Shuru
Apke Nagar Ki App…
రోడ్డుపైకి నీరు రావడంతో రాకపోకలు బంద్ దేవీపట్నం మండలంలో గ్రామాల మధ్యలో ఉన్న రోడ్ల పైకి గోదావరి నీరు రావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. దండంగి గ్రామం నుండి రావిలంక గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డు పైకి గోదావరి నీరు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీని వల్ల ఇటువైపు గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు గేట్లు మూసి వేయడం వల్ల బ్యాక్ వాటర్ పెరిగి రోడ్ల పైకి నీరు చేరింది. ప్రస్తుతం ప్రజలు రవాణాకు ఇబ్బందులు పడుతున్నారు.
Nava surya
రోడ్డుపైకి నీరు రావడంతో రాకపోకలు బంద్ దేవీపట్నం మండలంలో గ్రామాల మధ్యలో ఉన్న రోడ్ల పైకి గోదావరి నీరు రావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. దండంగి గ్రామం నుండి రావిలంక గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డు పైకి గోదావరి నీరు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీని వల్ల ఇటువైపు గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు గేట్లు మూసి వేయడం వల్ల బ్యాక్ వాటర్ పెరిగి రోడ్ల పైకి నీరు చేరింది. ప్రస్తుతం ప్రజలు రవాణాకు ఇబ్బందులు పడుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఎక్కడపడితే అక్కడ పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మూగజీవులకు ప్రమాదంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్ధాలు పశువులు తినడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ తినడం వల్ల పశువుల జీర్ణకోశానికి హానికలుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- Post by Shyam1
- గుంప సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సిపిఎం డిమాండ్ కొమరాడ (ఫిబ్రవరి 19): పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన, నాగావళి మరియు జంజావతి నదుల సంగమ క్షేత్రమైన గుంప సోమేశ్వర స్వామి ఆలయాన్ని తక్షణమే పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. గురువారం కొమరాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, ఆలయ దుస్థితిపై అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ద్వారా మంజూరైన ₹1.25 కోట్ల నిధులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. 2024 జూలైలో ఎమ్మెల్యే రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ, నేటికీ ఆ పనులు అసంపూర్తిగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై మెటల్ రాళ్లు వేసి రెండేళ్లు కావస్తున్నా పూర్తి చేయకపోవడంతో, మండుటెండల్లో భక్తులు ఆ రాళ్లపై నడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీసం మహాశివరాత్రి వంటి పండుగ రోజుల్లో కూడా ఆలయ ప్రాంగణంలో బురదను తొలగించలేని స్థితిలో దేవాదాయ శాఖ ఉందని విమర్శించారు. ఆలయానికి సంబంధించిన భూముల వివరాలను, వాటి ద్వారా వస్తున్న ఆదాయాన్ని అధికారులు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కేవలం కానుకలు వసూలు చేయడమే తప్ప, అభివృద్ధిపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. ఈ ఆలయానికి సమీపంలోనే ఒరిస్సాలోని మజ్జి గౌరమ్మ ఆలయం ఉండటం, అలాగే రెండు నదుల కలయిక, కోటిపాము రైల్వే బ్రిడ్జి వంటి ఆహ్లాదకర వాతావరణం ఉన్నందున, దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే జిల్లాకు మంచి గుర్తింపుతో పాటు ఆదాయం కూడా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్న తరుణంలో, ఈ పురాతన ఆలయంపై కూడా దృష్టి సారించాలని కోరారు. తక్షణమే నిధులు విడుదల చేసి, రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శివుని నాయుడు, సత్యం తదితరులు పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు, ఆసుపత్రులన్నీ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి మరియు ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి ఆసుపత్రి వ్యర్ధాల నిర్వహణా కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ప్రజారోగ్యానికి భంగం కలగకుండా వీటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్ణీత సమయంలోగా తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిలో రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులను ఉపయోగించి ఇంజక్షన్ సూదులు, పత్తి, గ్లౌవ్స్, శరీర వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న సుమారు 496 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పశుసంవర్ధక ఆసుపత్రుల నుంచి కూడా క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరగాలని ఆదేశించారు. సేకరించిన వ్యర్థాలను 48 గంటల గడువులోగా తరలించాలని, ఎక్కడా బయట కనిపించకూడదని స్పష్టం చేశారు. అంతేకాక, ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్ తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వివరాలను 'బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యాప్'లో ప్రతిరోజూ తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే నోటీసులు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటి నుంచీ బయో మెడికల్ వ్యర్ధాలను సైతం సేకరించి, సరైన పద్దతిలో వాటిని తరలించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అలాగే వ్యర్ధాలను బయట పడేసే ఆసుపత్రులపై నిఘా పెట్టాలని కోరారు.1
- నరసన్నపేట: నరసన్నపేట పట్టణంలో గురువారం సాయంత్రం విదేశీ యువకులతో హరినామ సంకీర్తన కార్యక్రమం జరగనుంది. అమెరికాలో ఉంటూ క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి మారిన యువకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కళ్యాణ మండపంలో భగవద్గీత ప్రసంగం కూడా ఉంటుందని కూర్మ గ్రామ ప్రబోధకుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.1
- ఫిబ్రవరి 19 సంతబొమ్మాళి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శిరిడి సాయి ఆలయంలో గురువారం నాడు భక్తులు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. వేకువజామున కాగలహారతి నిర్వహించారు. అనంతరం విశేష పూజలు అలంకారాలు నిర్వహించి వచ్చిన భక్తులందరూ కూడా ప్రత్యేక సాయి వ్రతాలు నిర్వహించుకున్నారు.2
- 🙏🙏1
- దేవీపట్నం మండలంలో గ్రామాల మధ్యలో ఉన్న రోడ్ల పైకి గోదావరి నీరు రావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. దండంగి గ్రామం నుండి రావిలంక గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డు పైకి గోదావరి నీరు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీని వల్ల ఇటువైపు గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు గేట్లు మూసి వేయడం వల్ల బ్యాక్ వాటర్ పెరిగి రోడ్ల పైకి నీరు చేరింది. ప్రస్తుతం ప్రజలు రవాణాకు ఇబ్బందులు పడుతున్నారు.1