మల్లంపల్లి: సేవే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం సేవే లక్ష్యంగా బి ఆర్ ఎస్ కార్యక్రమాలు మల్లంపల్లి మండలంలో బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాలేపు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చీదర సంతోష్ ఆధ్వర్యంలో మల్లంపల్లి గ్రామానికి చెందిన క్యాన్సర్‌తో బాధపడుతున్న నిరుపేద సారా లక్ష్మిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ములుగు జిల్లా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు గోవింద్ నాయక్‌తో కలిసి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కొమరం ధనలక్ష్మి, ఖుర్బన్ ఆలీ, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండ రాజు, రేణిగుంట్ల సురేష్, మహమ్మద్ పాషా, రాజ్‌కుమార్, గోన్నాల మహేష్, ఆలీ రంజాన్, గ్రామ అధ్యక్షుడు రాజకుమార్, ఇమ్మడి సమ్మయ్య, ఆకుల మల్లేష్, ఆకుల రమేష్, తోట వేణు, గుగులోత్ రాయల్, దుంత్రాల రవీందర్, ఆకుల మల్లేష్, బొమ్మకంటి రమేష్, కుక్కల సంపత్, సాంబుల్, చిట్టిబాబు, సోయం ఈశ్వర్, పుల్లారావు, మహేష్, సంతోష్, ఇందర రమేష్, అశోక్, మునిగెల నరేష్ పాల్గొన్నారు.
మల్లంపల్లి: సేవే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం సేవే లక్ష్యంగా బి ఆర్ ఎస్ కార్యక్రమాలు మల్లంపల్లి మండలంలో బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాలేపు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చీదర సంతోష్ ఆధ్వర్యంలో మల్లంపల్లి గ్రామానికి చెందిన క్యాన్సర్‌తో బాధపడుతున్న నిరుపేద సారా లక్ష్మిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ములుగు జిల్లా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు గోవింద్ నాయక్‌తో కలిసి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కొమరం ధనలక్ష్మి, ఖుర్బన్ ఆలీ, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండ రాజు, రేణిగుంట్ల సురేష్, మహమ్మద్ పాషా, రాజ్‌కుమార్, గోన్నాల మహేష్, ఆలీ రంజాన్, గ్రామ అధ్యక్షుడు రాజకుమార్, ఇమ్మడి సమ్మయ్య, ఆకుల మల్లేష్, ఆకుల రమేష్, తోట వేణు, గుగులోత్ రాయల్, దుంత్రాల రవీందర్, ఆకుల మల్లేష్, బొమ్మకంటి రమేష్, కుక్కల సంపత్, సాంబుల్, చిట్టిబాబు, సోయం ఈశ్వర్, పుల్లారావు, మహేష్, సంతోష్, ఇందర రమేష్, అశోక్, మునిగెల నరేష్ పాల్గొన్నారు.
- మల్లంపల్లి: సేవే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం సేవే లక్ష్యంగా బి ఆర్ ఎస్ కార్యక్రమాలు మల్లంపల్లి మండలంలో బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాలేపు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చీదర సంతోష్ ఆధ్వర్యంలో మల్లంపల్లి గ్రామానికి చెందిన క్యాన్సర్‌తో బాధపడుతున్న నిరుపేద సారా లక్ష్మిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ములుగు జిల్లా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు గోవింద్ నాయక్‌తో కలిసి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కొమరం ధనలక్ష్మి, ఖుర్బన్ ఆలీ, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండ రాజు, రేణిగుంట్ల సురేష్, మహమ్మద్ పాషా, రాజ్‌కుమార్, గోన్నాల మహేష్, ఆలీ రంజాన్, గ్రామ అధ్యక్షుడు రాజకుమార్, ఇమ్మడి సమ్మయ్య, ఆకుల మల్లేష్, ఆకుల రమేష్, తోట వేణు, గుగులోత్ రాయల్, దుంత్రాల రవీందర్, ఆకుల మల్లేష్, బొమ్మకంటి రమేష్, కుక్కల సంపత్, సాంబుల్, చిట్టిబాబు, సోయం ఈశ్వర్, పుల్లారావు, మహేష్, సంతోష్, ఇందర రమేష్, అశోక్, మునిగెల నరేష్ పాల్గొన్నారు.1
- రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా..! ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. SIR ప్రక్రియలో ఓటర్ల అవకతవకలను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- అంగన్వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు చిన్నారులకు గాయాలు అంగన్వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు చిన్నారులకు గాయాలు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్–తెలిగూడ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో కూలిన పైకప్పు దీంతో సాత్విక్(3), నిహారిక(4), సాయినాథ్(5) అనే చిన్నారులతో పాటు, గాయాలపాలైన చిన్నారుల తల్లులు సోనీ, సంధ్యారాణి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు అంగన్వాడి కేంద్రం శిథిలావస్థలో ఉందని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు.1
- ఓపెన్ కాస్ట్ వల్ల రామప్ప దేవాలయానికి ముప్పు. కాకతీయ హెరిటేజ్ వారి ఆందోళన... తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు వెంకటాపూర్ లో ప్రతిపాదిత సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సు వారసత్వంపై ప్రభావం చూపుతుందనీ, పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయం వెంకటాపూర్ గ్రామంలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ప్రతిపాదించిన సుమారు 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాల వల్ల తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఈ ప్రతిపాదిత గని ప్రాంతం రామప్ప సరస్సు మరియు రామప్ప దేవాలయానికి దిగువ ప్రవాహ దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం భౌగోళికంగా నిర్మాణాత్మకంగా అస్థిరంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం అనేక ప్రధాన, ఉప-భ్రంశాలు (Faults), అలాగే పరస్పరం దాటుకుంటూ వెళ్లే జాయింట్లు (Joints) కలిగి ఉంది. ఇక్కడి భౌగోళిక రేఖల (Lineaments) సాధారణ దిశలు NNW-SSE, E-W మరియు NE-SW గా ఉన్నాయి. అదేవిధంగా, శిలా పొరల వాలు దిశ (Dip Direction) ఈశాన్యం వైపు ఉంది. అనేక జాయింట్లు మరియు పగుళ్లు (Fractures) కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. రామప్ప సరస్సు నీటి మట్టంపై ప్రభావం రామప్ప సరస్సులోని నీటి మట్టం, శిలా పొరల మధ్య ఉన్న జాయింట్ల ద్వారా భూగర్భజలాలు ప్రవహించే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ ప్రభావం వెంకటాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గని వరకు ఉండే అవకాశం ఉందని GSI నివేదికలో పేర్కొనబడింది. (GSI నివేదిక, పేజీ 22 ఆధారంగా). రామప్ప సరస్సు సుమారు 3 TMC నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఇది దాదాపు 30,000 ఎకరాల భూమికి సాగునీరు అందించగలదు. రెండు కొండలను కలుపుతూ నిర్మించిన మట్టి కట్ట (Earthen Bund) ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు COT (Cut Off Trench) లేకపోవడం వల్ల, రామప్ప సరస్సుకు దిగువన ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గని కారణంగా ఏర్పడే అధిక హైడ్రాలిక్ గ్రేడియెంట్ వల్ల భూగర్భ జలాల లీకేజీ (Seepage) వేగవంతమయ్యే ప్రమాదం ఉంది. రామప్ప దేవాలయ పునాది నిర్మాణం రామప్ప దేవాలయానికి పునాదిగా Confined Sand Box Framework (పరిమిత ఇసుక పెట్టె పునాది నిర్మాణం) ఉపయోగించారు. రామప్ప సరస్సు మరియు దేవాలయం గుండా వెళ్లే పరస్పరం అనుసంధానమైన భౌగోళిక రేఖల వెంట ఏర్పడే Piping Phenomenon (నీటి ప్రవాహం వల్ల భూగర్భంలో సొరంగం/కాలువల మాదిరి మార్గాలు ఏర్పడే ప్రక్రియ) ఈ Sand Box Frameworkను ప్రభావితం చేసే అవకాశం ఉందని GSI నివేదిక పేర్కొంది. (GSI నివేదిక, పేజీ 21 ఆధారంగా) పేలుళ్ల వల్ల రామప్ప దేవాలయంపై ప్రభావం నివేదికల ప్రకారం రామప్ప దేవాలయంపై పేలుళ్ల (Blasting) ప్రత్యక్ష ప్రభావం ప్రస్తుతానికి తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో పునరావృతమయ్యే మరియు చక్రీయ కంపనాలు (Periodic & Cyclical Vibrations) దేవాలయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక కంపనాల వల్ల నిర్మాణంలో Fatigue (బలహీనత/అలసట) ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రామప్ప దేవాలయం తీవ్రమైన నిర్మాణ సమస్యలను ఎదుర్కొంటోంది. రంగ మండపంలోని భారీ నేల దూలాల్లో పగుళ్లు (Fracturing) మరియు అసమాన కూర్చివేత (Differential Settlement)కనిపిస్తున్నాయి. కాకతీయులు రామప్ప దేవాలయాన్ని Confined Sand Box Foundation పద్ధతిలో నిర్మించారు. ఇందులో ఇసుకను సరైన సాంద్రతతో (Optimal Density) బిగించి ఉంచారు. ఇసుక ఈ పరిమిత పెట్టెలో సురక్షితంగా ఉన్నంతకాలం, దేవాలయ పై నిర్మాణం యొక్క భారాన్ని ఈ పునాది సమర్థవంతంగా మోయగలదు. ఈ ప్రత్యేక నిర్మాణ పద్ధతి కారణంగానే ఈ స్మారక చిహ్నం 800 సంవత్సరాలకు పైగా నిలిచి ఉంది. అయితే, పేలుళ్ల వల్ల ఏర్పడే కంపనాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో దేవాలయ నిర్మాణ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల తీవ్రమైన ప్రమాదాలు 300 మీటర్ల లోతు వరకు ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ గని కారణంగా రామప్ప సరస్సు ప్రాంతంలో ఏర్పడే హైడ్రాలిక్ గ్రాడ్యుయేంట్ అలాగే పేలుళ్ల వల్ల కలిగే కంపనాలు కలిసి రామప్ప దేవాలయ స్థిరత్వంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల: - జీవవైవిధ్యానికి (Biodiversity) తీవ్రమైన నష్టం కలగవచ్చు. - స్థానిక ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడవచ్చు. - సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన అనుబంధాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు. - రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సు పరిసరాల్లో పర్యావరణ క్షీణత ఏర్పడవచ్చు. రామప్ప సరస్సు కట్ట తెగిపోయే ప్రమాదం చివరగా, ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కారణంగా ఏర్పడే Piping Phenomenon ద్వారా రామప్ప సరస్సు నుంచి భారీ మొత్తంలో నీరు భౌగోళిక రేఖలు (Lineaments) మరియు పగుళ్ల (Fractures) ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంది. దీని ఫలితంగా రామప్ప సరస్సు కట్ట తెగిపోవడం → భారీగా నీరు విడుదల కావడం → పరిసర గ్రామాలు నీట మునగడం → ప్రాణ, ఆస్తి నష్టం → రామప్ప దేవాలయానికి తీవ్రమైన ప్రమాదం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇది ఒక సునామీ వంటి విపత్తుకు దారితీసే ప్రమాదాన్ని కలిగి ఉండవచ్చు. పై సంక్షిప్త సాంకేతిక విశ్లేషణను దృష్టిలో ఉంచుకుని, సింగరేణి కాలరీస్ సంస్థ సాంకేతిక నిపుణుల విశ్లేషణలను, అలాగే ప్రజల సామాజిక-సాంస్కృతిక భావోద్వేగాలను గౌరవించాలి. అందువల్ల,రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సు అనే గొప్ప ప్రపంచ వారసత్వ సంపదను రక్షించేందుకు ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ మైనింగ్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా, ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల ద్వారా భారీ మొత్తంలో ధూళి ఉత్పత్తి కావడం వల్ల వాయు కాలుష్యం మరియు పర్యావరణ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.3
- _*భూపాలపల్లిలో మెగా జాబ్ మేళా...*_ _*నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు..*_ _*9న పుష్ప గార్డెన్స్‌లో నిర్వహణ*_ జయశంకర్ జిల్లా అక్టోబర్ 7: నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు *ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* తెలిపారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని పేర్కొన్నారు.జాబ్ మేళా ఏర్పాట్లపై బుధవారం *పుష్ప గ్రాండ్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా మేళా ప్రాంగణాన్ని పరిశీలించి టెంట్లు, సౌండ్ సిస్టం, తాగునీరు, భోజనం, విద్యుత్, రవాణా తదితర ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, డీఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో ఉదయం 7 గంటలకే పుష్ప గార్డెన్స్‌కు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం మొత్తం 15 రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 8 మండలాలకు 8 కౌంటర్లు, భూపాలపల్లి పట్టణానికి ఒక కౌంటర్‌తో పాటు 4–5 జనరల్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి కౌంటర్‌లో మండల విద్యాశాఖ అధికారులతో పాటు నలుగురు సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఆటోలు, టాటా ఏస్ వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సర్పంచులు, ఎంపీడీవోలు సమన్వయంతో ఉదయాన్నే అభ్యర్థులకు టిఫిన్ అందించి, వాహనాల ద్వారా జాబ్ మేళా ప్రాంగణానికి తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 2,770 మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. ఈసారి మరింత విస్తృత స్థాయిలో కంపెనీలు, ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యే అవకాశం ఉందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.4
- * చిన్న గూడూరులో హాస్టలను సందర్శించిన : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్... *చిన్నగూడూరులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన.. మహబూబాబాద్ జిల్లా : చిన్నగూడూరు మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించకుండా విద్యార్థులకు నీళ్లచారు, అన్నం వడ్డించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సత్యవతి రాథోడ్ కోరారు.2
- ములుగు మున్సిపాలిటీలో దోపిడీ బాగోతం బట్టబయలు : కమిషనర్ కు చుక్కలు చూపించిన కౌన్సిలర్లు ములుగు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నేడు యుద్ధభూమిని తలపించింది. కమిషనర్ అక్రమాలపై కౌన్సిలర్లు గళమెత్తడంతో సభ రసాభాసగా మారి మధ్యలోనే ముగిసింది. లక్ష దాటితే టెండర్ - మరి 11 లక్షల మాటేంటి? మున్సిపల్ చట్టం ప్రకారం లక్ష రూపాయలు దాటిన ఏ పనికైనా టెండర్ పిలవాలి. కానీ ములుగు కమిషనర్ చట్టాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, ఎవరికీ తెలియకుండా నర్సంపేట విశ్వం సౌండ్ కు 11 లక్షల పనిని నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. ఇది బహిరంగ దోపిడీ కాదా అని కౌన్సిలర్లు నిలదీశారు. సద్దుల బతుకమ్మ పేరుతో స్వాహా...? 6 లక్షలతో ముగిసే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు 11 లక్షలు చూపించడం వెనుక భారీ కమీషన్ల బాగోతం ఉందని ఆరోపణ. దసరా ఉత్సవాలకు రెండు నెలల ముందే తీర్మానం చేయాల్సి ఉండగా, సెప్టెంబర్ సమావేశాన్ని ఎందుకు దాటవేశారని ప్రశ్నించారు. కొందరికి భయపడి కమిషనర్ ఒంటెద్దు పోకడలతో పరిపాలనను భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధికి నిధులు లేవు - దోపిడీకి ఉన్నాయా..? కాలనీల్లో వీధి దీపాలు వెలగడం లేదు, మిషన్ భగీరథ పైపులు లీకేజీలతో రోడ్లన్నీ చెరువులయ్యాయి, గల్లీల్లో మొరం లేదు, జేసీబీ రిపేర్ కు డబ్బు లేదు, చెత్త ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోయలేని దీనస్థితిలో మున్సిపాలిటీ ఉందని, అలాంటప్పుడు 11 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని కౌన్సిలర్లు ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోనెల భరత్, బైకనీ సునీత-ఓదెలు, రేసోజు పద్మ -వేణుగోపాల్ చారి గండ్రకోట వాణి -కుమార్, కోయిల లక్ష్మి, బైకాని అనూష-సాగర్ తీవ్ర వాగ్వాదానికి దిగి కమిషనర్ ను నిలదీయగా, కమిషనర్ కుంటిసాకులతో సమాధానం దాటవేశారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.3
- ములుగు జిల్లా పస్రా-తాడ్వాయి మధ్య రోడ్డు ప్రమాదం..CPPF జవాన్ మృతి ములుగు జిల్లా పస్రా-తాడ్వాయి మధ్యగల అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ, CRPF వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో CRPF జవాన్ మరణించగా.. మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం. అదే వేగంతో వస్తూ.. పస్రా వైపు వెళ్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, లారీ డ్రైవర్ నిద్రలో ఉన్నట్లు సమాచారం.4