ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ జగిత్యాల. 👉ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ మాట్లాడుతూ.....మార్కౌట్ చేయని ఇందిరమ్మ ఇండ్ల పట్టణ మరియు రూరల్ ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మార్క్ ఔట్ చేయని పక్షంలో వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి త్వరగా బేస్మెంట్ వరకు పనులు జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో సమన్వయంతో పని చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని అన్నారు. మరో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మండలంలో వివిధ స్టేజీ లలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు మార్చి నాటికీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి నిధులు లేని పక్షంలో మహిళా సంఘాల ద్వారా స్వయం సహాయక రుణాలు అందజేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా నీటి కొరత ఉంటే తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. మోటార్లు, పైప్‌లైన్లు తదితర సదుపాయాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం (EGS): ఆమోదించబడిన పనుల స్థితి, గ్రౌండింగ్ పురోగతి మరియు కూలీలకు చెల్లింపుల వివరాలు సమీక్షించబడ్డాయి. పనులను వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు సమయానికి చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లను శాతాల వారీగా సమీక్షించి, లక్ష్యాలకు అనుగుణంగా వసూళ్లు పెంచాలని సూచించారు. పెండింగ్ బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వసూళ్లలో నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సి ఈ వో గౌతమ్ రెడ్డి, డి ఆర్ డి వో రఘువరన్, డిపివో మదన్ మోహన్, సంబంధిత శాఖల ఈ ఈ లు, డి ఈ లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడివోలు, ఏ ఈ లు, ఎంపివోలు, క్లస్టర్ ఇంచార్జి లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ జగిత్యాల. 👉ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ మాట్లాడుతూ.....మార్కౌట్ చేయని ఇందిరమ్మ ఇండ్ల పట్టణ మరియు రూరల్ ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మార్క్ ఔట్ చేయని పక్షంలో వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి త్వరగా బేస్మెంట్ వరకు పనులు జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎంపీడీవోలు,
సంబంధిత అధికారులతో సమన్వయంతో పని చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని అన్నారు. మరో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మండలంలో వివిధ స్టేజీ లలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు మార్చి నాటికీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి నిధులు లేని పక్షంలో మహిళా సంఘాల ద్వారా స్వయం సహాయక రుణాలు అందజేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా నీటి కొరత
ఉంటే తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. మోటార్లు, పైప్‌లైన్లు తదితర సదుపాయాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం (EGS): ఆమోదించబడిన పనుల స్థితి, గ్రౌండింగ్ పురోగతి మరియు కూలీలకు చెల్లింపుల వివరాలు సమీక్షించబడ్డాయి. పనులను వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు సమయానికి చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లను శాతాల వారీగా సమీక్షించి, లక్ష్యాలకు అనుగుణంగా వసూళ్లు పెంచాలని సూచించారు. పెండింగ్ బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వసూళ్లలో నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సి ఈ వో గౌతమ్ రెడ్డి, డి ఆర్ డి వో రఘువరన్, డిపివో మదన్ మోహన్, సంబంధిత శాఖల ఈ ఈ లు, డి ఈ లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడివోలు, ఏ ఈ లు, ఎంపివోలు, క్లస్టర్ ఇంచార్జి లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
- జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.1
- కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.1
- కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం పై అలకబూనారు. ఢిల్లీకి రావాలని పిలిచిన వెళ్లకుండా సొంత పనుల్లో జీవన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవమానపరిచేలా పార్టీ పెద్దలు వ్యవహరించారని జీవన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం తమకు తప్పవు వేధింపులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ పెద్దల తీరును జీవన్ రెడ్డి నిరసిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకబూనడంపై పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.1
- బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు. ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్.. రెండవ నిందితుడిగా చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...! 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..! మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు. ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...! ....1
- కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, రాజురా ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డే పాల్గొన్నారు. ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజును సెలవుదినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. శివాజీ స్ఫూర్తితో యువత ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులను సత్కరించారు.1
- Post by Bharath Newz1
- కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1