ప్రభుత్వ ఉన్నత పాఠశాల బోథ్ బుజుర్గ్ లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సామాజిక అడవుల ప్రాముఖ్యత,పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, మానవుని చర్యలు -ప్రకృతి వైపరీత్యాలు మాడల్ల ప్రదర్శన మరియు వివిధ సైన్స్ సూత్రాలకు సంబంధించిన ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజపల్లి నర్సయ్య మాట్లాడుతూ సర్ సి.వి. రామన్ కు నోబెల్ బహుమతి సాధించిన కాంతి పరీక్షేపణ ప్రయోగంను ప్రదర్శించిన రోజును భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవం గా ప్రకటించింది.ఈ సూత్రం ఆధారంగా ఆకాశం,సముద్రం నీలి రంగులో కనపడటానికి కారణాన్ని వివరించారు.అంతే కాకుండా ఆధునిక పరికరాలయిన రిమోట్ కంట్రోల్ ను, మనిషి రాగానే ఆటోమేటిక్ గా తెరుచుకునే డోర్లు, చేతులు పెట్టగానే ఆటోమేటిక్ గా చాల్ అయ్యే నల్లలు, లోహాల స్వచ్ఛతను,నేలలోని ఖనిజ సంపదను, ల్యాండ్ మైన్స్ (బాంబులు)ను, ప్రారంభ దశలో క్యాన్సర్ ను గుర్తించట,డ్రగ్స్ ను గుర్తించటానికి పరికరాలను కనుగొనటం సాధ్యమయిందని తెలియజేశారు.సైన్స్ తోనే దేశ ప్రగతి సాధ్యమయితుందని, శాస్త్ర, సాంకేతిక పరికరాలను వినియోగించటం వలన అన్ని రకాల ఉత్పత్తులను పెంచి దేశాన్ని సుసంపన్నంగా మార్చవచ్చని తెలియజేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు జాదవ్ విజేశ్, రమేశ్, గంగయ్య, భూమేశ్, గజేందర్, పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

- Post by Gajapally Narsaiah1
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోలీ పండుగను పురస్కరించుకుని కామ దహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన కోడల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కామ దహనం జరిపారు. కామ దహన వేడుకల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని, పూజలు నిర్వహించారు.1
- ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఫకీర్ నాయక్ తండలో Holi సందర్భంగా కామదహనం వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామస్తులు ఒకేచోట చేరి సంప్రదాయ పద్ధతిలో కట్టెలతో చుట్టం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ చేశారు. అనంతరం కామదహనం నిర్వహించగా, గ్రామస్తులు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ కుటుంబ సుఖశాంతులు, పంటలాభాలు కోరుకున్నారు. యువత డోలు వాయిద్యాలు, డీజే సౌండ్స్‌తో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు ప్రత్యేక వంటకాలు తయారు చేసి పరస్పరం పంచుకున్నారు. శాంతిభద్రతల నడుమ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేడుకలు విజయవంతంగా ముగిశాయి. గ్రామంలో హోలీ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతున్నాయి.1
- వికారాబాద్ లో నిర్వహించిన డిసిసి అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డాన్స్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిసిసి అధ్యక్షుల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతులమీదగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న బొజ్జు డాన్స్ చేస్తూ మెమోరాండం పొందారు.1
- కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారులో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సదరు వ్యక్తిని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని, అతడి వివరాలు తెలియరాలేదని SI ఆంజనేయులు తెలిపారు.1
- శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నెహ్రు నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి విశిష్ట అతిధులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు దూడం రజిని శ్రీనివాస్, ఎర్ర వెంకటరాజం, మెరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూరం శంకర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వారు నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా మమ్మల్ని మరియు కౌన్సిలర్లను, పద్మశాలి సంఘం అధ్యక్షులు వారిని దేవస్థానం ఆధ్వర్యంలో సన్మానిస్తున్నందుకు ముందుగా వారందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.ఆపద మొక్కులవాడిగా ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా కొలువబడుతున్న ఈ సీతారామాంజనేయుల సాక్షిగా మమ్మల్ని సన్మానించడం తో మా పై మరింత బాధ్యత పెరిగింది అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో బిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి పార్టీలకతీతంగా ఆ సీతారామ భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో సిరిసిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు వెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అంతే కాకుండా గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి మంత్రివర్యులు కేటీఆర్ సహకారంతో ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించడం జరిగింది.కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి పురపాలక సంఘం నుండి ఇంక కూడ సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం అధ్యక్ష పాలకవర్గ సభ్యులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి రంగుల సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి వేడుకలు స్నేహభావం, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు1
- ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఇంచార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ తో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజర్ అయ్యారు. దీనిని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గైర్హాజర్ అయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.1