logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. మొదటిసారి గర్భం దాల్చిన ఒక మహిళకు అత్యంత అరుదైన, ప్రమాదకరమైన 35 వారాల ముగ్గురు పిల్లల గర్భాధారణను విజయవంతంగా నిర్వహించి, ముగ్గురు ఆరోగ్యకరమైన శిశువులకు సురక్షితంగా జన్మనిచ్చింది. దీనితో అత్యంత ప్రమాదకరమైన, సంక్లిష్టమైన గర్భాధారణ కేసులలో కూడా అపోలో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని రుజువైంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం చాలా అరుదు, సాధారణంగా 8వేల మంది తల్లులలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ కేసులో తల్లికి గర్భాధారణ మధుమేహం ఉండటంతో ఇది మరింత సవాలుగా మారింది. హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ నేతృత్వంలోని నిపుణులైన వైద్య బృందం అత్యంత జాగ్రత్తతో కూడిన పర్యవేక్షణ, సమగ్ర చికిత్స మరియు ఖచ్చితమైన శస్త్ర చికిత్స ప్రణాళికతో ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రసవానికి ముందు తల్లికి క్రమం తప్పకుండా ఆల్ట్రాసౌండ్ పరీక్షలు, పిండం ఎదుగుదల పర్యవేక్షణ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఖచ్చితంగా నియంత్రించడం వంటివి చేస్తూ, డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ నాయకత్వంలో అనస్థీషియా వైద్యులు, ఫిజీషియన్లు, నియోనాటాలజిస్టులు, నర్సింగ్ సిబ్బందితో కూడిన మల్టీడిసిప్లీనరీ బృందం సురక్షితమైన ఫలితాన్ని సాధించింది. ప్రస్తుతం తల్లీ, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ, ముగ్గురు పిల్లల గర్భాధారణ ప్రసూతి వైద్యంలో అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని, దానికి మధుమేహం తోడైతే అది హైరిస్క్ కేసుగా మారుతుందని అన్నారు. నిరంతర పర్యవేక్షణతో 35 వారాల గర్భాధారణను విజయవంతంగా పొడిగించి, ముగ్గురు పిల్లలను సురక్షితంగా డెలివరీ చేశామని ఆమె వెల్లడించారు. నెల్లూరు అపోలో హాస్పిటల్‌లో అధునాతన ప్రసూతి నిర్వహణ అందుబాటులో ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆమెతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, చిన్న పిల్లల వైద్య నిపుణులు డా. రాజశేఖర్ రెడ్డి, డా. రఫీ, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి మరియు ఇతర విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

18 hrs ago
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. మొదటిసారి గర్భం దాల్చిన ఒక మహిళకు అత్యంత అరుదైన, ప్రమాదకరమైన 35 వారాల ముగ్గురు పిల్లల గర్భాధారణను విజయవంతంగా నిర్వహించి, ముగ్గురు ఆరోగ్యకరమైన శిశువులకు సురక్షితంగా జన్మనిచ్చింది. దీనితో అత్యంత ప్రమాదకరమైన, సంక్లిష్టమైన గర్భాధారణ కేసులలో కూడా అపోలో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని రుజువైంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం చాలా అరుదు, సాధారణంగా 8వేల మంది తల్లులలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ కేసులో తల్లికి గర్భాధారణ మధుమేహం ఉండటంతో ఇది మరింత సవాలుగా మారింది. హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ నేతృత్వంలోని నిపుణులైన వైద్య బృందం అత్యంత జాగ్రత్తతో కూడిన పర్యవేక్షణ, సమగ్ర చికిత్స మరియు ఖచ్చితమైన శస్త్ర చికిత్స ప్రణాళికతో ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రసవానికి ముందు తల్లికి క్రమం తప్పకుండా ఆల్ట్రాసౌండ్ పరీక్షలు, పిండం ఎదుగుదల పర్యవేక్షణ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఖచ్చితంగా నియంత్రించడం వంటివి చేస్తూ, డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ నాయకత్వంలో అనస్థీషియా వైద్యులు, ఫిజీషియన్లు, నియోనాటాలజిస్టులు, నర్సింగ్ సిబ్బందితో కూడిన మల్టీడిసిప్లీనరీ బృందం సురక్షితమైన ఫలితాన్ని సాధించింది. ప్రస్తుతం తల్లీ, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ, ముగ్గురు పిల్లల గర్భాధారణ ప్రసూతి వైద్యంలో అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని, దానికి మధుమేహం తోడైతే అది హైరిస్క్ కేసుగా మారుతుందని అన్నారు. నిరంతర పర్యవేక్షణతో 35 వారాల గర్భాధారణను విజయవంతంగా పొడిగించి, ముగ్గురు పిల్లలను సురక్షితంగా డెలివరీ చేశామని ఆమె వెల్లడించారు. నెల్లూరు అపోలో హాస్పిటల్‌లో అధునాతన ప్రసూతి నిర్వహణ అందుబాటులో ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆమెతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, చిన్న పిల్లల వైద్య నిపుణులు డా. రాజశేఖర్ రెడ్డి, డా. రఫీ, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి మరియు ఇతర విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వైయ‌స్సార్సీపీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి గారు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కీలక దిశానిర్దేశం చేస్తూ, కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను, రెండేళ్ల చీక‌టి పాల‌న‌లో జ‌రుగుతున్న దారుణాల‌ను ప్ర‌జ‌ల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక వివిధ సామాజిక వ‌ర్గాలు, ముఖ్యంగా ర‌జకుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, గ‌తంలో జ‌రిగిన త‌ప్పుల‌ను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే ప్ర‌భుత్వంలో పార్టీ కోసం బాధ్య‌తాయుతంగా ప‌నిచేసే ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు ఖ‌చ్చితంగా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని, వారి వివ‌రాలు పార్టీ ద‌గ్గ‌ర ఉన్నాయని స్పష్టం చేశారు. పేద‌ల‌కు మేలు చేసి, ధ‌నిక, పేదల మ‌ధ్య తార‌త‌మ్యాల‌ను తగ్గించాలన్న తాప‌త్ర‌యంతో కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ గారని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి గారు ప్రశంసించారు. జ‌నం కోసం ఆలోచించినంత కాలం దేవుడి ఆశీస్సులు ఉంటాయ‌ని నమ్మి పార్టీని న‌డిపిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ గారిని జైలు గోడలు కూడా ఆపలేకపోయాయని ఆయన అన్నారు. గెలుపోట‌ముల‌ను ఒకేరకంగా స్వీకరించే గొప్ప ధైర్యం వైయ‌స్ జ‌గ‌న్ గారికి ఉందని, నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ రెండేళ్లలో ఆయన చేసిన పోరాటాలే దీనికి నిదర్శనమని చెప్పారు. విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు కాబట్టే ఆయన బయటకు వస్తే వేలల్లో, ల‌క్ష‌ల్లో జ‌నం వస్తున్నారని, సీట్లు ఇవ్వకపోయినా ఆయన స్పందిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్ర‌జ‌లు నమ్ముతున్నారని, ఆయన మాట మీదనే భరోసా ఉంచుతున్నారని వెల్లడించారు. మరోవైపు, చంద్ర‌బాబు పోలీసుల‌ను త‌న కోసం ప‌నిచేసే కిరాయి సైన్యంలా వాడుకుంటున్నందువల్లే రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జ‌రుగుతున్నాయని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి గారు తీవ్రంగా ఆరోపించారు. చేసింది చెప్పుకుని ఎన్నిక‌ల్లో గెలవలేక పోలీసుల‌తో దౌర్జన్యాలు చేయించి రాజంపేట, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో గెలిచారని విమర్శించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టీ అమ‌లు కాలేదని, బాండ్ల మీద సంత‌కాలు చేసి మ‌రీ చంద్ర‌బాబు అన్నివ‌ర్గాల‌కు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తన మోసాల‌ను ప్ర‌జ‌లు మర్చిపోతారనే ధీమాతో ఆయన ఉన్నారని, ఎన్నిక‌ల ముందు చెప్పిన మాటల‌కు, అధికారంలోకి వ‌చ్చాక చేసే పనుల‌కు పొంత‌నే ఉండదని ఎత్తి చూపారు. ప్రశ్నించే గొంతులు నొక్క‌డానికి ఫేస్‌బుక్ ఆఫీసుల‌కే పోలీసుల‌తో ఫిర్యాదులు చేయించి అకౌంట్లు బ్లాక్ చేయిస్తున్నారని, రెండేళ్లుగా పాల‌న కాకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే సాగుతోందని ధ్వజమెత్తారు. అబ‌ద్ధపు వాంగ్మూలాల‌తో అక్ర‌మ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై స్పందించకుండా, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కేవలం వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబాన్ని తిట్టి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే వారి పనిగా పెట్టుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్షేపించారు. రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ అధికార కూట‌మిని ప్రతిఘటించాలని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాలని, కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను లెక్క‌ల‌తో తిప్పికొట్ట‌డానికి వీలుగా ప్ర‌తిఒక్క‌రూ స‌న్న‌ద్ధం కావాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్ విష‌యంలో వార్డు స్థాయి నుంచి అప్ర‌మ‌త్తంగా ప‌నిచేయాలని కూడా ఆయన ఆదేశించారు.
    1
    వైయ‌స్సార్సీపీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి గారు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కీలక దిశానిర్దేశం చేస్తూ, కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను, రెండేళ్ల చీక‌టి పాల‌న‌లో జ‌రుగుతున్న దారుణాల‌ను ప్ర‌జ‌ల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక వివిధ సామాజిక వ‌ర్గాలు, ముఖ్యంగా ర‌జకుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, గ‌తంలో జ‌రిగిన త‌ప్పుల‌ను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే ప్ర‌భుత్వంలో పార్టీ కోసం బాధ్య‌తాయుతంగా ప‌నిచేసే ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు ఖ‌చ్చితంగా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని, వారి వివ‌రాలు పార్టీ ద‌గ్గ‌ర ఉన్నాయని స్పష్టం చేశారు.

పేద‌ల‌కు మేలు చేసి, ధ‌నిక, పేదల మ‌ధ్య తార‌త‌మ్యాల‌ను తగ్గించాలన్న తాప‌త్ర‌యంతో కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ గారని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి గారు ప్రశంసించారు. జ‌నం కోసం ఆలోచించినంత కాలం దేవుడి ఆశీస్సులు ఉంటాయ‌ని నమ్మి పార్టీని న‌డిపిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ గారిని జైలు గోడలు కూడా ఆపలేకపోయాయని ఆయన అన్నారు. గెలుపోట‌ముల‌ను ఒకేరకంగా స్వీకరించే గొప్ప ధైర్యం వైయ‌స్ జ‌గ‌న్ గారికి ఉందని, నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ రెండేళ్లలో ఆయన చేసిన పోరాటాలే దీనికి నిదర్శనమని చెప్పారు. విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు కాబట్టే ఆయన బయటకు వస్తే వేలల్లో, ల‌క్ష‌ల్లో జ‌నం వస్తున్నారని, సీట్లు ఇవ్వకపోయినా ఆయన స్పందిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్ర‌జ‌లు నమ్ముతున్నారని, ఆయన మాట మీదనే భరోసా ఉంచుతున్నారని వెల్లడించారు.

మరోవైపు, చంద్ర‌బాబు పోలీసుల‌ను త‌న కోసం ప‌నిచేసే కిరాయి సైన్యంలా వాడుకుంటున్నందువల్లే రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జ‌రుగుతున్నాయని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి గారు తీవ్రంగా ఆరోపించారు. చేసింది చెప్పుకుని ఎన్నిక‌ల్లో గెలవలేక పోలీసుల‌తో దౌర్జన్యాలు చేయించి రాజంపేట, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో గెలిచారని విమర్శించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టీ అమ‌లు కాలేదని, బాండ్ల మీద సంత‌కాలు చేసి మ‌రీ చంద్ర‌బాబు అన్నివ‌ర్గాల‌కు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తన మోసాల‌ను ప్ర‌జ‌లు మర్చిపోతారనే ధీమాతో ఆయన ఉన్నారని, ఎన్నిక‌ల ముందు చెప్పిన మాటల‌కు, అధికారంలోకి వ‌చ్చాక చేసే పనుల‌కు పొంత‌నే ఉండదని ఎత్తి చూపారు. ప్రశ్నించే గొంతులు నొక్క‌డానికి ఫేస్‌బుక్ ఆఫీసుల‌కే పోలీసుల‌తో ఫిర్యాదులు చేయించి అకౌంట్లు బ్లాక్ చేయిస్తున్నారని, రెండేళ్లుగా పాల‌న కాకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే సాగుతోందని ధ్వజమెత్తారు. అబ‌ద్ధపు వాంగ్మూలాల‌తో అక్ర‌మ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై స్పందించకుండా, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కేవలం వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబాన్ని తిట్టి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే వారి పనిగా పెట్టుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్షేపించారు.

రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ అధికార కూట‌మిని ప్రతిఘటించాలని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాలని, కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను లెక్క‌ల‌తో తిప్పికొట్ట‌డానికి వీలుగా ప్ర‌తిఒక్క‌రూ స‌న్న‌ద్ధం కావాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్ విష‌యంలో వార్డు స్థాయి నుంచి అప్ర‌మ‌త్తంగా ప‌నిచేయాలని కూడా ఆయన ఆదేశించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు గంజాయి రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో శుక్రవారం స్థానిక మున్సిపల్ నెహ్రూ మైదానంలో మత్తుబాబులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి భక్తవత్సలం మాట్లాడుతూ, మొదటిసారి తప్పు చేసిన వారికి క్షమాపణ ఉంటుందని, అయితే రెండోసారి అదే తప్పు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కౌన్సిలింగ్‌లో పాల్గొన్న మత్తుబాబులతో తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు ప్రమాణం చేయించారు. దీనితో పాటు, వైద్యులు 300 మందికి గంజాయి రాపిడో టెస్టులు నిర్వహించగా, ఈ టెస్టుల్లో ఇరువురికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు.
    1
    తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు గంజాయి రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో శుక్రవారం స్థానిక మున్సిపల్ నెహ్రూ మైదానంలో మత్తుబాబులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి భక్తవత్సలం మాట్లాడుతూ, మొదటిసారి తప్పు చేసిన వారికి క్షమాపణ ఉంటుందని, అయితే రెండోసారి అదే తప్పు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ కౌన్సిలింగ్‌లో పాల్గొన్న మత్తుబాబులతో తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు ప్రమాణం చేయించారు. దీనితో పాటు, వైద్యులు 300 మందికి గంజాయి రాపిడో టెస్టులు నిర్వహించగా, ఈ టెస్టుల్లో ఇరువురికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    18 hrs ago
  • అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణంలో భాష్యం ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, బ్యాగుల అనధికారిక విక్రయంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాఠశాల యాజమాన్యం మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతోందని ఆరోపిస్తూ, శనివారం మధ్యాహ్నం విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ముందు నిరసన తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు వెంకట్, విక్రం, సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, భాష్యం ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు అనధికారికంగా అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని వారు తెలిపారు. ఈ సమాచారం స్థానిక ఎంఈఓలకు చేరగా, ఎంఈఓలు నటరాజ, రెడ్డన్న శెట్టి వెంటనే పాఠశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా, పాఠశాలలో అనధికారికంగా విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, కిట్లు ఉన్న గదిని సీజ్ చేసినట్లు ఎంఈఓలు నటరాజ, రెడ్డన్న శెట్టి వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు విక్రయించకూడదనే నిబంధనను ఉల్లంఘిస్తున్నారని, దీనిపై డిఇఓ సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.
    4
    అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణంలో భాష్యం ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, బ్యాగుల అనధికారిక విక్రయంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాఠశాల యాజమాన్యం మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతోందని ఆరోపిస్తూ, శనివారం మధ్యాహ్నం విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ముందు నిరసన తెలిపారు.

విద్యార్థి సంఘం నాయకులు వెంకట్, విక్రం, సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, భాష్యం ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు అనధికారికంగా అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని వారు తెలిపారు. ఈ సమాచారం స్థానిక ఎంఈఓలకు చేరగా, ఎంఈఓలు నటరాజ, రెడ్డన్న శెట్టి వెంటనే పాఠశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా, పాఠశాలలో అనధికారికంగా విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, కిట్లు ఉన్న గదిని సీజ్ చేసినట్లు ఎంఈఓలు నటరాజ, రెడ్డన్న శెట్టి వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు విక్రయించకూడదనే నిబంధనను ఉల్లంఘిస్తున్నారని, దీనిపై డిఇఓ సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    7 hrs ago
  • ప్రొద్దుటూరు కమిషనర్ రవిచంద్రారెడ్డి శనివారం స్థానిక 2టౌన్ బైపాస్ రోడ్డులోని మునిసిపల్ పార్కులో పచ్చదనం-పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, నిషేధిత సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రొద్దుటూరులో పచ్చదనం మరియు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ రవిచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
    1
    ప్రొద్దుటూరు కమిషనర్ రవిచంద్రారెడ్డి శనివారం స్థానిక 2టౌన్ బైపాస్ రోడ్డులోని మునిసిపల్ పార్కులో పచ్చదనం-పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, నిషేధిత సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రొద్దుటూరులో పచ్చదనం మరియు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ రవిచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈనెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బాబా రాందేవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు. రాందేవ్ బాబా కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారు గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. 2023లో సుప్రీంకోర్టు ఈ విషయాలపై విచారించి రాందేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని, పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పతంజలి కరోనిల్‌ను ఆమోదించిందని తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, కోర్టు తీర్పును అనుసరించి రాందేవ్ బాబా పత్రికలకు ప్రకటనలు ఇచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా ₹40,000 కోట్ల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకుంటున్నారని తెలిపారు. భారతీయ ప్రజలలో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభార్జన పొందుతున్నారని ఆయన వివరించారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే బాబా రాందేవ్ ను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారని సుబ్రమణ్యం ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే ఈ హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. అందువల్ల, అంతర్జాతీయ యోగా దినోత్సవ వానికి రాందేవ్ బాబాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం తగదని జన చైతన్య వేదిక పునరుద్ఘాటించింది.
    1
    గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈనెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బాబా రాందేవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు.

రాందేవ్ బాబా కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారు గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. 2023లో సుప్రీంకోర్టు ఈ విషయాలపై విచారించి రాందేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని, పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పతంజలి కరోనిల్‌ను ఆమోదించిందని తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, కోర్టు తీర్పును అనుసరించి రాందేవ్ బాబా పత్రికలకు ప్రకటనలు ఇచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పిన వ్యక్తి అని పేర్కొన్నారు.

ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా ₹40,000 కోట్ల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకుంటున్నారని తెలిపారు. భారతీయ ప్రజలలో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభార్జన పొందుతున్నారని ఆయన వివరించారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే బాబా రాందేవ్ ను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారని సుబ్రమణ్యం ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే ఈ హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు.

అందువల్ల, అంతర్జాతీయ యోగా దినోత్సవ వానికి రాందేవ్ బాబాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం తగదని జన చైతన్య వేదిక పునరుద్ఘాటించింది.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    6 hrs ago
  • వెన్నుపోటు రాజకీయాలకు పేరుగాంచిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేసిందని మాజీ మేయర్ బీవై రామయ్య గారు తీవ్రంగా ఆరోపించారు. మోసం చేయాలనే ఆలోచన లేని రైతన్నలను సైతం ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. రామయ్య గారి ప్రకటన ప్రకారం, 2014లో రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, రైతుల కోసం వైయస్ జగన్ రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చి, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధర వంటి కీలక అంశాలలో అండగా నిలిచారని ఆయన ప్రశంసించారు. చెప్పిన దానికంటే ఎక్కువ చేయడం జగన్ నైజమైతే, కోతలు పెట్టడం చంద్రబాబు నైజమని బీవై రామయ్య గారు స్పష్టం చేశారు.
    1
    వెన్నుపోటు రాజకీయాలకు పేరుగాంచిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేసిందని మాజీ మేయర్ బీవై రామయ్య గారు తీవ్రంగా ఆరోపించారు. మోసం చేయాలనే ఆలోచన లేని రైతన్నలను సైతం ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు.

రామయ్య గారి ప్రకటన ప్రకారం, 2014లో రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, రైతుల కోసం వైయస్ జగన్ రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చి, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధర వంటి కీలక అంశాలలో అండగా నిలిచారని ఆయన ప్రశంసించారు. చెప్పిన దానికంటే ఎక్కువ చేయడం జగన్ నైజమైతే, కోతలు పెట్టడం చంద్రబాబు నైజమని బీవై రామయ్య గారు స్పష్టం చేశారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియా ప్రతినిధులతో 'యోగాంధ్ర' కార్యక్రమంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలనేదే తమ లక్ష్యమని, దీనిని ఒక మిషన్ మోడ్‌లో అందరికీ చేరువ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. యోగా ప్రపంచానికి భారత్ అందించిన అమూల్యమైన బహుమతి అని, దీని ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఏకాగ్రత సాధించవచ్చని ఆయన అన్నారు. కేవలం సాంకేతికత మాత్రమే సంపదను తీసుకురాదని, భారతదేశానికి ఆధ్యాత్మికత, సంస్కృతి అత్యంత అమూల్యమైన శక్తి అని, యువత ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్ నిర్మాణానంతరం అమరావతి రాజధాని నిర్మాణ అవకాశం భగవంతుడు తనకు ప్రసాదించాడని చంద్రబాబు నాయుడు తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్‌కు అదనంగా, ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన, ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి, ఈ నగరాన్ని ఒక అధునాతన రాజధానిగా, నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
    1
    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియా ప్రతినిధులతో 'యోగాంధ్ర' కార్యక్రమంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలనేదే తమ లక్ష్యమని, దీనిని ఒక మిషన్ మోడ్‌లో అందరికీ చేరువ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. యోగా ప్రపంచానికి భారత్ అందించిన అమూల్యమైన బహుమతి అని, దీని ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఏకాగ్రత సాధించవచ్చని ఆయన అన్నారు. కేవలం సాంకేతికత మాత్రమే సంపదను తీసుకురాదని, భారతదేశానికి ఆధ్యాత్మికత, సంస్కృతి అత్యంత అమూల్యమైన శక్తి అని, యువత ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సైబరాబాద్ నిర్మాణానంతరం అమరావతి రాజధాని నిర్మాణ అవకాశం భగవంతుడు తనకు ప్రసాదించాడని చంద్రబాబు నాయుడు తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్‌కు అదనంగా, ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన, ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి, ఈ నగరాన్ని ఒక అధునాతన రాజధానిగా, నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    16 hrs ago
  • ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి, పొద్దుటూరులోని జగనన్న కాలనీల్లో జరిగిన హౌసింగ్ నిర్మాణాల అక్రమాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన సంబంధిత హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ, డిఈ, ఈఈ, పీడీ, సచివాలయ ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లక్ష్మిరెడ్డి ఉద్ఘాటించారు.
    1
    ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి, పొద్దుటూరులోని జగనన్న కాలనీల్లో జరిగిన హౌసింగ్ నిర్మాణాల అక్రమాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన సంబంధిత హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ, డిఈ, ఈఈ, పీడీ, సచివాలయ ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లక్ష్మిరెడ్డి ఉద్ఘాటించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఇబ్రహీంపట్నంలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. తాను మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పగా, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నన్నే ఆపుతావా, నేను ఎమ్మెల్యే తాలూకా, పలానా తమ్ముడిని' అంటూ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాకుండా, తాను ఒక రిపోర్టర్‌నని పేర్కొంటూ పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 'మీ అంతు చూస్తాం' అంటూ పోలీసులను, ముఖ్యంగా ఒక మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించి, వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
    1
    ఇబ్రహీంపట్నంలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. తాను మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పగా, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నన్నే ఆపుతావా, నేను ఎమ్మెల్యే తాలూకా, పలానా తమ్ముడిని' అంటూ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాకుండా, తాను ఒక రిపోర్టర్‌నని పేర్కొంటూ పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 'మీ అంతు చూస్తాం' అంటూ పోలీసులను, ముఖ్యంగా ఒక మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించి, వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.