Shuru
Apke Nagar Ki App…
హోలీ సంబరాలు పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్ గీతే రంగులు చల్లుకుంటూ డాన్స్ చేస్తూ సందడి చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
హోలీ సంబరాలు పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్ గీతే రంగులు చల్లుకుంటూ డాన్స్ చేస్తూ సందడి చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.
More news from తెలంగాణ and nearby areas
- సిరిసిల్ల పట్టణంలో స్థానిక 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగ రావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి , మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా : ముంబాజీపేట 21 ఫీట్ల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన' లింగంపేట మండలంలోని ముంబాజిపేట తండా జగదాంబ సేవలాల్ ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 21 అడుగుల ధ్వజస్తంభంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నాడు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మహాహోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- BLR చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన హరీష్ రావు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన బండారి లక్ష్మారెడ్డి1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.4
- వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం,ముత్తోజిపేటలోని హోలీ పండుగకు ముందు రాత్రి మహిళలు సంప్రదాయ కముడు ఆటలను ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ కముడు ఆటలు గ్రామీణ సంస్కృతి, ఐక్యతను చాటుతూ పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. చిన్నారులు, యువతీ యువకులు కూడా వీక్షకులుగా పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు. హోలీ పండుగను కుటుంబ సభ్యులంతా కలసి ఆనందంగా జరుపుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.2
- హోలీ పండుగ పూట జగిత్యాల పోచమ్మవాడ లో విషాదం అలుముకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు ఉదయం గోదావరి పుణ్యస్నానాలకు వెళ్ళి వచ్చే సరికి ప్రణవి ఇంట్లో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కూతురును స్థానికుల సహాయంతో పేరెంట్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం ఇచ్చిన సకాలంలో 108 రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో చేతులపైనే పేషెంట్ ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి ప్రాణాలు కోల్పోయిందని తెలుపడంతో పేరెంట్స్ బోరున విలపించారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదని, కనీసం స్ట్రెచ్చర్ కూడా తీసుకొచ్చి పేషంటును ఆసుపత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణవి ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ పెళ్ళి సంబంధాలు చూసినట్లు పేరెంట్స్ తెలిపారు. ఎలాంటి గొడవలు లేవని పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.1
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సతీమణి భీమేశ్వర స్వామి దర్శించుకున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ సతీమణి వర్ష స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు.1
- కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారులో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సదరు వ్యక్తిని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని, అతడి వివరాలు తెలియరాలేదని SI ఆంజనేయులు తెలిపారు.1