ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీ రాములు జిల్లా శాఖ నందు తేదీ 07-01-2026 న రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు శ్రీ జీన్ హెన్రి డ్యూనాంట్ గారి విగ్రహ ఆవిష్కరణ నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ హిమాన్షు శుక్లా IAS గారిచే ప్రారంబించబడినది. ఈ సందర్భంగా విగ్రహ దాత అయినటువంటి శ్రీ కలికి శ్రీహరి రెడ్డి కోఆర్డినేటర్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ వారిని కలెక్టర్ గారు ప్రత్యకంగా ప్రశంసించారు. అనంతరం రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రం లో జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవ కార్యక్రమ వేడుకలు (డా. JG జోలీ గారి జన్మదినం) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ హిమాన్షు శుక్లా IAS గారు విచ్చేసి అత్యధిక సార్లు రక్త దానం చేయించిన రక్త ప్రేపరకులకు 135 మందికి (మోటివేటర్స్) జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రాలను అందచేయడం జరిగింది. ముందుగా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా IAS గారు, చైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ చమర్తి జనార్ధన్ రాజు, కోశాధికారి శ్రీ సురేష్ కుమార్ జైన్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ డి. రవి ప్రకాష్ రక్త నిధి కో ఆర్డినేటర్ మరియు మేనజింగ్ కమిటీ మెంబర్ శ్రీ బయ్యా ప్రసాద్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ కలికి శ్రీహరి రెడ్డి, శ్రీ యడవలి సురేష్, శ్రీ గుణపాటి ప్రసాద్ రెడ్డి, శ్రీ యాలమూరి రంగయ్య నాయుడు మరియు శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి జీన్ హెన్రి డ్యూనాంట్ మరియు డాక్టర్ డా. JG జోలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, తలసేమియా, రక్తనిధి మరియు వివిధ రకాల ప్రాజెక్టుల ద్వారా చేస్తున్న సేవలను గురించి తెలుసుకుని రెడ్ క్రాస్ ఛైర్మన్ ను అభినందించారు. అనంతరం ఛైర్మన్ శ్రీ వాకటి విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రక్త నిధికి రాష్ట్ర స్థాయిలో ఒక విశిష్ట స్థానం వుందని, నెల్లూరు జిల్లాలో ఎటువంటి విపత్తులు ఎదురైన మేము వున్నామని ధైర్యాన్ని కలిగించి వారికి ఆపన్న హస్తమును అందిస్తున్నారని ఇంతమంది రక్త ప్రేరపకులకు (మోటివేటర్స్) రెడ్ క్రాస్ లో చూడడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలియచేసారు. అనంతరం శ్రీ బయ్యా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది అని మరియు రాష్ట్రములో రక్త నిల్వలు కొరత వలన ఇంకా అనేక మందికి రక్తము అవసరం ఉన్నందున యువత రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మరింతగా మెరుగైన సేవలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా వాడ వాడల రెడ్ క్రాస్ సేవలు (రక్త గ్రూప్ నిర్ధారణ పరీక్షలు) అనే కార్యక్రమమును ఉచితంగా రెడ్ క్రాస్ ద్వారా పరీక్షలు చేస్తామని కలెక్టర్ గారి సమక్షంలో తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మాజీ ఛైర్మన్ డా. ఎ. వి. సుబ్రమణ్యం, శ్రీ యండి. జూబేర్ మాజీ కన్వీనర్ క్యాన్సర్ హాస్పిటల్, రెడ్ క్రాస్ సెక్రెటరీ శ్రీ పి. మస్తానయ్య మరియు జీవితకాల సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

- నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల సుంకు జంగన్న నగర పాలక హై స్కూల్ నందు సంక్రాంతి భోగి కనుమ పండుగ ముందస్తు వేడుకలు విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే క్రమంలో సృజనాత్మకతను వెలికి తీసే క్రమంలో రంగవల్లి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. గెలుపొందిన వారికి ఐదు మందికి ప్రత్యేక బహుమతులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతిని అందిస్తామని తెలిపారు. అదే క్రమంలో విద్యార్థులతో మేము సైతం అంటూ ఉపాధ్యాయులు కూడా రంగవల్లి పోటీలలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఉపాధ్యాయులు. ముందస్తు భోగి వేడుకలను కూడా విద్యార్థులతో కలిసి పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ కె అరవింద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమటం సుబ్బారావు రామ్మోహన్ సుబ్బరాజు మహేంద్ర ప్రభాకర్ అస్మా ప్రవీణ అరుణ తదితరులు విద్యార్థులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.3
- Post by Bondhu Suresh1
- చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు #STV9: రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వమని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ #chandhragi1
- ఆసుపత్రిలో తండ్రి ప్రేమను చూపించిన హృదయవిదారక వీడియో. అనారోగ్యంతో ఉన్న తన కూతురిని సంతోషంగా ఉంచేందుకు తండ్రి నవ్వుతూ, ఆమెతో మాట్లాడుతూ పక్కనే ఉండే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.1
- కాసినయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి గత 6 సంవత్సరాలుగా పక్షవాతనికి గురై మంచానికి పరిమితమైంది.భర్త చనిపోవడం తో ఆమె రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న మూలపల్లె టీచర్ చంద్రశేఖర్ ఆచారి ఆమె రూ.2లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి మానవత్వం చాటుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఆమె ఇంటికి రంగులు వేయించాడు. ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఆమె చిన్న కుమారుడు చదువు కోసం ఖర్చు చేస్తున్నాడు.2
- విశాఖపట్నం గాజువాకలోని ఓం జ్యువలరీ షాపులో జరిగిన ఈ దొంగతనం ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. గాజువాక బి.సి. రోడ్డులోని ఓం జ్యువలరీ షాపులోకి ముగ్గురు మహిళలు కస్టమర్లలా వేషధారణలో వచ్చారు. నగలు చూపిస్తుండగా, షాపు యజమాని కళ్లు గప్పి అత్యంత చాకచక్యంగా బంగారు వస్తువులను తమ జడల్లో (కొప్పులో) దాచుకోవడానికి ప్రయత్నించారు. మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని, సిబ్బంది వారిని నిశితంగా గమనించారు. వారు బంగారాన్ని జడలో పెట్టుకోవడం గమనించిన యజమాని వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. నిందితులను సోదా చేయగా దొంగిలించిన బంగారం బయటపడింది. పోలీసుల విచారణలో పట్టుబడిన మహిళలను ఈ క్రింది విధంగా గుర్తించారు: 1.-భోజ నాగమణి 2.-బోజగాని జ్ఞానమ్మ 3.-పొన్నా పద్మ సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో ఉన్నారు వీరు పాత నేరస్తులా? లేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండటం, యజమాని అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఈ భారీ దొంగతనం విఫలమైంది. గాజువాక పరిసరాల్లోని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.1
- తనకల్లు మండల పరిధిలోని హత్య కేసు కు సంబంధించిన నేరస్తులను కాలినడకన సబ్ జైలుకు తరలించారు. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట జరిగిన హత్యకు సంబంధించిన హంతకులను రిమాండ్ విధించడంతో స్థానిక పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ నుండి సబ్ జైలుకు నడిపించుకుంటూ రిమాండ్ కు పంపించారు. డీఎస్పీ శివ నారాయణస్వామి గ్రామీణ సర్కిల్ సిఐ నాగేంద్ర పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1