కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్ లో దారుణం...కవల ఆడపిల్లలకు విషమిచ్చి బావిలో పడేసిన కన్నతండ్రీ శ్రీశైలం... దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. కరీంనగర్ జిల్లాలో కన్నతండ్రే కవల పిల్లల పట్ల కాలయముడులా మారాడు. ఆడపిల్లలనే అక్కసుతో భార్యతో గొడవ పడి ఇద్దరు కవల పిల్లలకు విషమిచ్చి బావిలో పడేశాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే కచ్చు శ్రీశైలంకు కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి గీతాన్ శ్రీ, గీతాన్విక నామకరణం చేశారు. ఇద్దరు ఆడబిడ్డలేనన్న కారణంతో తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. బంధువులు జోక్యం చేసుకుని పలుమార్లు సర్దిచెప్పారు. ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారన్న విషయంపై ఈరోజు ఉదయం కూడా భార్యతో గొడవ పడ్డాడు. బిడ్డలు ఇద్దరికీ గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు. ఏమి ఎరగనట్లు స్థానికులతో కలిసి పిల్లల కోసం వెతికి బావిలో నుంచి వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఒక పాప మృతదేహం లభించగా మరొకరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. చూడ ముచ్చటగా ఉన్న పసి పిల్లలను ప్రాణం తీసిన తండ్రి శ్రీశైలం పై స్థానికులు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆడపిల్లలు అనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్ లో దారుణం...కవల ఆడపిల్లలకు విషమిచ్చి బావిలో పడేసిన కన్నతండ్రీ శ్రీశైలం... దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. కరీంనగర్ జిల్లాలో కన్నతండ్రే కవల పిల్లల పట్ల కాలయముడులా మారాడు. ఆడపిల్లలనే అక్కసుతో భార్యతో గొడవ పడి ఇద్దరు కవల పిల్లలకు విషమిచ్చి బావిలో పడేశాడు.
ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే కచ్చు శ్రీశైలంకు కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి గీతాన్ శ్రీ, గీతాన్విక నామకరణం చేశారు. ఇద్దరు ఆడబిడ్డలేనన్న కారణంతో తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. బంధువులు జోక్యం
చేసుకుని పలుమార్లు సర్దిచెప్పారు. ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారన్న విషయంపై ఈరోజు ఉదయం కూడా భార్యతో గొడవ పడ్డాడు. బిడ్డలు ఇద్దరికీ గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు. ఏమి ఎరగనట్లు స్థానికులతో కలిసి పిల్లల కోసం వెతికి బావిలో నుంచి వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఒక పాప
మృతదేహం లభించగా మరొకరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. చూడ ముచ్చటగా ఉన్న పసి పిల్లలను ప్రాణం తీసిన తండ్రి శ్రీశైలం పై స్థానికులు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆడపిల్లలు అనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.
- కరీంనగర్ జిల్లాలో కన్నతండ్రే కవల పిల్లల పట్ల కాలయముడులా మారాడు. ఆడపిల్లలనే అక్కసుతో భార్యతో గొడవ పడి ఇద్దరు కవల పిల్లలకు విషమిచ్చి బావిలో పడేశాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే కచ్చు శ్రీశైలంకు కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి గీతాన్ శ్రీ, గీతాన్విక నామకరణం చేశారు. ఇద్దరు ఆడబిడ్డలేనన్న కారణంతో తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. బంధువులు జోక్యం చేసుకుని పలుమార్లు సర్దిచెప్పారు. ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారన్న విషయంపై ఈరోజు ఉదయం కూడా భార్యతో గొడవ పడ్డాడు. బిడ్డలు ఇద్దరికీ గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు. ఏమి ఎరగనట్లు స్థానికులతో కలిసి పిల్లల కోసం వెతికి బావిలో నుంచి వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఒక పాప మృతదేహం లభించగా మరొకరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. చూడ ముచ్చటగా ఉన్న పసి పిల్లలను ప్రాణం తీసిన తండ్రి శ్రీశైలం పై స్థానికులు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆడపిల్లలు అనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా1
- హన్మకొండ జిల్లాలో ఓ ఎంఆర్వోపై భార్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ఎంఆర్వో గిరిబాబు ఐదేళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య ఝాన్సీరాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యా పిల్లలను పట్టించుకోకుండా వేరే మహిళతో ఉంటూ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను తీసుకొచ్చి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. గడువు ముగిసిన మందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే వేరు చేసి తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన ఔషధాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాంబశివరావు, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఆసుపత్రి అధికారి డా. కిషన్, డా. ప్రవీణ్ ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్లో శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సర్పంచ్ ప్రవీణ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ కుస్తీలు ప్రేక్షకులను అలరించాయి. గెలుపొందిన విజేతలకు సర్పంచ్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో AMC వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.1
- ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాప్రా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం ఒక వ్యక్తి పేరుకి పరిమితం కాదని, అది ఆయన చేసిన సేవలకు నిలువెత్తు గుర్తింపని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడే రాజకీయాలకు ఇది వేదిక కావొద్దని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.అలాగే, నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లతో సిఆర్ఎంపి నిధులు మంజూరయ్యాయని, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంబంధిత మంత్రితో చర్చించి పనులు ఆమోదింపజేసినట్లు చెప్పారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిస్తూ, అటల్ బిహారీ వాజపేయి వంటి మహానేతల పట్ల తమకు గౌరవం ఉందని, ఆయన పేరును జాతీయ రహదారికి పెట్టాలని సూచించారు. అయితే ఒక్కరే వ్యతిరేకించడం వెనుక ప్రజాహితం లేదని, రాజకీయ లాభాలే ఉన్నాయని ఆరోపించారు.ఇంకా ఘాటుగా స్పందిస్తూ, తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, పార్కుల కబ్జాలు తన రాజకీయాల్లో లేవని విమర్శించారు.దివంగత బండారి రాజిరెడ్డి ప్రజల కోసం జీవించిన నాయకుడని, ఆయన పేరును వ్యతిరేకించడం ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.“అభివృద్ధికి రాజకీయ రంగు వేయొద్దు… ప్రజల భావోద్వేగాలతో ఆటలాడొద్దు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కృషి చేస్తాం” అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.2
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.1