భక్తి పరవశంలో వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు.(తిరుపతి,ఆంధ్రప్రదేశ్ )మే 10: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అపూర్వ వైభవంగా నిర్వహించిన వసంతోత్సవాలు శనివారం భక్తిజనసంద్రంలో ఘనంగా ముగిశాయి. వేదఘోషాలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల మధ్య ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.అనంతరం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి,రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపంలో వేంచేపు చేసి ఆస్థానం వైభవంగా నిర్వహించారు.మధ్యాహ్నం 1.45 నుండి 3.30 గంటల వరకు జరిగిన స్నపన తిరుమంజనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రాజోపచారాల అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, గంధంతో స్వామి, అమ్మవార్లకు మహాభిషేకం నిర్వహించారు. చక్రధార, శంఖధార, సహస్రధార, మహాకలశాభిషేకాలను వైఖానస ఆగమరీతిలో అర్చకులు ఘనంగా చేపట్టారు.ఈ సందర్భంగా పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర వేదమంత్రాలు మారుమోగగా ఆలయ ప్రాంగణం దివ్యానుభూతిని కలిగించింది. ఏడు రకాల సుగంధ పుష్పమాలలతో స్వామి, అమ్మవార్లను అర్చకులు సుందరంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.కాగా సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, సూపరింటెండెంట్ శ్రమేష్ బాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్,ధనశేఖర్, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

- కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.1
- సిద్దిపేట జిల్లా దాతర్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్‌తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.4
- తెలంగాణలో నెల రోజులుగా ప్రభుత్వం తమ పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనకపోగా, ప్రైవేటు వ్యాపారులను కూడా పంట కొనుగోలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని వారు వాపోతున్నారు.1
- సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.1
- #ఘనంగా నంగునూరి సత్యనారాయణ జన్మదిన వేడుకలు@ నిరుపేదలకు అల్పాహారం పంపిణీ నిరుపేదలకు అల్పాహారం పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ జన్మదినం పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయిత సత్యనారాయణ, దూబకుంట రుక్మయ్య, లక్ష్మణ్ మాట్లాడుతూ, నంగునూరి సత్యనారాయణ, నిత్యం ప్రజా సేవలో ఉంటూ, అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, నంగునూరు విజయ్ , నర్సింలు, దూబకుంట లచ్చల్, రుక్మయ్య మల్లేశం నంగునూరు సత్యనారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు4
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో! ఆమెను నా కొడుకు పెళ్లి చేసుకోవాలా 17 ఏళ్ల మైనర్ బాలిక, POCSO కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు నేను మాత్రం దీనికి ఒప్పుకోను.. నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగిన నా బాధ్యత కాదు అంటూ బాధితులను బండి సంజయ్ భయపెట్టాడు బీజేపీలో ఉన్న V6 జర్నలిస్ట్ సంగప్ప బండి సంజయ్‌కి, బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించాడు బాధితులను బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్తే.. నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో, నాతో పెట్టుకోవొద్దని బెదిరించాడు హైదరాబాద్ సీపీ గారు వెంటనే బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి బాధితుల ఫోన్ రికార్డ్స్, బండి సంజయ్ ఫోన్ రికార్డ్స్, సంగప్ప ఫోన్ రికార్డ్స్ పరిశీలించాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్1
- Post by Mana Velugu1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కీలక ఆఫర్ ఇచ్చారు. తనతో కలిస్తే రేవంత్ కోరుకున్న ఉన్నత స్థానానికి తీసుకెళ్తానని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.1