గ్రామంలో ఈ వేడుకలను ప్రతి ఏటా కులమతాలకు అతీతంగా, అపారమైన భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా, మట్టితో తయారు చేసిన కొత్త కుండలో బెల్లం పానకంతో చేసిన షర్బత్, మటికీలు, మలీన ముద్దలు వంటి వాటిని సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం డప్పు చప్పుళ్లతో భక్తులు ఊరేగింపుగా గ్రామంలోని పీర్ల చావడి వద్ద ఉన్న పీర్ల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండం చుట్టూ తిరిగి, పీర్ల వద్ద మటికీలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ పీర్లకు దట్టీలను కట్టారు. పీర్లను పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ కమిటీ సభ్యులతో పాటు, కులమతాలకు అతీతంగా గ్రామస్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు, ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఒక ముఖ్యమైన సంప్రదాయం.1
- కోరిన కోర్కెలు తీర్చే వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమన్న గుడిలో కోడెనాగు ప్రత్యక్షమై భక్తులు, ఆలయ సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో భయపడిన ఆలయ అధికారులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. దాదాపు రెండు గంటల పాటు కష్టపడి స్నేక్ క్యాచర్ జగదీష్ ఆ కోడెనాగును పట్టుకున్నారు. పట్టుకున్న అనంతరం జగదీష్ ఆ కోడెనాగును అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.1
- కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ శివారులోని ఓ రిసార్ట్‌లో జరిగిన బర్త్ డే వేడుకలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు, తన మిత్రుడు అరవింద్ బర్త్ డే సందర్భంగా జరిగిన ఈ వేడుకల్లో రాత్రంతా ఆడిపాడి, తెల్లారేసరికి స్విమ్మింగ్ పూల్‌లో శవమై తేలడం కలకలం రేపింది. అరవింద్ పుట్టినరోజు వేడుకలకు 9 మంది యువకులు మరియు 8 మంది యువతులు హాజరయ్యారు. వారందరూ మందు, విందు భోజనాలతో రాత్రంతా ఉల్లాసంగా గడిపారు. అయితే, అఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి; స్నేహితుల మధ్య జరిగిన గొడవ వల్ల ప్రాణాలు కోల్పోయాడా, లేక ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోయాడా అనే కోణంలో చర్చ జరుగుతోంది. మృతుడి తల్లిదండ్రులు మాత్రం ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, బర్త్ డే పార్టీలో పాల్గొన్న మొత్తం 16 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. యువకుడి అనుమానాస్పద మృతి సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రిసార్ట్‌లపై చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.3