logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు .. మెట్‌పల్లి ఏప్రిల్ 14 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని మెట్‌పల్లి డిపోలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు, సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపరింటెండెంట్ టి. ప్రమీల గారు, మెకానిక్ సూపర్వైజర్ ఎ. చంద్రయ్య గారు, ఎం.డి. ముజీబ్ ఖాన్ గారు (ఆర్‌హెచ్‌సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు,డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

4 hrs ago
user_Mahammad Vaseem
Mahammad Vaseem
మెట్‌పల్లి, జగిత్యాల, తెలంగాణ•
4 hrs ago
22a6c090-e651-4370-98c8-74c0b23b84a8

డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు .. మెట్‌పల్లి ఏప్రిల్ 14 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని మెట్‌పల్లి డిపోలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు, సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపరింటెండెంట్ టి. ప్రమీల గారు, మెకానిక్ సూపర్వైజర్ ఎ. చంద్రయ్య గారు, ఎం.డి. ముజీబ్ ఖాన్ గారు (ఆర్‌హెచ్‌సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు,డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    1
    జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్
    1
    షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు
    1
    పత్రిక ప్రకటన 
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా, మంగళవారం
ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు  హెల్మెట్లు అందజేశారు. 
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • *పత్రిక ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 14 :- *పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర రాజకీయ ప్రముఖులు అధికారులు.* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నందు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ జయంతి వేడుకలలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం చేశారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి పరణాళికలో భాగంగా "అరైవ్ ఆలైవ్" లో భాగంగా వారం రోజులపాటు జరిగే కార్యక్రమాలలో మంగళవారం అంబేద్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రతా నియమాలపై భద్రతా ప్రతిజ్ఞను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని జయంతి ఉత్సవాలలో సంబంధిత పోలీసు అధికారులు ప్రజలతో కలిసి పాల్గొని భద్రత ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమనిబంధనలు పాటించి రోడ్డుపై ప్రమాదాలను నివారించే దిశగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరిస్తామని మరియు రాంగ్ సైడ్ ప్రయాణం, రాంగ్ రూటు ప్రయాణం రాష్ డ్రైవింగ్ లాంటివి చేయమని ప్రతిజ్ఞ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని ప్రజలు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా గల అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పోలీసు సిబ్బంది ప్రజలచే భద్రతా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీంద్ర కుమార్, అదనపు కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, డిటిఓ శ్రీనివాస్, పట్టణ సీఐలు, ఎంవిఐలు, ఏఎంవిఐ లు,
    3
    *పత్రిక ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా, 
ఏప్రిల్ 14 :-
*పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర రాజకీయ ప్రముఖులు అధికారులు.*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నందు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ జయంతి వేడుకలలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం చేశారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి పరణాళికలో భాగంగా "అరైవ్ ఆలైవ్" లో భాగంగా వారం రోజులపాటు జరిగే కార్యక్రమాలలో మంగళవారం అంబేద్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రతా నియమాలపై భద్రతా ప్రతిజ్ఞను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని జయంతి ఉత్సవాలలో సంబంధిత పోలీసు అధికారులు ప్రజలతో కలిసి పాల్గొని భద్రత ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమనిబంధనలు పాటించి రోడ్డుపై ప్రమాదాలను నివారించే దిశగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరిస్తామని మరియు రాంగ్ సైడ్ ప్రయాణం, రాంగ్ రూటు ప్రయాణం రాష్ డ్రైవింగ్ లాంటివి చేయమని ప్రతిజ్ఞ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని ప్రజలు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
జిల్లా వ్యాప్తంగా గల అన్ని  పోలీసు స్టేషన్ల పరిధిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పోలీసు సిబ్బంది ప్రజలచే భద్రతా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీంద్ర కుమార్, అదనపు కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, డిటిఓ శ్రీనివాస్,  పట్టణ సీఐలు,  ఎంవిఐలు, ఏఎంవిఐ లు,
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    2 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మనువాద భావజాలనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడి లౌకిక భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే బాబా సాహెబ్ గారికి ఘనమైన నివాళి అని సీపీఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు.మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌక్ లో పార్టీ శ్రేణులతో కలిసి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...బాబాసాహెబ్ ఆలోచనలకూ విరుద్దంగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేలా దాని స్థానంలో మనువాద రాజ్యాంగం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు.అందులో భాగంగానే రాజ్యాంగ వ్యవస్థలను,దాని పునాదులను మార్చే ప్రయత్నం చేస్తుందని దేశాన్ని మత ఆధారంగా విభజిస్తుందని అన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై దాడులు పెరిగాయాని ప్రభుత్వ NCRT నివేదికలు చుస్తే అర్థం అవుతుందని అన్నారు. రిజర్వేషన్ ను తొలిగించేందుకు దానిని బలహీన పర్చేలా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేట్ కరణ, సంక్షేమ రంగం నుండి తప్పుకునేలా వ్యవహారిస్తుందని తెలిపారు. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించడం, మతోన్మాద భావజాలనికి వ్యతిరేకంగా పోరాడటం, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటం ప్రజల తక్షణ కర్తవ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని, ఆయన ఆశించన సమానత్వ సమమాజాన్ని సాధించేందుకు పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూసం సచిన్,జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల జిల్లా నాయకులు అరిఫా,నర్మదా,ఆశన్న,పోచన్న తదితరులు పాల్గొన్నారు
    1
    ఆదిలాబాద్ జిల్లా : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మనువాద భావజాలనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడి లౌకిక భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే బాబా సాహెబ్ గారికి ఘనమైన నివాళి అని సీపీఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు.మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌక్ లో పార్టీ శ్రేణులతో కలిసి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...బాబాసాహెబ్ ఆలోచనలకూ విరుద్దంగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేలా దాని స్థానంలో మనువాద రాజ్యాంగం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు.అందులో భాగంగానే రాజ్యాంగ వ్యవస్థలను,దాని పునాదులను మార్చే ప్రయత్నం చేస్తుందని దేశాన్ని మత ఆధారంగా విభజిస్తుందని అన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై దాడులు పెరిగాయాని ప్రభుత్వ NCRT నివేదికలు చుస్తే అర్థం అవుతుందని అన్నారు. రిజర్వేషన్ ను తొలిగించేందుకు దానిని బలహీన పర్చేలా  ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేట్ కరణ, సంక్షేమ రంగం నుండి తప్పుకునేలా వ్యవహారిస్తుందని తెలిపారు. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించడం, మతోన్మాద భావజాలనికి వ్యతిరేకంగా పోరాడటం, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటం ప్రజల తక్షణ కర్తవ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని, ఆయన ఆశించన సమానత్వ సమమాజాన్ని సాధించేందుకు పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూసం సచిన్,జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల జిల్లా నాయకులు అరిఫా,నర్మదా,ఆశన్న,పోచన్న తదితరులు పాల్గొన్నారు
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల : తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో  ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు  వారం రోజుల పాటు  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత  పోస్టర్ ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి నివాసం లో వారి చేతులమీదుగా ఈ  పోస్టర్ ఆవిష్కరణ ప్రారంభించిన అగ్నిమాపక ఆఫీసర్ మరియు సిబ్బంది..  ఈ కార్యక్రమంలో DCC జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు...
    1
    జగిత్యాల :
తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో  ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు  వారం రోజుల పాటు  ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత  పోస్టర్ ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి నివాసం లో వారి చేతులమీదుగా ఈ  పోస్టర్ ఆవిష్కరణ ప్రారంభించిన అగ్నిమాపక ఆఫీసర్ మరియు సిబ్బంది.. 
ఈ కార్యక్రమంలో DCC జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు...
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    59 min ago
  • పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేయబడింది. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. _రహదారి భద్రతా ప్రతిజ్ఞ_ నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
    1
    పత్రిక ప్రకటన 
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా 
మంగళవారం 
అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  సమక్షంలో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేయబడింది.
ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. 
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు.
_రహదారి భద్రతా ప్రతిజ్ఞ_ 
నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ​జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ​పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.​ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.
    1
    నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
​జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.
​పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.​ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.