ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి. -యూటీఎఫ్ డిమాండ్. ధర్మవరం ఆగస్టు 25, విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1) ను సవరించి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలు రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెట్ రద్దుపై యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన దశల వారీ పోరాటాల్లో భాగంగా ధర్మవరం పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నందు యూటీఎఫ్ ధర్మవరం డివిజన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యు టీ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.... అనేక సంవత్సరాల పాటు విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ వారిని ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దుతున్న ఉపాధ్యాయులను టెట్ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తూ వారి యొక్క బోధనపై ప్రభావం చూపేలా చేయడం సరికాదని తెలిపారు. అందువల్ల విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1) ని సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలను రద్దుచేసే విధంగా తమిళనాడు ప్రభుత్వం చేసిన విధంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయాలని అనుకుంటే ప్రభుత్వం నిన్న విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ లో ఉపాధ్యాయులందరికీ పాస్ మార్కులు 40 శాతము కి తగ్గింపు చేయాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టు వారిగా పరీక్షలు నిర్వహించే విధంగా సిలబస్ లో మార్పు చేయాలని, అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకొని టెట్ పరీక్షను ఆన్లైన్లో కాకుండా ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్నారాయణ రెడ్డి, ధర్మవరం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జింకా హరికృష్ణ, హెచ్ రామాంజనేయులు, సీనియర్ నాయకులు ఆంజనేయులు, రాంప్రసాద్, వెంకట కిషోర్, రఫీ అహమ్మద్, రవి శేఖర్, సాయి గణేష్, నాగిరెడ్డి, రామకృష్ణ, పెద్దకోట్ల సురేష్, వెంకట సురేష్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

- రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆటో డ్రైవర్‌కు హెచ్చరిక ఆలూరు, ఆగస్టు 25: విద్యార్థుల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి సూచించారు. ఆదోని నుంచి ఆలూరు వైపు వెళ్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులను పరిమితికి మించి ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు. విద్యార్థులు ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితిని చూసిన వైకుంఠం జ్యోతి వెంటనే ఆటోను ఆపించి డ్రైవర్‌తో మాట్లాడారు. చిన్నారులను ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణింపజేయడం సరికాదని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆమె డ్రైవర్‌కు వివరించారు. ఇకపై ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటో డ్రైవర్‌ను ఆమె హెచ్చరించారు. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే వాహనాల విషయంలో డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులను తరలించే వాహనాల్లో అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించకుండా, వాహన సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యార్థుల రవాణా విషయంలో సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని, అందువల్ల విద్యార్థుల రవాణాలో భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలని వైకుంఠం జ్యోతి సూచించారు. “విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఇలాంటి పరిస్థితులు మరోసారి కనిపించకుండా డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆమె స్పష్టం చేశారు.2
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు......... ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1