Shuru
Apke Nagar Ki App…
డుంబ్రిగూడ మండల కేంద్రంలో పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. ఈ వర్షంతో గ్రామంలోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో స్థానికులకు ఉపశమనం కలిగింది.
Nava surya
డుంబ్రిగూడ మండల కేంద్రంలో పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. ఈ వర్షంతో గ్రామంలోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో స్థానికులకు ఉపశమనం కలిగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. ఈ వర్షంతో గ్రామంలోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో స్థానికులకు ఉపశమనం కలిగింది.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by Sageni gangadhar1
- **“Wish you a blessed Akshaya Tritiya ✨ May prosperity and positivity fill your life. Choose comfort that stays with you every day. MGM Vests – Wear Prosperity.”**1
- విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...4
- అరసవల్లి , ఏప్రిల్,20: ఆహార పదార్థాల్లో హానికారక రంగులు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ అనుమతి లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అరసవెల్లి అసిరి తల్లి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ అసిరీతల్లి అమ్మవారి ఉత్సవం సందర్భంగా, ప్రదర్శనశాల ప్రాంతంలో దాని పరిసరాల్లో 11 ఆహార భద్రతా తనిఖీలను చేసినట్లు పేర్కొన్నారు. స్టాళ్లలో ఫాస్ట్ ఫుడ్ (మంచూరియా, నూడుల్స్), ఐస్ క్రీమ్ , మస్కా బన్, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. తనిఖీ సమయంలో కనుగొన్న విషయాలు: షుగర్ క్యాండీని అదనపు ఫుడ్ కలర్స్ ఉపయోగించి తయారు చేశారు.ఆ ఆహార పదార్థాలు సురక్షితం కాదని భావించి,వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.క్యాండీ తయారీకి ఉపయోగించిన రంగు పదార్థాలతో సహా ముడి పదార్థాలను కూడా ధ్వంసం చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులందరికీ అవగాహన కల్పిస్తూ మార్గదర్శకాలను జారీచేశారు. కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించవద్దు: గడువు ముగిసిన లేదా సురక్షితం కాని ఆహార పదార్థాలను అమ్మవద్దు సరైన పరిశుభ్రత ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు. ప్రజారోగ్యం భద్రతను నిర్ధారించడానికి, విక్రేతలందరూ FSSAI నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించడం జరిగింది. . ప్రతిరోజు ఉత్సవాల్లో అమ్మే ఆహార పదార్థాన్ని తనిఖీ చేస్తామని ఎటువంటి నిషేధిత రంగులని, ప్రామాణికము కానీ ఆహార పదార్థాలను గాని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారి కే .లక్ష్మీ పాల్గొన్నారు1
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- డుంబ్రిగూడ, ఏప్రిల్ 21: మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలకు వెళ్లే రహదారిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ మార్గంలో విద్యార్థులు, స్థానికులు నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చేతికందే స్థాయిలో తీగలు ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.1