Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డిలో ఈ ఏడాది రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రజలు ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగ కామారెడ్డిలో హోలీ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఏడాది రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రజలు ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవడం విశేషం. పర్యావరణానికి హాని కలగకుండా సహజ రంగులను వాడటంపై యువత, చిన్నారులు అవగాహన ప్రదర్శించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పట్టణమంతా సందడి నెలకొంది.
Narmala Swapna
కామారెడ్డిలో ఈ ఏడాది రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రజలు ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగ కామారెడ్డిలో హోలీ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఏడాది రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రజలు ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవడం విశేషం. పర్యావరణానికి హాని కలగకుండా సహజ రంగులను వాడటంపై యువత, చిన్నారులు అవగాహన ప్రదర్శించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పట్టణమంతా సందడి నెలకొంది.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గావించారు.అలంకరణ అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి మహా నైవేద్యం ఇచ్చారు అనంతరం కేతు చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు తర్వాత భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగిస్తామనిఆలయ ఈవో వీరేశంతెలిపారు.1
- ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఇంచార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ తో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజర్ అయ్యారు. దీనిని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గైర్హాజర్ అయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.1
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని శంభులోంగేశ్వర కాలనీ లో రేపు హోళీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి కామ దహనానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చురుకుగా పాల్గొన్నారు. కనుమరుగైపోతున్న సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరూ అందించాలని వారు తెలిపారు3
- Post by Gajapally Narsaiah1
- కామారెడ్డిలో హోలీ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఏడాది రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రజలు ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవడం విశేషం. పర్యావరణానికి హాని కలగకుండా సహజ రంగులను వాడటంపై యువత, చిన్నారులు అవగాహన ప్రదర్శించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పట్టణమంతా సందడి నెలకొంది.1
- ప్రచురణార్థం మెదక్ 02 ఫిబ్రవరి 2026 *జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు : కలెక్టర్* : హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.1