logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భూపాలపల్లి సింగరేణి పాఠశాలలో విద్యార్థి వివాదం..పాఠశాల వద్ద తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ నిరసన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ మాల ధరించిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి రాకుండా హెడ్‌మాస్టర్ ఝాన్సీ రాణి అడ్డుకున్నట్లు సమాచారం. మాల తీసివేసి పాఠశాలకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా హెడ్‌మాస్టర్ దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు. హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

భూపాలపల్లి సింగరేణి పాఠశాలలో విద్యార్థి వివాదం..పాఠశాల వద్ద తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ నిరసన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ మాల ధరించిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి రాకుండా హెడ్‌మాస్టర్ ఝాన్సీ రాణి అడ్డుకున్నట్లు సమాచారం. మాల తీసివేసి పాఠశాలకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా హెడ్‌మాస్టర్ దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు. హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా లో: ఎన్ఐటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆటో, హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుపోగా, ఎడమ కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి 30 నిమిషాల్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
    1
    వరంగల్ జిల్లా లో: ఎన్ఐటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆటో, హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుపోగా, ఎడమ కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి 30 నిమిషాల్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు.
రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    32 min ago
  • ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
    4
    ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
    user_Meenakshi construction Civil c
    Meenakshi construction Civil c
    లింగాలఘన్‌పూర్, జనగాం, తెలంగాణ•
    19 hrs ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్ధురాలు కోన లక్ష్మి(72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ లో నివాసం ఉండే లక్ష్మీ గొంతులో కత్తి ఘాట్లు ఉండడంతో హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. గతంలో వృధ్ధురాలిపై దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చి చూసేసరికి, రక్తం మడుగులో పడిఉన్న తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్ధురాలు కోన లక్ష్మి(72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ లో నివాసం ఉండే లక్ష్మీ  గొంతులో కత్తి ఘాట్లు ఉండడంతో హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. గతంలో వృధ్ధురాలిపై దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చి చూసేసరికి, రక్తం మడుగులో పడిఉన్న తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గం:-
ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    20 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ మాల ధరించిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి రాకుండా హెడ్‌మాస్టర్ ఝాన్సీ రాణి అడ్డుకున్నట్లు సమాచారం. మాల తీసివేసి పాఠశాలకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా హెడ్‌మాస్టర్ దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు. హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది.
హనుమాన్ మాల ధరించిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి రాకుండా హెడ్‌మాస్టర్ ఝాన్సీ రాణి అడ్డుకున్నట్లు సమాచారం. మాల తీసివేసి పాఠశాలకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా హెడ్‌మాస్టర్ దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు.
హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.