మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి డివిజన్ పరిధిలోని సాయినాధపురం, వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సమీపంలో సంచరిస్తున్న ఒక నల్ల కుక్క స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఈ కుక్క మరో వ్యక్తిపై దాడి చేసి గాయపరచడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కుక్క ఇప్పటికే కాలనీలోని పిల్లలు, వృద్ధులతో పాటు పలువురిపై దాడులు చేసి గాయపరిచింది. అంతేకాకుండా, ద్విచక్ర వాహనదారుల వెంటపడటంతో వారు అదుపుతప్పి కిందపడి గాయపడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ తీవ్రమైన సమస్యపై కాలనీవాసులు పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుక్కలను పట్టుకునే వాహనం చాలా ఆలస్యంగా వస్తోందని, ఒకవేళ వచ్చినా కుక్క దొరకలేదని చెప్పి వెళ్లిపోతున్నారే తప్ప సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఈ నల్ల కుక్కను పట్టుకుని ఇక్కడి నుండి తరలించాలని, తమకు తగిన భద్రత కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎప్పుడు స్పందిస్తారంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి డివిజన్ పరిధిలోని సాయినాధపురం, వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సమీపంలో సంచరిస్తున్న ఒక నల్ల కుక్క స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఈ కుక్క మరో వ్యక్తిపై దాడి చేసి గాయపరచడంతో స్థానికుల్లో తీవ్ర
ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కుక్క ఇప్పటికే కాలనీలోని పిల్లలు, వృద్ధులతో పాటు పలువురిపై దాడులు చేసి గాయపరిచింది. అంతేకాకుండా, ద్విచక్ర వాహనదారుల వెంటపడటంతో వారు అదుపుతప్పి కిందపడి గాయపడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ తీవ్రమైన సమస్యపై కాలనీవాసులు పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు
చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుక్కలను పట్టుకునే వాహనం చాలా ఆలస్యంగా వస్తోందని, ఒకవేళ వచ్చినా కుక్క దొరకలేదని చెప్పి వెళ్లిపోతున్నారే తప్ప సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత
అధికారులు వెంటనే స్పందించి, ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఈ నల్ల కుక్కను పట్టుకుని ఇక్కడి నుండి తరలించాలని, తమకు తగిన భద్రత కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎప్పుడు స్పందిస్తారంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్‌కీ ప్రాసెస్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.1
- Post by Assalamualikumjj3
- బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.1
- సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని బొల్లారం ప్రాంతంలో ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక పరిశీలన (SIR – Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఈ ఫారం ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఫారాలను అందుకున్న ఓటర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. బీఎల్‌ఓల నుంచి ఫారం అందుకున్న రెండు రోజుల్లోపు దానిని పూర్తిగా పూర్తి చేసి తిరిగి వారికే అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే సహాయం అందుబాటులో ఉంది. దీని కోసం బొల్లారంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లేదా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాలను సంప్రదించి సహాయం పొందవచ్చు.1
- మెదక్ జిల్లా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ప్రయాణికుల సహనం పరీక్షకు గురైంది. సమయానికి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆగ్రహించిన ప్రయాణికులు మొదట బస్టాండ్ ప్రాంగణంలోనే ధర్నాకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచూ బస్సులు ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బస్సులను సమయపాలనతో నడిపించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.1
- రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ శ్రీమతి బద్దుల ఉమా గారి భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల రమేష్‌పై రామన్నపేట ఎస్సై సతీష్ అనుచితంగా ప్రవర్తించి, భౌతికంగా దాడికి పాల్పడటాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు తీవ్రంగా ఖండించారు. రామన్నపేట మండలంలో చేనేత సంఘ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించేందుకు వెళ్లిన బద్దుల రమేష్‌తో ఎస్సై సతీష్ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడడంతో పాటు భౌతికంగా దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇటువంటి చర్యలు అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐను కలిసి, సంబంధిత ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడి రాజకీయ ఒత్తిళ్లు, అధికార పార్టీ నాయకుల ప్రేరేపణతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన ఎస్సై సతీష్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు, సంబంధిత అధికారులు ఆయనపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ప్రజాస్వామ్యబద్ధంగా భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు హెచ్చరించారు.1
- గోదావరిలో కళ్ల ముందే లక్ష క్యూసెక్కుల నీరు వరదలా కిందకు పోతుంటే, అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవని చెప్పడం బుర్రతక్కువతనం అని కేటీఆర్ విమర్శించారు. రైతుల కోసం ఈ పని చేయమన్నవాళ్లు తెలివిలేనివాళ్లా అని ఆయన ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద 93 మీటర్ల నుంచే నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకున్న రేవంత్ రెడ్డి బుర్రతక్కువ వాడో కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 97 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుంటే, కళ్లుండి కూడా చూడలేని రేవంత్ రెడ్డి తెలివిలేనివాడా, లేక వాస్తవాలు చూపిస్తున్న తాము తెలివిలేనివాళ్లమా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే భద్రాచలాన్ని పట్టుకొని, మేడిగడ్డ వల్లే మునిగిపోతోందని అంటున్న రేవంత్ రెడ్డికి అస్సలు బుర్రలేదని కేటీఆర్ మండిపడ్డారు. రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్లివ్వాలని అడుగుతుంటే పట్టించుకోని వాడిని బుర్రతక్కువ వాడు అనాలా లేక లుచ్చా అనాలా అని ప్రశ్నించారు. తన గురువు కోసం నీళ్లను కిందకు వదులుతున్నావా అని రైతులు అడుగుతుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ అనాలా లేక దరిద్రుడు అనాలా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.1