logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

26వ వార్డులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ సిరిసిల్ల పట్టణంలో స్థానిక 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగ రావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి , మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

22 hrs ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
22 hrs ago

26వ వార్డులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ సిరిసిల్ల పట్టణంలో స్థానిక 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగ రావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి , మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారులో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సదరు వ్యక్తిని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని, అతడి వివరాలు తెలియరాలేదని SI ఆంజనేయులు తెలిపారు.
    1
    కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారులో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సదరు వ్యక్తిని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని, అతడి వివరాలు తెలియరాలేదని SI ఆంజనేయులు తెలిపారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • హోలీ పండుగ పూట జగిత్యాల పోచమ్మవాడ లో విషాదం అలుముకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు ఉదయం గోదావరి పుణ్యస్నానాలకు వెళ్ళి వచ్చే సరికి ప్రణవి ఇంట్లో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కూతురును స్థానికుల సహాయంతో పేరెంట్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం ఇచ్చిన సకాలంలో 108 రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో చేతులపైనే పేషెంట్ ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి ప్రాణాలు కోల్పోయిందని తెలుపడంతో పేరెంట్స్ బోరున విలపించారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదని, కనీసం స్ట్రెచ్చర్ కూడా తీసుకొచ్చి పేషంటును ఆసుపత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణవి ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ పెళ్ళి సంబంధాలు చూసినట్లు పేరెంట్స్ తెలిపారు. ఎలాంటి గొడవలు లేవని పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
    1
    హోలీ పండుగ పూట జగిత్యాల పోచమ్మవాడ లో విషాదం అలుముకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు ఉదయం గోదావరి పుణ్యస్నానాలకు వెళ్ళి వచ్చే సరికి ప్రణవి ఇంట్లో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కూతురును స్థానికుల సహాయంతో పేరెంట్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం ఇచ్చిన సకాలంలో 108 రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో చేతులపైనే పేషెంట్ ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి ప్రాణాలు కోల్పోయిందని తెలుపడంతో పేరెంట్స్ బోరున విలపించారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదని, కనీసం స్ట్రెచ్చర్ కూడా తీసుకొచ్చి పేషంటును ఆసుపత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణవి ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ పెళ్ళి సంబంధాలు చూసినట్లు పేరెంట్స్ తెలిపారు. ఎలాంటి గొడవలు లేవని పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గావించారు.అలంకరణ అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి మహా నైవేద్యం ఇచ్చారు అనంతరం కేతు చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు తర్వాత భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగిస్తామనిఆలయ ఈవో వీరేశంతెలిపారు.
    1
    తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గావించారు.అలంకరణ అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి మహా నైవేద్యం ఇచ్చారు అనంతరం కేతు చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు తర్వాత భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగిస్తామనిఆలయ ఈవో వీరేశంతెలిపారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామ శివారులో శ్రీ దుర్గా మాత స్వయంగా వెలిసింది. నేడు మంగళవారం ఉదయం మంజీర నీళ్ళతో అమ్మవారిని అభిషేకం చేసి, రకరకాల పువ్వులతో, పండ్లతో శంకర్ శర్మ పంతులు అమ్మవారిని అలంకారణ చేశాడు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. భక్త భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
    4
    మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామ శివారులో శ్రీ దుర్గా మాత స్వయంగా వెలిసింది. నేడు మంగళవారం ఉదయం  మంజీర నీళ్ళతో అమ్మవారిని అభిషేకం చేసి, రకరకాల పువ్వులతో, పండ్లతో శంకర్ శర్మ పంతులు అమ్మవారిని అలంకారణ చేశాడు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. భక్త భారీ సంఖ్యలో   అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
    user_Press Press
    Press Press
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.
    4
    గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు.
ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సతీమణి భీమేశ్వర స్వామి దర్శించుకున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ సతీమణి వర్ష స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు.
    1
    జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే  సతీమణి  భీమేశ్వర స్వామి దర్శించుకున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ సతీమణి వర్ష స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు  ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • కామారెడ్డిలో హోలీ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఏడాది రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రజలు ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవడం విశేషం. పర్యావరణానికి హాని కలగకుండా సహజ రంగులను వాడటంపై యువత, చిన్నారులు అవగాహన ప్రదర్శించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పట్టణమంతా సందడి నెలకొంది.
    1
    కామారెడ్డిలో హోలీ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఏడాది రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రజలు ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవడం విశేషం. పర్యావరణానికి హాని కలగకుండా సహజ రంగులను వాడటంపై యువత, చిన్నారులు అవగాహన ప్రదర్శించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పట్టణమంతా సందడి నెలకొంది.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • రంగుల కేళి రంగోలి.. హోళీ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో హోళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్ద స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఎత్తున జనం పరస్పరం రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల్లో మునిగి తేలారు. నగరంలో పలు చోట్ల మహిళలు ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని రెయిన్ డ్యాన్స్ చేశారు. హోలీ వేడుకలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు. హోలీ ప్రత్యేకతను చాటి చెప్పారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. హోళీ పండుగతో కోడిగుడ్లకు భలే గారాకీ పెరిగింది. రంగులే కాకుండా కోడిగుడ్లు ఒకరిపై ఒకరు కొట్టుకుని హోళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగులతో పాటు పలు దుకాణాల్లో కోడిగుడ్లు ఖాళీ అయ్యాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా హోళీ వేడుకల్లో మునిగి తేలారు. డిజే సౌండ్స్ తో స్త్రీ పురుష వయోభేదం లేకుండా నృత్యాలు చేశారు. హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. హోళీ సందర్భంగా రంగుల్లో మునిగి తేలిన జనం చల్లని పానియాలు.. మద్యంతో విందు భోజనాలు ఆరగించారు. హోళీతో వైన్ షాప్ లు రద్దీగా మారి కొన్ని షాప్ ల్లో స్టాక్ ఖాళీ అయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రంగులు చల్లుకుని హోళీ సంబరాలతో ఆడిపాడిన యువత, మధ్యాహ్నం నుంచి విందు వినోదాలతో కాలం గడిపారు.
    4
    రంగుల కేళి రంగోలి.. హోళీ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో హోళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్ద స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఎత్తున జనం పరస్పరం రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల్లో మునిగి తేలారు. నగరంలో పలు చోట్ల మహిళలు ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని రెయిన్ డ్యాన్స్ చేశారు. హోలీ వేడుకలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు. హోలీ ప్రత్యేకతను చాటి చెప్పారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
హోళీ పండుగతో కోడిగుడ్లకు భలే గారాకీ పెరిగింది. రంగులే కాకుండా కోడిగుడ్లు ఒకరిపై ఒకరు కొట్టుకుని హోళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగులతో పాటు పలు దుకాణాల్లో కోడిగుడ్లు ఖాళీ అయ్యాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా హోళీ వేడుకల్లో మునిగి తేలారు. డిజే సౌండ్స్ తో స్త్రీ పురుష వయోభేదం లేకుండా నృత్యాలు చేశారు. హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. హోళీ సందర్భంగా రంగుల్లో మునిగి తేలిన జనం చల్లని పానియాలు.. మద్యంతో విందు భోజనాలు ఆరగించారు. హోళీతో వైన్ షాప్ లు రద్దీగా మారి కొన్ని షాప్ ల్లో స్టాక్ ఖాళీ అయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రంగులు చల్లుకుని హోళీ సంబరాలతో ఆడిపాడిన యువత, మధ్యాహ్నం నుంచి విందు వినోదాలతో కాలం గడిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.