*కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు* *కోడెల మృతిపై విచారణకు ఆదేశం* *నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం* *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు* వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు... ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.. వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
*కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు* *కోడెల మృతిపై విచారణకు ఆదేశం* *నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం* *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు* వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు... ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల
నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని
ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.. వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత
త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- *కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు* *కోడెల మృతిపై విచారణకు ఆదేశం* *నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం* *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు* వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు... ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.. వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.4
- ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు. 1250 ఎకరాల్లో కూరగాయల సాగు ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు. ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు. రెండు ఎకరాల్లో బంతి పూల సాగు గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది. జిల్లా కలెక్టర్ అభినందన గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు. మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.3
- 34 నెలల పాలనలో విద్యార్థుల హామీల అమలేది రేవంత్ రెడ్డి? స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు? విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో ఖాళీ పర్సులు ప్రదర్శిస్తూ ఏఐఎస్ఎఫ్ విన్నూత నిరసన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను ,యువవికాసం పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని , ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు, అరవింద్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు1
- కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.1
- బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.4
- యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.1
- విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్ పరిశీలించి, తరగతి గదులు, వసతి, తదితర అంశాలపై వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా తరగతి గదుల నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న టాయిలెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి, గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. విద్యాలయంలో నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సందర్శనలో సర్పంచ్ మల్లుగారి పద్మ, పంచాయితీ రాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈ లు అన్వర్, సుమలత, ఎంపీడీఓ రాజేందర్, జీసీడీఓ పద్మజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.1