Shuru
Apke Nagar Ki App…
మెదక్ జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రతిమసింగ్ ప్రచురణార్థం మెదక్ 02 ఫిబ్రవరి 2026 *జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు : కలెక్టర్* : హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.
మెదక్ న్యూస్
మెదక్ జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రతిమసింగ్ ప్రచురణార్థం మెదక్ 02 ఫిబ్రవరి 2026 *జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు : కలెక్టర్* : హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.
More news from తెలంగాణ and nearby areas
- లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- సదాశివపేటలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే తమ్ముడు అక్రమాలు చేశాడు: సదాశివపేటలో మీడియాతో మాట్లాడిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- ఈ నెల 6వ తేదీన బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *అనుముల రేవంత్ రెడ్డి *గారి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు వివేక్ వెంకటస్వామి గారు నేడు బాసరకు విచ్చేశారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్ గారు, బాసర సర్పంచ్ శ్రీ తీగల వెంకటేష్ గౌడ్ గారు మరియు EX MLA జి.విఠల్ రెడ్డి గారు EX సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు గారు EX సర్పంచ్ కిర్గుల్ శ్రీ పెద్దకొండూరి సుధాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ సయ్యద్ అలీ గారు బాసర గ్రామ టీమ్ విఠల్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై వారు క్షేత్రస్థాయిలో చర్చించారు.1
- గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.1