రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ శ్రీమతి బద్దుల ఉమా గారి భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల రమేష్‌పై రామన్నపేట ఎస్సై సతీష్ అనుచితంగా ప్రవర్తించి, భౌతికంగా దాడికి పాల్పడటాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు తీవ్రంగా ఖండించారు. రామన్నపేట మండలంలో చేనేత సంఘ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించేందుకు వెళ్లిన బద్దుల రమేష్‌తో ఎస్సై సతీష్ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడడంతో పాటు భౌతికంగా దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇటువంటి చర్యలు అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐను కలిసి, సంబంధిత ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడి రాజకీయ ఒత్తిళ్లు, అధికార పార్టీ నాయకుల ప్రేరేపణతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన ఎస్సై సతీష్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు, సంబంధిత అధికారులు ఆయనపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ప్రజాస్వామ్యబద్ధంగా భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు హెచ్చరించారు.

- రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ శ్రీమతి బద్దుల ఉమా గారి భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల రమేష్‌పై రామన్నపేట ఎస్సై సతీష్ అనుచితంగా ప్రవర్తించి, భౌతికంగా దాడికి పాల్పడటాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు తీవ్రంగా ఖండించారు. రామన్నపేట మండలంలో చేనేత సంఘ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించేందుకు వెళ్లిన బద్దుల రమేష్‌తో ఎస్సై సతీష్ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడడంతో పాటు భౌతికంగా దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇటువంటి చర్యలు అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐను కలిసి, సంబంధిత ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడి రాజకీయ ఒత్తిళ్లు, అధికార పార్టీ నాయకుల ప్రేరేపణతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన ఎస్సై సతీష్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు, సంబంధిత అధికారులు ఆయనపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ప్రజాస్వామ్యబద్ధంగా భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు హెచ్చరించారు.1
- తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం ఇవాళ అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవస్థాన నూతన పాలకమండలి ఛైర్మన్ మన్నే సత్య నారాయణరెడ్డితో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, అలాగే మరో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విశేష కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంతో యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు అధికారికంగా కొలువుదీరారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఆలయ అర్చకులు వైభవంగా ఊంజల్ సేవను నిర్వహించారు. పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అద్దాల మండపంలో అమ్మవారిని ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి శ్రీ సూక్త పారాయణం జరిపారు. సాయంత్రం వేళ అమ్మవారికి వెండి జోడు సేవలను కూడా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సీతారామ చారి, అర్చకులు సందీప్, ప్రశాంత్ లతో పాటు ఆలయ సిబ్బంది మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొత్త పాలకమండలి ఇవాళ కొలువు తీరింది. పాలకమండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డితో పాటు మరో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. యాదగిరిగుట్టలో జరిగిన ఈ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. కాగా, ఈ పాలకమండలి నియామకానికి సంబంధించి ఏపీకి చెందిన చిరంజీవి సతీమణిని ఎలా నిర్ణయిస్తారని వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నడుమనే యాదగిరిగుట్టలో కొత్త పాలక మండలి ప్రమాణస్వీకార ఉత్సవం జరగగా, చిరంజీవి సతీమణి కూడా ప్రమాణ స్వీకారం చేశారు.1
- గోదావరిలో కళ్ల ముందే లక్ష క్యూసెక్కుల నీరు వరదలా కిందకు పోతుంటే, అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవని చెప్పడం బుర్రతక్కువతనం అని కేటీఆర్ విమర్శించారు. రైతుల కోసం ఈ పని చేయమన్నవాళ్లు తెలివిలేనివాళ్లా అని ఆయన ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద 93 మీటర్ల నుంచే నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకున్న రేవంత్ రెడ్డి బుర్రతక్కువ వాడో కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 97 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుంటే, కళ్లుండి కూడా చూడలేని రేవంత్ రెడ్డి తెలివిలేనివాడా, లేక వాస్తవాలు చూపిస్తున్న తాము తెలివిలేనివాళ్లమా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే భద్రాచలాన్ని పట్టుకొని, మేడిగడ్డ వల్లే మునిగిపోతోందని అంటున్న రేవంత్ రెడ్డికి అస్సలు బుర్రలేదని కేటీఆర్ మండిపడ్డారు. రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్లివ్వాలని అడుగుతుంటే పట్టించుకోని వాడిని బుర్రతక్కువ వాడు అనాలా లేక లుచ్చా అనాలా అని ప్రశ్నించారు. తన గురువు కోసం నీళ్లను కిందకు వదులుతున్నావా అని రైతులు అడుగుతుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ అనాలా లేక దరిద్రుడు అనాలా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.1
- బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్‌కీ ప్రాసెస్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.1
- యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణస్వీకారోత్సవం కారణంగా ఘాట్ రోడ్డును మూసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మార్పు వల్ల వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు కాలినడకన కొండపైకి చేరుకోవాల్సి వస్తోంది. ప్రధానంగా వృద్ధులు మరియు చిన్నారులతో వచ్చిన భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తుల సౌకర్యార్థం కనీసం అత్యవసర పరిస్థితుల్లోనైనా వాహనాలను అనుమతించాలని స్థానిక భక్తులు కోరుతున్నారు.1