నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ *నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు.* కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి గంగా జమునా తహజీబ్‌ను కాపాడాలి. *ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగగా, అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్‌లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్‌లు మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. మతాల మధ్య ఐక్యతే తెలంగాణ బలం: షబ్బీర్ అలీ. సభలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ. మనిషిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం ఎప్పటి నుంచో కులమతాలకు అతీతంగా కలిసి జీవించే గొప్ప సంస్కృతిని కలిగి ఉందని, ఈ సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, కరుణ, సహనం, సోదరభావం మార్గంలో సమాజం ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే పార్టీ అని షబ్బీర్ అలీ అన్నారు. కులం, మతం, భాష, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించడం కాంగ్రెస్ పార్టీ విధానమని తెలిపారు. తెలంగాణలో ప్రతి పౌరుడు ప్రశాంతంగా, గౌరవంగా జీవించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వేలాది గా ,ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. నుడచైర్మన్ కేశ వెను, శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్ , జావిద్ అక్రమ్, కూద్దూస్, హారున్, కార్పొరేటర్లు సజ్జాద్ రహీల్, నయీమ్ షారాన్, అబ్దుల్ కరీం, అబుద్ బిన్ హందన్, అన్వార్, మొహమ్మద్ అహ్మద్, కో ఆప్షన్ మెంబెర్ మహేందర్ సింగ్, ఆసిఫ్, వహీద్, మరియు మీలాద్ కమిటీ అధ్యక్షులు షా్యైబ్ రజా, మహమ్మద్ అబ్బు రజా, రషీద్ రాజా, ముజహిద్ ఖాన్, పాప ఖాన్, జావీద్ ఖాన్, కయ్యుమ్, షబ్బీర్ రాజ్జాక్, జఫర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొయిన్, సమీ, రియాజుదిన్, సఫ్దర్, అఫ్రోజ్ ఖాన్, సాదిక్ సోహైల్, షైక్ మహబూబ్, పర్వేజ్, ఈసా,మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ *నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు.* కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి గంగా జమునా తహజీబ్‌ను కాపాడాలి. *ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగగా, అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్‌లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్‌లు మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. మతాల మధ్య ఐక్యతే తెలంగాణ బలం: షబ్బీర్ అలీ. సభలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ. మనిషిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం ఎప్పటి నుంచో కులమతాలకు అతీతంగా కలిసి జీవించే గొప్ప సంస్కృతిని కలిగి ఉందని, ఈ సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, కరుణ, సహనం, సోదరభావం మార్గంలో సమాజం ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే పార్టీ అని షబ్బీర్ అలీ అన్నారు. కులం, మతం, భాష, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించడం కాంగ్రెస్ పార్టీ విధానమని తెలిపారు. తెలంగాణలో ప్రతి పౌరుడు ప్రశాంతంగా, గౌరవంగా జీవించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వేలాది గా ,ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. నుడచైర్మన్ కేశ వెను, శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్ , జావిద్ అక్రమ్, కూద్దూస్, హారున్, కార్పొరేటర్లు సజ్జాద్ రహీల్, నయీమ్ షారాన్, అబ్దుల్ కరీం, అబుద్ బిన్ హందన్, అన్వార్, మొహమ్మద్ అహ్మద్, కో ఆప్షన్ మెంబెర్ మహేందర్ సింగ్, ఆసిఫ్, వహీద్, మరియు మీలాద్ కమిటీ అధ్యక్షులు షా్యైబ్ రజా, మహమ్మద్ అబ్బు రజా, రషీద్ రాజా, ముజహిద్ ఖాన్, పాప ఖాన్, జావీద్ ఖాన్, కయ్యుమ్, షబ్బీర్ రాజ్జాక్, జఫర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొయిన్, సమీ, రియాజుదిన్, సఫ్దర్, అఫ్రోజ్ ఖాన్, సాదిక్ సోహైల్, షైక్ మహబూబ్, పర్వేజ్, ఈసా,మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
- కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈu సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.1
- సిరికొండ:చినుకు పడితే చిత్తడే.. కోడూరు హై లెవెల్ బ్రిడ్జి సిరికొండ మండలంలోని కోడూరు హై లెవెల్ బ్రిడ్జి వద్ద వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి *రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది* *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి – పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా - 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్ నిజామాబాద్, ఆగస్టు 25,2026: రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు. అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారం అయ్యిందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్ అన్నారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు. సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రసాయన ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు. అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్ అన్నారు. మార్కెట్ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్ అన్నారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. “అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్ ఆకాంక్షించారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటు తో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పి. రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీ శ్రీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య లు పాల్గొన్నా3
- ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు. 1250 ఎకరాల్లో కూరగాయల సాగు ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు. ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు. రెండు ఎకరాల్లో బంతి పూల సాగు గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది. జిల్లా కలెక్టర్ అభినందన గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు. మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.1
- శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.1
- *కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు* *కోడెల మృతిపై విచారణకు ఆదేశం* *నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం* *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు* వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు... ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.. వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.4
- రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులు రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాస్కర్ తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగకు రెండు రోజుల ముందుగానే, బుధవారం నుంచి అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని ఆర్ఎం స్పష్టం చేశారు.1
- రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు* *రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు* 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తూ, ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరహార దీక్షకు సంఘీభావంగా కామారెడ్డి పట్టణ బీజేపీ కౌన్సిలర్ లు, నాయకులు బయల్దేరటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 'ఫీజుల బకాయి - బిజెపి లడాయి' పేరుతో తెలంగాణ బిజెపి నేత ఎన్. రామచందర్ రావు చేపట్టిన 2 రోజుల నిరాహార దీక్షకు యువత నుండి వెల్లువెత్తుతున్న మద్దతు వస్తుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఇకనైనా ఆపాలనీ, ఫీజుల బకాయిలను కాంగ్రెస్ సర్కార్ తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు కి మద్దతుగా *కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ కామారెడ్డి పట్టణ కౌన్సిలర్ లు, మరియు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలినట్లు తెలిపారు.1