Shuru
Apke Nagar Ki App…
సదాశివపేటలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే తమ్ముడు అక్రమాలు చేశాడు: సదాశివపేటలో మీడియాతో మాట్లాడిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ
Sangareddy News
సదాశివపేటలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే తమ్ముడు అక్రమాలు చేశాడు: సదాశివపేటలో మీడియాతో మాట్లాడిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ
More news from తెలంగాణ and nearby areas
- విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయాత్ర ఆత్మ హిందూ బంధువులకు ఆహ్వానం ధైర్యం శక్తిసామర్థ్యాల ప్రతీక హనుమంతుడు తన అనంతబల పరాగ్రామాలతో రామ కార్యం సులభతరం చేసిన వీర హనుమాన్ శక్తులు అపారం తున్న విదర్మీల ఆకృత్యాలు ఎదుర్కోవడానికి హిందూ సమాజం నిలవాలంటే ప్రతి ఒక్కరు అనుమంతుని ఆదర్శంగా తీసుకొని ఐక్యత ప్రదర్శించాలన్నారు హిందూ సమాజ పరిరక్షణకు పూనుకోవాలన్నారు. మెదక్ పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వెల్కమ్బోడు వద్ద సాయంత్రం ఐదు గంటలకు విజయ యాత్ర ప్రారంభమవుతుందని సంయోజక్ మహేంద్ర పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు ఈ యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు మీయొక్క వ్యాపారాలను రెండు గంటల పాటు వదిలి విజయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.1
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నడిమితండాలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గ్రామానికి చెందిన భూక్యా పద్మ నివాసపు పూరి గుడిసె పూర్తిగా కాలి దగ్ధమైంది. గమనించిన స్థానికులు స్పందించి మంటలను ఆరిపివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణామాన్ని జరగలేదు. అలాగే సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.1
- కరీంనగర్ జిల్లాలో కన్నతండ్రే కవల పిల్లల పట్ల కాలయముడులా మారాడు. ఆడపిల్లలనే అక్కసుతో భార్యతో గొడవ పడి ఇద్దరు కవల పిల్లలకు విషమిచ్చి బావిలో పడేశాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే కచ్చు శ్రీశైలంకు కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి గీతాన్ శ్రీ, గీతాన్విక నామకరణం చేశారు. ఇద్దరు ఆడబిడ్డలేనన్న కారణంతో తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. బంధువులు జోక్యం చేసుకుని పలుమార్లు సర్దిచెప్పారు. ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారన్న విషయంపై ఈరోజు ఉదయం కూడా భార్యతో గొడవ పడ్డాడు. బిడ్డలు ఇద్దరికీ గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు. ఏమి ఎరగనట్లు స్థానికులతో కలిసి పిల్లల కోసం వెతికి బావిలో నుంచి వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఒక పాప మృతదేహం లభించగా మరొకరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. చూడ ముచ్చటగా ఉన్న పసి పిల్లలను ప్రాణం తీసిన తండ్రి శ్రీశైలం పై స్థానికులు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆడపిల్లలు అనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.4
- హన్మకొండ జిల్లాలో ఓ ఎంఆర్వోపై భార్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ఎంఆర్వో గిరిబాబు ఐదేళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య ఝాన్సీరాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యా పిల్లలను పట్టించుకోకుండా వేరే మహిళతో ఉంటూ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను తీసుకొచ్చి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.3
- ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు. హైదరాబాద్ చిల్కానగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, నేర్ధం భాస్కర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా అన్యాయం చేస్తోందని, బడ్జెట్ లో కూడా బీసీలను విస్మరించిందని ఆరోపించారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంగా, రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో బీసీలను గెలిపించుకుంటామని ఆయన అన్నారు. పాపన్న స్ఫూర్తితో కుల సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు.1
- దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహణ 📅 తేదీ : 03.04.2026 📍 స్థలం : IDOC, కామాహరెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (LB) శ్రీ మధు మోహన్ గారు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, “దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమర వీరుడని, రెండు పదుల వయసు నిండకుండానే భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల కోసం రైతాంగ పోరాటం చేసి అమరుడైన మహా వీరుడని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని, ఆయన ధైర్యసాహసాలు మరియు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.” అలాగే బహుజన సంఘాల నాయకులు, కుర్మ సంఘం నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సహాయ బీసీ అభివృద్ధి అధికారి శ్రీ చక్రధర్ గారు, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, గణేష్ నాయక్, విఠల్, నాగరాజు, కుర్మ సంఘం నాయకులు భూమయ్య, సంజీవ్ స్వామి, అశ్వక్, నరేష్, స్వప్న, సునీత, పవన్ మరియు జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు చల్లని త్రాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన జల ప్రసాద కేంద్రం ప్లాంట్ ద్వారా కూలర్లకు నల్లల ద్వారా త్రాగునీరు అందిస్తూ భక్తులకు సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే సేవా వాలంటీర్ల సహకారంతో అవసరమైన ప్రాంతాల్లో కూల్ బబుల్స్ ఏర్పాటు చేసి భక్తులకు సులభంగా నీరు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నటరాజ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి ప్రారంభించారు.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా అవసరాన్ని బట్టి మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు, అలాగే విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి త్రాగునీరు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సేవా వాలంటీర్లు పాల్గొన్నారు1