logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎస్సీ యువతకు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యం: కోండ్రు మరిడయ్య నర్సీపట్నం : ఎస్సీ యువతకు వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కోండ్రు మరిడయ్య తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.ఉమ్మడి విశాఖపట్నం షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, సోలార్ పీవీ ఇన్‌స్టాలర్, ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, బ్యూటీ థెరపిస్ట్, ప్లంబర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మన్యం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ యువత ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. 8వ తరగతి, 10వ తరగతి లేదా ఇంటర్‌ పూర్తిచేసి, 21 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు నకళ్లతో ఐదు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఎస్సీ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని, 9010554758, 8317559817 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోండ్రు మరిడయ్య తెలిపారు.

1 day ago
user_SETTI SIVA SATYANARAYANA
SETTI SIVA SATYANARAYANA
Local News Reporter నాతవరం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
1 day ago
6c15ecfe-0936-4c90-9605-8505282c145b

ఎస్సీ యువతకు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యం: కోండ్రు మరిడయ్య నర్సీపట్నం : ఎస్సీ యువతకు వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కోండ్రు మరిడయ్య తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.ఉమ్మడి విశాఖపట్నం షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, సోలార్ పీవీ ఇన్‌స్టాలర్, ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, బ్యూటీ థెరపిస్ట్, ప్లంబర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మన్యం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ యువత ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. 8వ తరగతి, 10వ తరగతి లేదా ఇంటర్‌ పూర్తిచేసి, 21 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు నకళ్లతో ఐదు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఎస్సీ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని, 9010554758, 8317559817 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోండ్రు మరిడయ్య తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కన్నుల పండువగ శ్రీ పరదేశమ్మ తల్లి తీర్థం, అమ్మవారి నామస్మరణతో మారు మోగుతున్న గ్రామం. కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గురువారం నాడు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థం కన్నుల పండువగ జరిగింది. పురోహితులు ఆధ్వర్యంలో వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఈ పండుగ కోసం గ్రామ ప్రజలే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఇతర జిల్లాల్లో ప్రజలు, కూడా అమ్మవారిని దర్శించుకున్నటుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.ఆలయంలో గాజులు వితరణ, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాలు గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
    3
    కన్నుల పండువగ శ్రీ పరదేశమ్మ తల్లి తీర్థం, అమ్మవారి నామస్మరణతో మారు మోగుతున్న గ్రామం.
కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గురువారం నాడు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థం కన్నుల పండువగ జరిగింది. పురోహితులు ఆధ్వర్యంలో వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఈ పండుగ కోసం గ్రామ ప్రజలే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఇతర జిల్లాల్లో ప్రజలు, కూడా అమ్మవారిని దర్శించుకున్నటుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.ఆలయంలో గాజులు వితరణ, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాలు గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • *మారికవలస గురుకులాన్ని తీసేయమని సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారే ఆదేశించారంట??* *పాడేరు ఐటిడిఏ ఆదిత్య శర్మ గారు అమలు చేశారట...!* ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..? ⁉️ *సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే....గిరిజన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ ని తీసేయండి" అని చెబితే,ఇక ఈ కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది..?*🤦🏻‍♂️ *యోగా గిన్నిస్ రికార్డులకు గిరిజన బిడ్డలు కావాలి..!* *భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడ్ కార్పెట్ కోసం గిరిజన బిడ్డలు కావాలి..!* *కానీ అదే గిరిజన బిడ్డలు చదువుకునే స్కూల్ ని మాత్రం తీసేయమని గిరిజన మంత్రే చెబుతారా...?* *ఇది #గిరిజనశాఖ కాదు.. #గిరిజనవంచన శాఖ..!* *480 మంది పేద గిరిజన బిడ్డలను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ మంత్రి గారిదేనా...?* గిరిజన బిడ్డల కన్నీళ్లకు కారణమైన మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి..! #ITDA_Paderu #Araku #Marikavalasa
    1
    *మారికవలస గురుకులాన్ని తీసేయమని సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారే ఆదేశించారంట??*
*పాడేరు ఐటిడిఏ ఆదిత్య శర్మ గారు అమలు చేశారట...!*

ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..? ⁉️

*సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే....గిరిజన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ ని తీసేయండి" అని చెబితే,ఇక ఈ కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది..?*🤦🏻‍♂️

*యోగా గిన్నిస్ రికార్డులకు గిరిజన బిడ్డలు కావాలి..!*
*భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడ్ కార్పెట్ కోసం గిరిజన బిడ్డలు కావాలి..!*
*కానీ అదే గిరిజన బిడ్డలు చదువుకునే స్కూల్ ని మాత్రం తీసేయమని గిరిజన మంత్రే చెబుతారా...?*

*ఇది #గిరిజనశాఖ కాదు.. #గిరిజనవంచన శాఖ..!*

*480 మంది పేద గిరిజన బిడ్డలను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ మంత్రి గారిదేనా...?*

గిరిజన బిడ్డల కన్నీళ్లకు కారణమైన మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి..!
#ITDA_Paderu #Araku #Marikavalasa
    user_Nethala Nageswararao
    Nethala Nageswararao
    నర్సీపట్నం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు - మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు - శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
    1
    సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు
- మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు
- శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి
మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.
    1
    రామవరంలో  ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్
అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.
    user_DEVENDRA
    DEVENDRA
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.
    3
    *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు*

* స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు
* వేగవంతంగా నిర్మాణ పనులు
మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి
విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
గురువారం విరాళం అందించిన దాత 
హైద్రాబాద్ వాస్తవ్యులు
శ్రీ ఏ ఆశిష్  1 లక్ష 
ముమ్మిడివరం వాస్తవ్యులు 
శ్రీ తాడి వెంకట రెడ్డి
రూ 1 లక్ష 116
విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు.
ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో
శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు.
శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.
    user_Ravi Sharma Nagabhatla
    Ravi Sharma Nagabhatla
    Hindu temple ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • 🌿 From the cotton field to everyday comfort. A little CGI imagination brings the journey to life. ☁️👕 MGM Vests — Born from Nature. Made for Comfort. Hashtags: #MGMVests #Cotton #Comfort #MensVest #MadeInIndia
    1
    🌿 From the cotton field to everyday comfort.
A little CGI imagination brings the journey to life. ☁️👕
MGM Vests — Born from Nature. Made for Comfort.
Hashtags:
#MGMVests #Cotton #Comfort #MensVest #MadeInIndia
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అవకాశాలను అందిపుచ్చుకొని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ విజయనగరం, ఆగస్టు 27: యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు. యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “యువ చైతన్యం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. డెంకాడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ యువతతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువతే సారథులుగా వ్యవహరిస్తూ ప్రజలు, పోలీసులకు మధ్య వారధులుగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు తీసుకురావాలని సూచించారు. దురలవాట్ల నిర్మూలన, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నేరాల స్వరూపం, విధానం మారుతున్నాయని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే వ్యసనాలు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అందిస్తున్నప్పటికీ, కొందరు యువత చెడు స్నేహాలు, స్నేహితుల ఒత్తిడి, దురలవాట్ల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా మారితే విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి తదితర వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, మోసాలకు పాల్పడి పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను విడనాడి, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందని ఎస్పీ అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నా, మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా విద్య ఎంతో ముఖ్యమన్నారు. నేరాలకు పాల్పడే యువతపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా పెంచుతామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, యాప్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రలోభాలకు లొంగవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను అందుబాటులో ఉంచుకొని అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. రహదారి భద్రతకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతుందని వివరించారు. “యువత దేశానికి పట్టుకొమ్మలు.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది” అని ఎస్పీ పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము నేర్చుకున్న మంచి విషయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకొని సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో యువతే సారథులుగా, ప్రజలు–పోలీసుల మధ్య వారధులుగా వ్యవహరిస్తూ మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతకు డెంకాడ పోలీసులు “మీతో–మీ ఎస్పీ” కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్. రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏ.వి. లీలారావు, డెంకాడ ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
    1
    అవకాశాలను అందిపుచ్చుకొని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ 
విజయనగరం, ఆగస్టు 27: యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు. యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “యువ చైతన్యం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
డెంకాడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ యువతతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువతే సారథులుగా వ్యవహరిస్తూ ప్రజలు, పోలీసులకు మధ్య వారధులుగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు తీసుకురావాలని సూచించారు. దురలవాట్ల నిర్మూలన, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం నేరాల స్వరూపం, విధానం మారుతున్నాయని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే వ్యసనాలు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అందిస్తున్నప్పటికీ, కొందరు యువత చెడు స్నేహాలు, స్నేహితుల ఒత్తిడి, దురలవాట్ల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా మారితే విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి తదితర వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, మోసాలకు పాల్పడి పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను విడనాడి, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
చదువుతోనే సమాజంలో ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందని ఎస్పీ అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నా, మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా విద్య ఎంతో ముఖ్యమన్నారు. నేరాలకు పాల్పడే యువతపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా పెంచుతామని హెచ్చరించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, యాప్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రలోభాలకు లొంగవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మహిళల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను అందుబాటులో ఉంచుకొని అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
రహదారి భద్రతకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతుందని వివరించారు.
“యువత దేశానికి పట్టుకొమ్మలు.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది” అని ఎస్పీ పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము నేర్చుకున్న మంచి విషయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకొని సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో యువతే సారథులుగా, ప్రజలు–పోలీసుల మధ్య వారధులుగా వ్యవహరిస్తూ మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న యువతకు డెంకాడ పోలీసులు “మీతో–మీ ఎస్పీ” కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్. రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏ.వి. లీలారావు, డెంకాడ ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం.. విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.
    1
    విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం..
విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo  & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా  కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.