Shuru
Apke Nagar Ki App…
ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. అభివృద్ధి పనులపై ఆలయ కమిటీ, సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల పార్టీ అధ్యక్షులు మరియు ఆలయ చైర్మన్, డైరెక్టర్లు, ఆలయ అధికారులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
K.V.REDDY
ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. అభివృద్ధి పనులపై ఆలయ కమిటీ, సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల పార్టీ అధ్యక్షులు మరియు ఆలయ చైర్మన్, డైరెక్టర్లు, ఆలయ అధికారులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లాలో వర్షం ఎఫెక్ట్ తో కూలిన ఇళ్ళు...బాధితులను ఆదుకోవాలని అధికారులను కోరిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లోని పెంబట్ల కోనపూర్ గ్రామాలలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మాజీమంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు. అధిక వర్షానికి కూలిపోయిన ఇళ్ళను పరిశీలించారు. MRO, RDO తో ఫోన్ లో మాట్లాడారు. ఇల్లు పూర్తిగా కూలితే నష్ట పరిహారం ఎంత వస్తుందని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు . ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తామని తెలిపారు.4
- నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పటేల్MLC, TRP పార్టీ అధ్యక్షుడు నారాయణ విద్యాసంస్థల విద్యార్థుల ర్యాంకుల అడ్వటైజ్మెంట్ పై ప్రశ్నిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరిగింది. ఇది చాలా బాధాకరం MLC పదవిలో ఉన్నారు మీరు కార్పొరేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య మరియు నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా శాసనమండలిలో నియమ నిబంధనలతో కఠిన చట్టాలను అమలు ఆచరణలోకి తీసుకొచ్చేలా ప్రశ్నించు యుద్ధం చెయ్ ప్రభుత్వం పైన శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఎదగడానికి కోసమో ప్రయత్నించకండి దయచేసి. తిట్టడం వల్ల బెదిరించడం వల్ల తాత్కాలిక ఉపశమనం కూడా దొరకదు.1
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.2
- 22వ డివిజన్‌లో మహాశక్తి స్టీల్ బ్యాంక్ ప్రారంభించిన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ వినియోగాన్ని ప్రోత్సహించాలి – మేయర్ కరీంనగర్ నగరంలోని 22వ డివిజన్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన *మహాశక్తి స్టీల్ బ్యాంక్* ను నగర మేయర్ *కొలగాని శ్రీనివాస్* ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, అందువల్ల ప్రజలు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ పాత్రలను వినియోగించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో పర్యావరణహిత జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు మహాశక్తి స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. 22వ డివిజన్‌లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రల వినియోగాన్ని పూర్తిగా నివారించే ఉద్దేశంతో *1000 స్టీల్ ప్లేట్లు, 200 స్టీల్ గ్లాసులతో కూడిన స్టీల్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని* తెలిపారు. ఈ స్టీల్ పాత్రలను డివిజన్‌లోని ప్రజలకు శుభకార్యాల సందర్భాల్లో ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మేయర్ అన్నారు. నగరంలో స్వచ్ఛతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ *బండ రమణారెడ్డి*, బొడ్ల కృష్ణ, పెద్ది శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, శ్రీకాంత్, వేణుగోపాల్, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, కొండలరావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్, రవి, సంతోష్ రెడ్డి, మధు స్థానిక నాయకులు పాల్గొన్నారు.4
- గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..! కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1
- సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అత్తారింట్లో అల్లుడు చోరీ.. ముగ్గురు అరెస్టు...తండ్రీకొడుకు యుపిలో కోర్టులో లొంగుబాటు. కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీ కేసులో ప్రధాన నిందితులు అల్లుడు మనువడేనని పోలీసులు తేల్చారు. అత్తారింట్లో అల్లుడు చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డిసిపి వెంకటరమణ సమక్షంలో అరెస్ట్ అయిన ముగ్గురిని చూపించి వివరాలు వెల్లడించారు. భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబ కలహాలతో కుట్రపూరితంగా చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రజావుద్దిన్ అతని కొడుకు అజీమ్ రజాపై యూపిలో రెండు కేసులు ఉన్నాయని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పాతకేసుల్లో యూపి లోని మీరట్ కోర్టులో లొంగిపోయారని పిటి వారెంట్ పై కరీంనగర్ కు త్వరలోనే తరలించడం జరుగుతుందన్నారు. చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ అరెస్టు చేశామని చెప్పారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64. 98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని మిగతాది త్వరలోనే రికవరీ చేస్తామని తెలిపారు. చోరీలో ఇంకా కుటుంబ సభ్యుల ప్రమేయం ఎవరిది ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.2