రీ-సర్వే సమస్యల పరిష్కారమే ధ్యేయం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జలుమూరు, ఏప్రిల్ 16: రీ-సర్వే అనంతరం ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి, రైతులకు తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రీ-సర్వే పురోగతి, రికార్డుల నమోదుపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అక్కురాడ పంచాయతీ పరిధిలోని ఐదు రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 924 ఖాతాలు ఉండగా, ఇప్పటివరకు 45 ఖాతాలను మాత్రమే సరిచేసినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది. మిగిలిన ఖాతాల్లో దొర్లిన పొరపాట్లను సరిదిద్దడంలో జాప్యంపై రైతులు తమ విన్నపాలను కలెక్టర్ ముందు ఉంచారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సర్వే లోపాలను సవరించేందుకు మండల స్థాయి అధికారులు, సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి రైతుకూ పారదర్శకంగా, ఎటువంటి అక్షర దోషాలు లేని పాసు పుస్తకాలు అందించే బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఖాతాల్లో మార్పులు అవసరమయ్యాయి. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు, ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారందరికీ సత్వరమే పాసు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. పర్యటనలో ఆయన వెంట తహసిల్దార్ జెన్ని రామారావు తదితరులు ఉన్నారు.
రీ-సర్వే సమస్యల పరిష్కారమే ధ్యేయం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జలుమూరు, ఏప్రిల్ 16: రీ-సర్వే అనంతరం ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి, రైతులకు తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ పరిధిలో
పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రీ-సర్వే పురోగతి, రికార్డుల నమోదుపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అక్కురాడ పంచాయతీ పరిధిలోని ఐదు రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 924 ఖాతాలు ఉండగా, ఇప్పటివరకు 45 ఖాతాలను మాత్రమే సరిచేసినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది. మిగిలిన ఖాతాల్లో దొర్లిన పొరపాట్లను సరిదిద్దడంలో జాప్యంపై రైతులు తమ విన్నపాలను కలెక్టర్
ముందు ఉంచారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సర్వే లోపాలను సవరించేందుకు మండల స్థాయి అధికారులు, సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి రైతుకూ పారదర్శకంగా, ఎటువంటి అక్షర దోషాలు లేని పాసు పుస్తకాలు అందించే బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఖాతాల్లో మార్పులు అవసరమయ్యాయి. వీటిని యుద్ధ
ప్రాతిపదికన పూర్తి చేయాలి. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు, ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారందరికీ సత్వరమే పాసు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. పర్యటనలో ఆయన వెంట తహసిల్దార్ జెన్ని రామారావు తదితరులు ఉన్నారు.
- అరసవల్లి , ఏప్రిల్,20: ఆహార పదార్థాల్లో హానికారక రంగులు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ అనుమతి లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అరసవెల్లి అసిరి తల్లి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ అసిరీతల్లి అమ్మవారి ఉత్సవం సందర్భంగా, ప్రదర్శనశాల ప్రాంతంలో దాని పరిసరాల్లో 11 ఆహార భద్రతా తనిఖీలను చేసినట్లు పేర్కొన్నారు. స్టాళ్లలో ఫాస్ట్ ఫుడ్ (మంచూరియా, నూడుల్స్), ఐస్ క్రీమ్ , మస్కా బన్, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. తనిఖీ సమయంలో కనుగొన్న విషయాలు: షుగర్ క్యాండీని అదనపు ఫుడ్ కలర్స్ ఉపయోగించి తయారు చేశారు.ఆ ఆహార పదార్థాలు సురక్షితం కాదని భావించి,వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.క్యాండీ తయారీకి ఉపయోగించిన రంగు పదార్థాలతో సహా ముడి పదార్థాలను కూడా ధ్వంసం చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులందరికీ అవగాహన కల్పిస్తూ మార్గదర్శకాలను జారీచేశారు. కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించవద్దు: గడువు ముగిసిన లేదా సురక్షితం కాని ఆహార పదార్థాలను అమ్మవద్దు సరైన పరిశుభ్రత ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు. ప్రజారోగ్యం భద్రతను నిర్ధారించడానికి, విక్రేతలందరూ FSSAI నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించడం జరిగింది. . ప్రతిరోజు ఉత్సవాల్లో అమ్మే ఆహార పదార్థాన్ని తనిఖీ చేస్తామని ఎటువంటి నిషేధిత రంగులని, ప్రామాణికము కానీ ఆహార పదార్థాలను గాని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారి కే .లక్ష్మీ పాల్గొన్నారు1
- శ్రీకాకుళం జిల్లాలోనేరేడు బ్యారేజీ మరియు పెండింగ్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదు ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు. అచ్చం నాయుడును సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డిగోవిందరావు ,సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర. వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర .ప్రకాష్ మరియు ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు స్థానిక సిపిఎం కార్యాలయంలో నేరేడు బ్యారేజీకి మరియు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని, కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ తో సహా అన్ని లిఫ్టుల్ని మరమ్మత్తులు చేసి నీరు ఇవ్వాలని కోరుతూ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి.మోహనరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పట్ల పాలకులు చేసిన నిర్లక్ష్యమే జిల్లాకు శాపం గా మారిందని వారు అన్నారు. వంశధార రిజర్వాయర్ కు 200 కోట్లు ఆఫ్షోర్ రిజర్వాయర్ కి 300 కోట్లు వంశధార రిజర్వాయర్ లిఫ్ట్ కోసం 176 కోట్లు, పైడిగాం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే పని పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ప్రజలకు నీరు ఇవ్వకుండా జలదార పేరుతో మోసంచేస్తుందనివిమర్శించారు .రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించకుండా మాయ మాటలు చెబుతుందని విమర్శించారు. నేరేడు బ్యారేజీ నిర్మాణం చేసుకోవచ్చని 2021లో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని వామపక్షాలు ప్రజా సంఘాలు పోరాట ఫలితంగా గజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయిందని నేరెడ్ బ్యారేజీ నిర్మాణం కోసం 1000 కోట్లు అవుతుందని దానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరేడు బ్యారేజీ నిర్మాణం చేసి చివరి భూముల వరకు రెండు పంటలకు నీరు ఇస్తే జిల్లాలో తలసరి ఆదాయము రెట్టింపు అవుతుందని ప్రజల ఆదాయాల పెరిగి అనేక వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయని తద్వారా ఉపాధి దొరుకుతుందని వలసలు నివారించబడతాయని అన్నారు. గొట్టా బ్యారేజీ పూర్తయి 50 సంవత్సరాలు కావస్తుందని దాని మరమ్మత్తుల కోసం 1500 కోట్లు అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు .రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర సంస్థ సింపు నుండి ఎందుకు నిధులు మంజూరు చేయించలేదని వారు ప్రశ్నించారు. గొట్టా బ్యారేజీ కాలువ ఆధునికరణ చేస్తే చివర భూముల వరకు నీరు ఇ వ్వడంతో పాటు మరో 30 వేల ఎకరాలకు అదనంగా నీరు ఇవ్వొచ్చని అన్నారు. మన జిల్లాలో నదులు, వాగులు ద్వారా నీరు పుష్కలంగా ఉందనిదానినివినియోగించుకోకాపోవడంతో వృధాగా సముద్రంలో కలుస్తుందనిదాన్నివినియోగించడానికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా జల దార పేరుతో ఇంకుడు గోతులు తవ్వండని ప్రసారం చేయడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 2009లో షర్టుల కుంభకోణం జరిగిన తర్వాత నేటికీ షర్టులు బిగించకపోవడంతో కాలువలో నీరు వెళ్లకుండా వృధాగా పోతుందని షట్టర్ ఎప్పుడు లోగా బిగిస్తారు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడిని ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. కొండపేట లిఫ్ట్ తో సహా జిల్లాలో అన్ని లిఫ్టులు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు . అచ్చంనాయుడు గారు కోటబొమ్మాలి మండలంలో కొండ పేట లిఫ్ట్ మరమ్మత్తులు చేస్తామని రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చలేదని వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించక పోతే ఈ ఏడాది కూడా 22 గ్రామాల ప్రజలు తీవ్రమైన అన్యాయానికి గురవుతారని అన్నారు. నారాయణపురం కాలువ మరమ్మతు చేయకపోవడం చివరి భూముల వరకు నీరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికి నేరేడు బ్యారేజ్ కి 1000 కోట్లు, ఆఫ్షోర్ కి 300 కోట్లు, వంశధార రిజర్వాయర్ మరియు లిఫ్ట్ 500 కోట్లు, గొట్టా బ్యారేజ్ ఆధునికరణకు 1500 కోట్లు, పలాస నుండి ఇచ్చాపురం వరకు నీరు ఇవ్వడం కోసం 500 కోట్లు, సుమారు 3000 కోట్ల కేటాయిస్తే జిల్లా సస్యశ్యామలమవుతుందని కానీ రాష్ట్ర ప్రభుత్వం పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ జిల్లా వెనుకబాటుకి గురవుతుందని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకి నిధులు కేటాయించాలని కోరుతూ దశ లు వారి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.1
- **“Wish you a blessed Akshaya Tritiya ✨ May prosperity and positivity fill your life. Choose comfort that stays with you every day. MGM Vests – Wear Prosperity.”**1
- విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...4
- డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. ఈ వర్షంతో గ్రామంలోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో స్థానికులకు ఉపశమనం కలిగింది.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by Sageni gangadhar1
- శ్రీకాకుళం జిల్లాఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస లో గల ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల పెంపు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన విద్యా విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ స్వయంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామం లో ప్రధాన వీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నత విద్య, ఉన్నత ప్రమాణాలు అనే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పలు సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఆధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత బోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం ,నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయని వివరించారు.4