Shuru
Apke Nagar Ki App…
నగరంలో హోలీ పండుగను పురస్కరించుకొని ఘనంగా కామ దహన వేడుకలు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోలీ పండుగను పురస్కరించుకుని కామ దహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన కోడల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కామ దహనం జరిపారు. కామ దహన వేడుకల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని, పూజలు నిర్వహించారు.
Sri
నగరంలో హోలీ పండుగను పురస్కరించుకొని ఘనంగా కామ దహన వేడుకలు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోలీ పండుగను పురస్కరించుకుని కామ దహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన కోడల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కామ దహనం జరిపారు. కామ దహన వేడుకల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని, పూజలు నిర్వహించారు.
More news from తెలంగాణ and nearby areas
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోలీ పండుగను పురస్కరించుకుని కామ దహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన కోడల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కామ దహనం జరిపారు. కామ దహన వేడుకల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని, పూజలు నిర్వహించారు.1
- కామారెడ్డి జిల్లా : ముంబాజీపేట 21 ఫీట్ల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన' లింగంపేట మండలంలోని ముంబాజిపేట తండా జగదాంబ సేవలాల్ ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 21 అడుగుల ధ్వజస్తంభంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నాడు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మహాహోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.1
- Post by Gajapally Narsaiah1
- మెదక్ జిల్లా కలెక్టరేట్, అందనపు కలెక్టర్ క్యాంప్ కార్యాలయాల్లో హోలీ కార్యక్రమాల్లో రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ , అధికారులు సిబ్బందితో కలిసి స్వయంగా పాల్గొని అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి …కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఈ రంగుల హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామ శివారులో శ్రీ దుర్గా మాత స్వయంగా వెలిసింది. నేడు మంగళవారం ఉదయం మంజీర నీళ్ళతో అమ్మవారిని అభిషేకం చేసి, రకరకాల పువ్వులతో, పండ్లతో శంకర్ శర్మ పంతులు అమ్మవారిని అలంకారణ చేశాడు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. భక్త భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.4
- శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నెహ్రు నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి విశిష్ట అతిధులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు దూడం రజిని శ్రీనివాస్, ఎర్ర వెంకటరాజం, మెరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూరం శంకర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వారు నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా మమ్మల్ని మరియు కౌన్సిలర్లను, పద్మశాలి సంఘం అధ్యక్షులు వారిని దేవస్థానం ఆధ్వర్యంలో సన్మానిస్తున్నందుకు ముందుగా వారందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.ఆపద మొక్కులవాడిగా ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా కొలువబడుతున్న ఈ సీతారామాంజనేయుల సాక్షిగా మమ్మల్ని సన్మానించడం తో మా పై మరింత బాధ్యత పెరిగింది అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో బిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి పార్టీలకతీతంగా ఆ సీతారామ భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో సిరిసిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు వెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అంతే కాకుండా గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి మంత్రివర్యులు కేటీఆర్ సహకారంతో ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించడం జరిగింది.కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి పురపాలక సంఘం నుండి ఇంక కూడ సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం అధ్యక్ష పాలకవర్గ సభ్యులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.1
- వికారాబాద్ లో నిర్వహించిన డిసిసి అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డాన్స్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిసిసి అధ్యక్షుల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతులమీదగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న బొజ్జు డాన్స్ చేస్తూ మెమోరాండం పొందారు.1
- ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఇంచార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ తో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజర్ అయ్యారు. దీనిని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గైర్హాజర్ అయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.1