*International Fleet Review &Milan -2026 "అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో "ఎంపీ కలిశెట్టి* రామకృష్ణ బీచ్, విశాఖపట్నం, తేది. 19.02.2026. ⭐ విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు గౌరవ అతిథిగా ఈరోజు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ& మిలాన్-2006 నౌకదళ విన్యాసాలలో పాల్గొన్నారు. ⭐ గౌరవ ఎంపీ గారు IFR గురించి మాట్లాడుతూ గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు విశాఖపట్నం రెండోసారి వేదిక కావడం, నిన్న గౌరవనీయులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 70కి పైగా స్వదేశీ, విదేశీ యుద్దానౌకలను సమీక్షించడం మన దేశానికీ,రాష్ట్రానికి గర్వకారణం అని హర్షాన్ని వ్యక్తపరుస్తూ.......... ⭐ సుమారు 50కి పైగా దేశాల నౌకదళాలు పాల్గొన్న ఈ IFR-2026లో రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే వేదిక కావడం, అలాగే విదేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక బలోపేతం చేస్తూ సముద్ర భద్రత, విపత్తుల నిర్వహణపై ఉమ్మడి వ్యూహాలను రూపొందించే బహుళ- దేశ నౌకాదళ విన్యాసాలకు వేదిక మన విశాఖపట్నం కావటం అభినందనీయమని, ఈ కార్యక్రమం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క "మహాసాగర్" విజన్ ను సాకారం చేస్తుందని, ముఖ్యంగా "మేక్ ఇన్ ఇండియా " సామర్థ్యన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేడుకకు హాజరవ్వటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ & నౌకాదళ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపిన విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు.

- దేవుడి నైవేద్యంతో ‘ధన’ రాజకీయం చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ నిప్పులు, ఉదయ అక్షరం, పిబ్రవరి -19:తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరమైన అపచారానికి పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, బడ్జెట్‌లోని డొల్లతనాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు.గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని బొత్స విమర్శించారు. "సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరుగుతున్న వేళ, చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఇప్పటికే తేలిపోయింది. తన రాజకీయ ఉనికి కోసం దేవుడి నైవేద్యాన్ని కూడా అపవిత్రం చేయడానికి ఆయన వెనుకాడటం లేదు" అని మండిపడ్డారు.చంద్రబాబు తన ‘ధనదాహం’ కోసం ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తున్నారో బొత్స సత్యనారాయణ సంచలన గణాంకాలతో వివరించారు. గతంలో కిలో రూ. 320 కే లభించిన నాణ్యమైన నెయ్యిని పక్కన పెట్టి.. ఇప్పుడు చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ తో సంబంధాలున్న ‘ఇందాపూర్ డెయిరీ’ ద్వారా కిలో రూ. 700 కు సరఫరా చేయిస్తున్నారని ఆరోపించారు. ధరను అకస్మాత్తుగా రెట్టింపు చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో, ఆ కమిషన్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "భక్తి ముసుగులో అవినీతి వ్యాపారం చేస్తున్నారు. రూ. 320 నుంచి రూ. 700 కు ధర పెరగడం వెనుక ఉన్న ‘సీక్రెట్’పై బహిరంగ చర్చకు సిద్ధమా?" అని కూటమి నేతలకు బొత్స సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. సభలో వాస్తవాలు మాట్లాడితే ప్రభుత్వం బట్టబయలవుతుందనే భయంతోనే చర్చ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఇప్పుడు బడ్జెట్‌లో కోతలు విధిస్తూ మోసం చేస్తున్నారని, దమ్ముంటే పూర్తిస్థాయి చర్చకు రావాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.1
- ఆముదాలవలస ఫిబ్రవరి 19: గ్రామీణ స్థాయిలో ప్రతి పౌరుడికి తన హక్కులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వారిని సాధికారత దిశగా నడిపించడమే న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. గాజులకొల్లవలసలో గ్రామ స్థాయిలో పౌరుల సాధికారతపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హత ఉన్న ఏ ఒక్క వ్యక్తికీ సంక్షేమ పథకాలు అందకుండా పోకూడదని, నిరాకరించబడిన సందర్భాల్లో తక్షణమే సంబంధిత శాఖలతో సంప్రదించి వారికి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు రేషన్ కార్డు, ఆధార్, సదరం వంటి కీలక పత్రాలు పొందేందుకు సామాన్యులకు అవసరమైన సహాయం అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని హరిబాబు ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ శాఖల ప్రయోజనాలను ప్రజల ముంగిటకే చేర్చడంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎఫ్‌ఐ-ఎల్డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీరామ్ శ్రీనివాసరావు, జిల్లా రిసోర్స్ పర్సన్ బి. రామ్ ప్రసాద్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ శైలజ, న్యాయవాది జి. ఇందిరా ప్రసాద్, ఇతర అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.1
- మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగివేమన జయంతి ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం గారు యోగివేమన చిత్రపటానికి పుష్పమాలను తో అలంకరించారు. సంస్కృత పండితులు బౌరోతు శంకర రావు మాట్లాడుతూ 17వ శతాబ్దానికి చెందిన యోగివేమన చెప్పిన పద్యాలు అక్షర సత్యాలు. విశ్వ మానవాళికి వేమన చెప్పిన పద్యాలు వేదాలతో సమానము. వాడుకు భాషలో అందరి కి అర్థమయ్యే రీతిలో పద్యాలు చెప్పారు. వేమన శతకంలో కొన్ని పద్యాలు మాత్రమే మనకు ఎరుక . వేమన స్ఫూర్తితో శంకర శతకాన్ని రచించానని 2025 జూన్ నెల నుండి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు శంకర శతక పద్యాలు ప్రార్థనలో రోజుకు ఒక పద్యాన్ని విద్యార్థులతో చదివించ దానికి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు ఉపాధ్యాయులు వేమన గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు1
- దేవీపట్నం మండలంలో ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి పరిశీలించారు. గురువారం దామనపల్లి ఆశ్రమ స్కూల్, శరభవరం గిరిజన సంక్షేమ పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధుతులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు. పాఠశాల రిజిస్టర్‌లు పరిశీలించారు.1
- Post by Shyam1
- ఫిబ్రవరి 19 టెక్కలి నియోజకవర్గం లో సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణ సమితి టెక్కలి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఛత్రపతి శివాజీ చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. టెక్కలి పురవీధుల్లో మేళతాళాలతో శోభాయాత్రని నిర్వహించారు. సనాతన ధర్మము హిందూ ధర్మము సాంప్రదాయ పరిరక్షణను కాపాడాలంటూ టెక్కలి విశ్వహిందూ పరిషత్తు సాంప్రదాయ సనాతన ధర్మ హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు సందర్భంగా చత్రపతి శివాజీ ఛత్రపతి ఊరేగిస్తూ చత్రపతి శివాజీ భారతదేశంలో హిందూ ధర్మానికి స్థాపనకు చేసిన కృషిని కొనియాడారు ఈ ఊరేగింపు టెక్కలి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రారంభమై ఇందిరాగాంధీ కూడలి అంబేద్కర్ జంక్షన్ వరకు కూడా ఈ శోభాయాత్ర జరిగింది.3
- 🙏🙏1
- ఖాదర్ షా దర్బార్ లో.. రంజాన్ తొలి ఇఫ్తార్ విందు.. విజయనగరం: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం బాబామెట్ట హజరత్ ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ లో ముతవల్లి డాక్టర్ ముహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ(ఖలీల్ బాబు) ఆధ్వర్యంలో తొలి ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ప్రేమ, త్యాగం, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక, మానవత్వానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ పర్వదినాలను గురువారం నుంచి ముప్పై రోజుల పాటు ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠోరమైన ఉపవాస దీక్షలను ఆచరించడం రంజాన్ లో గల ఆధ్యాత్మిక విశిష్టత. సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్షను వీడిన దీక్షాదారులకు పోషక విలువలతో కూడని పసందైన ఆహారంతో ఇఫ్తార్ విందు ను ఖలీల్ బాబు అందిస్తూ వస్తున్నారు. ప్రతీ ఏటా ఖాదర్ బాబా దర్గార్ షరీఫ్ లో జరిగే ఈ ఇఫ్తార్ విందులో అధిక సంఖ్యలో ఉపవాస దీక్షకులు పాల్గొని ఇఫ్తార్ ను స్వీకరిస్తూ ఉంటారు.1