Shuru
Apke Nagar Ki App…
హుకుంపేట మండలం బురుగుపుట్టు నుంచి సంతరి వెళ్లే సీసీ రోడ్డు వంపు వద్ద తీవ్రంగా దెబ్బతిని మృత్యుపాశంగా మారింది. రోడ్డుపై వెలిసిన పెద్ద పెద్ద గుంతల వల్ల వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షం పడినప్పుడు ఈ మార్గంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టి, ప్రయాణికుల భద్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Shyam
హుకుంపేట మండలం బురుగుపుట్టు నుంచి సంతరి వెళ్లే సీసీ రోడ్డు వంపు వద్ద తీవ్రంగా దెబ్బతిని మృత్యుపాశంగా మారింది. రోడ్డుపై వెలిసిన పెద్ద పెద్ద గుంతల వల్ల వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షం పడినప్పుడు ఈ మార్గంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టి, ప్రయాణికుల భద్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఎక్కడపడితే అక్కడ పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మూగజీవులకు ప్రమాదంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్ధాలు పశువులు తినడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ తినడం వల్ల పశువుల జీర్ణకోశానికి హానికలుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- ఈ వీడియోలో భారతీయ పర్యావరణ కార్యకర్త, పండితురాలు డాక్టర్ వందన శివ, బిల్ గేట్స్ దాతృత్వ కార్యక్రమాలను తీవ్రంగా విమర్శించారు. ఆమె వాదన ప్రకారం, గేట్స్ ఇచ్చే విరాళాలు కేవలం సహాయం కోసం మాత్రమే కాకుండా, కీలక రంగాలపై నియంత్రణ సాధించడానికి చేసే ప్రయత్నం. బిల్ గేట్స్ కొద్దిపాటి నిధులు ఇచ్చి అంతర్జాతీయ విత్తన బ్యాంకులైన CGIAR మరియు ICRISAT వ్యవస్థలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారని ఆమె ఆరోపించారు. జన్యు సవరణ (Gene editing), డిజిటల్ సీక్వెన్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విత్తనాలపై పేటెంట్ హక్కులు సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 'నెట్ జీరో' అనే పదం ఒక కుట్ర అని, ఇది కాలుష్యాన్ని తగ్గించడానికి కాకుండా, ఇతర దేశాల భూములను ఆక్రమించి కార్బన్ ఆఫ్‌సెట్స్ (Carbon offsets) కోసం వాడుకోవడమేనని ఆమె విమర్శించారు. అమెరికాలో అత్యధిక వ్యవసాయ భూమిని కలిగి ఉన్న వ్యక్తిగా బిల్ గేట్స్, ఇప్పుడు పర్యావరణం పేరుతో ప్రపంచవ్యాప్తంగా భూములను తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని (Land Grab) ఆమె అన్నారు. డాక్టర్ వందన శివ ఎవరు? ఆమె విత్తన స్వేచ్ఛ, సేంద్రియ వ్యవసాయం మరియు రైతుల హక్కుల కోసం పోరాడే ప్రముఖ పర్యావరణ కార్యకర్త. బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యాన్ని ఆమె ఎప్పుడూ వ్యతిరేకిస్తూ ఉంటారు.1
- 🙏🙏1
- అముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అనుకూలంగా ఉందని తెలిపారు. అముదాలవలస నియోజకవర్గానికి తాగునీరు, రహదారులు, విద్య, వ్యవసాయ రంగాలకు నిధులు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. ప్రజల ఆశయాల సాధనకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు.1
- టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయం విగ్రహాల పునప్రతిష్ట కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజ అలంకరణ సహస్ర కుంకుమార్చన మహా హోమాలు చండీ హోమాలు పూర్ణ హుతినిర్వహించారు. భక్తుల్లో అమ్మవారందరినీ ప్రత్యేకంగా దర్శించుకున్నారు అనంతరం మహానసమారాధన కార్యక్రమం నిర్వహించారు.3
- నల్లజర్ల మండలం పోతవరంలో పొగాకు పనుల కోసం నందిగామ నుంచి వలస వచ్చిన ఎస్సీ కూలీల తాత్కాలిక పాకలను స్థానికుడు కరుటూరి సత్యనారాయణ, అతని కుమారుడు ధ్వంసం చేశారని కూలీలు వాపోయారు. వారి సామాగ్రిని, ఆహారాన్ని చిందరవందర చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కూలీల ఆవాసాలను పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.1
- Post by Shyam1
- దేవీపట్నం మండలంలో గ్రామాల మధ్యలో ఉన్న రోడ్ల పైకి గోదావరి నీరు రావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. దండంగి గ్రామం నుండి రావిలంక గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డు పైకి గోదావరి నీరు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీని వల్ల ఇటువైపు గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు గేట్లు మూసి వేయడం వల్ల బ్యాక్ వాటర్ పెరిగి రోడ్ల పైకి నీరు చేరింది. ప్రస్తుతం ప్రజలు రవాణాకు ఇబ్బందులు పడుతున్నారు.1
- ప్రేమ, పెళ్ళి పేరుతో బాలికను తీసుకొనిపోయి మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 🎯 *బాలికను మోసం చేసిన నిందితుడికి శిక్ష విధింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ * 🎯 *నిందితుడికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ* 🎯 *బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషనులో 2024 సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/-లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని ఫిబ్రవరి 18న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. భోగాపురం మండలం, ముంజేరు గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కుమార్తె (మైనరు బాలిక) కనపడటం లేదని తేది.22.05.2024న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భోగాపురం ఎస్ఐ పి.సూర్యకుమారి గర్ల్ మిస్సింగ్ క్రింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ బాలికను కనిపెట్టి తన నుండి స్టేట్మెంట్ నమోదుచేసిన భోగాపురం పోలీసులు. భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖపట్నం మరియు హైదరాబాదు తిప్పి శారీరకంగా అనుభవించాడని తెలిపింది. ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తే.25.07.2024దిన పోక్సో సెక్షన్స్ క్రింద కేసును ఆల్టర్ చేశారన్నారు. అనంతరం విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. నిందితుడు రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.5,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ పి.సూర్యకుమారి, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు వి.సత్యనారాయణ, ఎపిపి జి.సత్యంలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. గడిచిన 6నెలల కాలంలో 17 పోక్సో కేసులలో నిందితులకు కఠిన కారాగార శిక్ష పడిందని, జిల్లా ఎస్పీ తెలిపారు. మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,1