వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చాకిరేవులు గుత్తి కోయిల గూడెంలో వైద్య శిబిరం వెంకటాపూర్ పి హెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ చీర్ల శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు వ పీహెచ్‌సీ పరిధిలోని చాకిరేవులు గుత్తి కోయిల ఆవాసంలో బుధవారం తిమ్మాపూర్ పల్లె దవాఖానా వైద్యాధికారి డాక్టర్ చందన నేతృత్వంలో వైద్య శిబిరం నిర్వహించారు. తిమ్మాపూర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గూడేనికి వైద్య సిబ్బంది పది కిలోమీటర్లు ట్రాక్టర్‌పై, మిగిలిన దూరం నడకన చేరుకుని గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో మొత్తం 52 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వీరిలో 22 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. శిబిరంలో నలుగురు గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, రక్తహీనత, బరువు తదితర అంశాలను పరిశీలించి, ప్రతి ఒక్కరి ప్రసవ తేదీని నమోదు చేశారు. నిర్దేశిత తేదీకి ముందుగానే ఆసుపత్రిలో చేరి, వైద్యుల పర్యవేక్షణలోనే ప్రసవం చేయించుకోవాలని, ఇంటి వద్ద ప్రసవాలకు ప్రయత్నించవద్దని గర్భవతులకు వైద్య సిబ్బంది వివరించారు. గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవడం, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఆవశ్యకతను తెలియజేయడం జరిగిందని డాక్టర్ చీర్ల శ్రీకాంత్ తెలియజేశారు. ముగ్గురు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రసవానంతర ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. బాలింత తల్లులు అందుబాటులో ఉండే పౌష్టికాహారాన్ని, ఆకుకూరలు, పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. జన్మించిన బిడ్డకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం ఇవ్వరాదని, ఈ విధానం వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. అలాగే బాలింతలు తగినంత విశ్రాంతి తీసుకుంటూ, పరిశుభ్రత పాటించాలని సూచించారు. జ్వర లక్షణాలతో వచ్చిన నలుగురికి ఆర్.డి.టి మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా ఎవరికీ మలేరియా, డెంగ్యూ వ్యాధులు నిర్ధారణ కాలేదని, జలుబు దగ్గుతో ముగ్గురు బాధ పడుతుండగా వారికి చికిత్స అందించి మిగిలిన వారికి వారి వ్యాధులను అనుసరించి మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. వైద్య శిబిరంలో భాగంగా ఏడాదిలోపు ముగ్గురు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, ఐదేళ్ల లోపు నలుగురు పిల్లలకు డీటీ, పదేళ్ల వయసు గల ముగ్గురికి డీటీ టీకాలను వేయడం జరిగిందని తెలియజేశారు. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది గ్రామస్తులకు వివరించారు. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, రాత్రి వేళల్లో దోమతెరలు వినియోగించడం, దోమలు కుట్టకుండా శరీరం పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అంతేకాక, కాచి చల్లార్చిన నీటినే తాగాలని, ఆరోజు వండుకున్న ఆహారాన్ని ఆరోజే తీసుకోవాలని ఈ జాగ్రత్తల ద్వారా అతిసారం, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని, వారికి అందుబాటులో ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఉంచామని వైద్యాధికారి తెలియజేస్తూ ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే స్వీయ చికిత్సలకు పాల్పడకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స పొందాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో ఆరోగ్య కార్యకర్తలు శోభ, సుశీల, మోతీలాల్, ఆశా కార్యకర్తలు మాధవి, కవిత తదితరులు పాల్గొని వైద్య సేవలు అందించారు.
వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చాకిరేవులు గుత్తి కోయిల గూడెంలో వైద్య శిబిరం వెంకటాపూర్ పి హెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ చీర్ల శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు వ పీహెచ్‌సీ పరిధిలోని చాకిరేవులు గుత్తి కోయిల ఆవాసంలో బుధవారం తిమ్మాపూర్ పల్లె దవాఖానా వైద్యాధికారి డాక్టర్ చందన నేతృత్వంలో వైద్య శిబిరం నిర్వహించారు. తిమ్మాపూర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గూడేనికి వైద్య సిబ్బంది పది కిలోమీటర్లు ట్రాక్టర్‌పై, మిగిలిన దూరం నడకన చేరుకుని గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో మొత్తం 52 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వీరిలో 22 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. శిబిరంలో నలుగురు గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, రక్తహీనత, బరువు తదితర అంశాలను పరిశీలించి, ప్రతి
ఒక్కరి ప్రసవ తేదీని నమోదు చేశారు. నిర్దేశిత తేదీకి ముందుగానే ఆసుపత్రిలో చేరి, వైద్యుల పర్యవేక్షణలోనే ప్రసవం చేయించుకోవాలని, ఇంటి వద్ద ప్రసవాలకు ప్రయత్నించవద్దని గర్భవతులకు వైద్య సిబ్బంది వివరించారు. గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవడం, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఆవశ్యకతను తెలియజేయడం జరిగిందని డాక్టర్ చీర్ల శ్రీకాంత్ తెలియజేశారు. ముగ్గురు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రసవానంతర ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. బాలింత తల్లులు అందుబాటులో ఉండే పౌష్టికాహారాన్ని, ఆకుకూరలు, పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. జన్మించిన బిడ్డకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం ఇవ్వరాదని, ఈ విధానం వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. అలాగే బాలింతలు తగినంత
విశ్రాంతి తీసుకుంటూ, పరిశుభ్రత పాటించాలని సూచించారు. జ్వర లక్షణాలతో వచ్చిన నలుగురికి ఆర్.డి.టి మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా ఎవరికీ మలేరియా, డెంగ్యూ వ్యాధులు నిర్ధారణ కాలేదని, జలుబు దగ్గుతో ముగ్గురు బాధ పడుతుండగా వారికి చికిత్స అందించి మిగిలిన వారికి వారి వ్యాధులను అనుసరించి మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. వైద్య శిబిరంలో భాగంగా ఏడాదిలోపు ముగ్గురు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, ఐదేళ్ల లోపు నలుగురు పిల్లలకు డీటీ, పదేళ్ల వయసు గల ముగ్గురికి డీటీ టీకాలను వేయడం జరిగిందని తెలియజేశారు. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది గ్రామస్తులకు వివరించారు. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, రాత్రి వేళల్లో దోమతెరలు వినియోగించడం, దోమలు కుట్టకుండా
శరీరం పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అంతేకాక, కాచి చల్లార్చిన నీటినే తాగాలని, ఆరోజు వండుకున్న ఆహారాన్ని ఆరోజే తీసుకోవాలని ఈ జాగ్రత్తల ద్వారా అతిసారం, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని, వారికి అందుబాటులో ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఉంచామని వైద్యాధికారి తెలియజేస్తూ ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే స్వీయ చికిత్సలకు పాల్పడకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స పొందాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో ఆరోగ్య కార్యకర్తలు శోభ, సుశీల, మోతీలాల్, ఆశా కార్యకర్తలు మాధవి, కవిత తదితరులు పాల్గొని వైద్య సేవలు అందించారు.
- ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు' పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని ఘట్టమ్మ సమీపంలో గల కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ స్వాగతం పలికారు. మంత్రి సీతక్క ముందుగా మహనీయులకు పూలమాలలు వేసి తెలంగాణ గీతం ఆలాపన అనంతరం పోలీసు గౌరవనీయులు స్వీకరించారు.జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతక్క ప్రసంగం అనంతరం 265 స్వయం సహాయక సంఘాలకు 22 కోట్ల 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. *ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...* తెలుగు ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము నూతన ములుగు జిల్లా కార్యాలయంలో ఘనంగా, సగర్వంగా మన జాతీయ జెండాను ఎగరవేసుకున్నామని,నిజాం పాలనలో విడిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఆనాడు మన ప్రథమ ప్రధాని నెహ్రూ గారి ఆదేశాల అనుసారం, ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి హోంశాఖ మంత్రిగా ఆనాడు తెలంగాణ భారతదేశంలో భాగమైందని,విముక్తి కోసం, విమోచనం కోసం, విలీనం కోసం అనేక పోరాటాలు, 'భూమి, భుక్తి, విముక్తి' అని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో పెద్ద ఎత్తున జరిగాయని, ఆ పోరాటంలో వేలాది మంది బిడ్డలు కులమత రహితంగా తమ ప్రాంత విముక్తి కోసం, విలీనం కోసం, విమోచనం కోసం పోరాటం చేసి, ఈ పీడన అంతం కావాలి, మనం కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని ఆరోజు పెద్ద ఎత్తున పోరాటం జరిగిందని,ఆ పోరాటాన్ని చూసినటువంటి ఆనాటి ప్రధాని నెహ్రూ గారు భారతదేశంలో తెలంగాణను విలీనం చేసి, నేటికి 78 సంవత్సరాలు పూర్తయి, 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రాంతం సాధించడం జరిగిందని,ఆ తర్వాత ఆంధ్ర-తెలంగాణ ఉద్యమాలు, వాటి పోరాటాల ఫలితంగా మళ్లీ సోనియమ్మ నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో తెలంగాణకు సంపూర్ణమైన ప్రాంతీయ సమస్యలను కూడా తొలగించి, ప్రత్యేక రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మంత్రి సీతక్క అన్నారు.1
- తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న నూతన కలెక్టరేట్ ములుగు జిల్లా, సెప్టెంబర్ 16 (భారత శక్తి): నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.2
- వచ్చే సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తాయి: తుమ్మల నాగేశ్వరరావు ములుగు జిల్లాలోని ఇంచెర్ల, భూపాలపల్లి జిల్లాలోని చైన్పాక ప్రాంతాల్లో ఆయిల్ పామ్ మిల్లుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నాటికి మిల్లులు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.1
- హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security1
- fabo laundry and dry cleaning pickup and delivery fre wash&steam iron per 120 kg wash&fold 100 s team iron 100 shirt 👔 100 rs T. shart👕100 rs paint👖100 rs saree 200 rs lahanga 350 rs jacket 200 rs kurta 100 rs suaes 450 rs blanket (single )350 (double )450 rs bleizer.. 300₹ sairwani. 300₹4
- *తండాలకు గ్రామపంచాయతీ హోదా – కేసీఆర్‌కు కృతజ్ఞతగా పాలాభిషేకం* *“మా తండాలో మా పాలన – మా గూడెంలో మా పాలన”* తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల స్థానిక పాలనకు మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నూతన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం గంటలకు చిల్పూర్ మండలంలో మాజీ AMC వైస్ చైర్మన్ మాలోతు రమేష్ నాయకు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గార్లగడ్డ తండా, లింగంపల్లి దేవోజీ తండా, తీగల తండా* గ్రామాల్లో పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా లంబాడీ మహిళలు కేసీఆర్ ని స్మరించుకుంటూ నృత్యాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, భూక్యా గోపాల్ నాయక్, లింగంపల్లి సర్పంచ్ భూక్యా సునీత లాలు, కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ రాజు రాధిక, రమేష్, రాజేందర్, వార్డు మెంబర్లు, లింగంపల్లి మాజీ అధ్యక్షులు రచ్చ రవి, ఎల్లయ్య, శంకర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ బాలరాజు, మాటూరి శ్రీను, కొండ కనకయ్య, లకావత్ బాగ్న, సంపత్, తిరుపతి, పతేపూర్ గ్రామ మాజీ అధ్యక్షులు ఉమ్లా, వెంకన్న, లింగన్న, మాజీ సర్పంచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ నాయక్, మాజీ తీగల తండా అధ్యక్షులు వెంకటేష్, వార్డు మెంబర్ రవి, యూత్ నాయకులు సుధాకర్, రాజు తదితరులు, మహిళలు పాల్గొన్నారు.1
- గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* *కురవి:* గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో *మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో* భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి సత్యవతి రాథోడ్ గారు పాలాభిషేకం నిర్వహించారు* అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...* *“గిరిజనుల ఆరాధ్య దైవం మాజీ సీఎం కేసీఆర్ గారు* గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది *విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు* గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ గారి పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. *కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి *దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది* కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు1
- కార్మికుల పై నిర్భందాన్ని నిరసిస్తూ సామూహిక నిరసన దీక్ష ఈ రోజు CITU ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం ముందు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.ఈ దీక్షలను రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి గారు ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కు వెళ్లి అదనపు కలెక్టర్ మహేందర్ జి గారికి, జిల్లా ఎస్ పి కార్యాలయం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. స్కీం వర్కర్లఐన ఆశా, అంగన్వాడి తదితరులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన - పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది కార్మికుల హక్కులను అప్రాజాస్వామికంగా నిరాకరించటమేనని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు.* *2026 సెప్టెంబర్ 8,9తేదీల్లో జరిగిన అంగన్వాడీ,ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు.* *ఆశా వర్కర్స్, అంగన్వాడి లకు రూ.18,000/-ల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్ సౌకర్యం అమలు,గ్రామ పంచాయితీ, మున్సిపల్,RTC విద్యుత్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్, హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు డిమాండ్ చేస్తున్నాము.వీటి ఎజెండా కోసం ఆందోళన- పోరాటాలు చేస్తున్నారు. బాధ్యత కల్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించాలి.పరిష్కరించకుండా ఆందోళనా-పోరాటాలు నిర్వహిస్తున్న కార్మికులను అణచివేస్తూ తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారనీ అన్నారు.* ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు కొప్పుల రఘుపతి, గుండె బోయిన రవిగౌడ్, కురేందుల సమ్మక్క, శ్రావ్య, రమాదేవి, శ్రీనాథ్, మహేష్, పద్మ, భాగ్య, సరిత, లక్ష్మీనరసమ్మ , నాగమణి, సంధ్య, పూర్ణ, సుధా, వెంకటరమణ , సడాలు, రజిత, కవిత, సమ్మక్క ఆశా అంగన్వాడి, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.1