కంతనపల్లికి శాశ్వత రహదారి నిర్మించాలి.దశాబ్దాలుగా కొనసాగుతున్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలి. కంతనపల్లికి శాశ్వత రహదారి నిర్మించాలి -దశాబ్దాలుగా కొనసాగుతున్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలి: ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్ కన్నాయిగూడెం ఆగస్టు 26: స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా కన్నాయిగూడెం మండలంలోని కంతనపల్లి గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి మొత్తం గుంతలు, బురద, వర్షపు నీటితో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. గ్రామ ప్రజలు నిత్యావసరాల కోసం, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, రైతులు పంటలను మార్కెట్లకు తరలించేందుకు ఈ రహదారిపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. రహదారి అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించేందుకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. కంతనపల్లి గ్రామ రహదారి సమస్యను ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పరిశీలించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. తాత్కాలికంగా గుంతలు పూడ్చడం కాకుండా శాశ్వత పరిష్కారంగా నాణ్యమైన రహదారిని నిర్మించాలని కోరారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారి నిర్మాణానికి అత్యవసర ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
కంతనపల్లికి శాశ్వత రహదారి నిర్మించాలి.దశాబ్దాలుగా కొనసాగుతున్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలి. కంతనపల్లికి శాశ్వత రహదారి నిర్మించాలి -దశాబ్దాలుగా కొనసాగుతున్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలి: ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్ కన్నాయిగూడెం ఆగస్టు 26: స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా కన్నాయిగూడెం మండలంలోని కంతనపల్లి గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి మొత్తం గుంతలు, బురద, వర్షపు నీటితో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. గ్రామ ప్రజలు నిత్యావసరాల కోసం, విద్యార్థులు పాఠశాలలు,
కళాశాలలకు వెళ్లేందుకు, రైతులు పంటలను మార్కెట్లకు తరలించేందుకు ఈ రహదారిపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. రహదారి అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించేందుకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. కంతనపల్లి గ్రామ రహదారి సమస్యను ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పరిశీలించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. తాత్కాలికంగా గుంతలు పూడ్చడం కాకుండా శాశ్వత పరిష్కారంగా నాణ్యమైన రహదారిని నిర్మించాలని కోరారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారి నిర్మాణానికి అత్యవసర ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
- రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.. ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా హనుమకొండ: నగరంలోని బాలసముద్రం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, వివిధ కేసుల్లో జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం, భిన్నాభిప్రాయాలను అణచివేసే చర్యలను నిలిపివేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆగస్టు 29న జరిగే మహా ధర్నాలో ప్రజాసంఘాలు, విద్యార్థి, కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజకీయ ఖైదీల విడుదలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐక్య వేదిక నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు..సీఎం రేవంత్ ను కోరిన బాలుడు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు కొత్త బస్సులు ఇస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యలను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు కోరారు.1
- జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.1
- సారపాకలో లారీ ఢీ.. ట్రాక్టర్ డ్రైవర్‌కు త్రివ గాయాలు... సారపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్ గేట్ వద్ద లారీ, ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నూతన బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రిడ్జి ఎంట్రన్స్ వద్ద మట్టి, ఇసుక పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో వాహనాలు స్కిడ్ అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే మట్టి, ఇసుకను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మార్గాన్ని సిద్ధం చేయాలని కోరుతున్నారు.3
- స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు..ఒకే చోట పెన్షన్ ఇవ్వాలని లబ్ధిదారుల విజ్ఞప్తి జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా పెన్షన్ ఎక్కడ పంపిణీ చేస్తారో స్పష్టత లేక లబ్ధిదారులు పలుచోట్లకు తిరుగుతూ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ కోసం రావడమే కష్టంగా ఉన్న తమను ఇలా తిప్పడం ఇబ్బందిగా ఉందని, ఒకే చోట పెన్షన్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- కురవి మండలం నేరెడ శివారులో అనుమానాస్పదంగా ఉరివేసుకొని రైతు మృతి.. అనుమానాస్పదంగా రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులో చోటు చేసుకుంది.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నేరెడ గ్రామానికి చెందిన మొగిలి రామ చంద్రయ్య (65) కి తన పొలం పక్కన మరో రైతు తో పొలం బాట విషయం లో పంచాయితీ జరుగుతుంది.. ఈ నేపథ్యంలో లో ఈ తెల్లవారు జామున రామ చంద్రయ్య తన పొలం వద్ద చెట్టుకు ఊరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యానా.. ఆత్మహత్య నా అనే కోణం లో దర్యాప్తు ప్రారంభించారు3
- సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట కోదాడ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట వద్ద బుధవారం ఉదయం కంటైనర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అయితే మృతులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు యాసారపు చిన్ని(32), బొల్లిపొంగు మేరీ జోష్న(29), చెన్నకేశవుల నాగేంద్రబాబు(21)గా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.1
- హైదరాబాద్- విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి తెలంగాణ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1
- ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్) ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు బ్రేకింగ్ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్).. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.1