మోపిదేవి మండలం బండి కోళ్ల లంకలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రజల ముంగిట వద్దకే సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని పలువురు టిడిపి నేతలు పేర్కొన్నారు. మంగళవారం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ పంచాయతీ శివారు బండిమోపిదేవిb కోళ్ల లంక లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రావి రత్న గిరి మాట్లాడుతూ రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన కాలంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను నూరు శాతం అమలపరిచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఇంటింటికి వెళ్లి పార్టీ నాయకులు రెండు సంవత్సరాలు కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలను అవగాహన కల్పించారు. మాజీ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, పిఎసిఎస్ అధ్యక్షులు బల్ల సీతారామ ప్రసాద్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, టిడిపి బీసీ నాయకులు పీత కనకయ్య, కోట సాయికృష్ణ తదితరులు ఉన్నారు.
మోపిదేవి మండలం బండి కోళ్ల లంకలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రజల ముంగిట వద్దకే సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని పలువురు టిడిపి నేతలు పేర్కొన్నారు. మంగళవారం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ పంచాయతీ శివారు బండిమోపిదేవిb కోళ్ల లంక లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రావి రత్న గిరి మాట్లాడుతూ రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన కాలంలో ఎన్నికలలో
ఇచ్చిన హామీలను నూరు శాతం అమలపరిచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఇంటింటికి వెళ్లి పార్టీ నాయకులు రెండు సంవత్సరాలు కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలను అవగాహన కల్పించారు. మాజీ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, పిఎసిఎస్ అధ్యక్షులు బల్ల సీతారామ ప్రసాద్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, టిడిపి బీసీ నాయకులు పీత కనకయ్య, కోట సాయికృష్ణ తదితరులు ఉన్నారు.
- రెడ్డి, చౌదరి అనేది కులం కాదు రెడ్డి చౌదరి అనేది కులం కాదు అది పూర్వకాలంలో పన్నులు వసూలు చేసే వారి పేర్లు.ఈ రోజుల్లో రెడ్డి, చౌదరి అని కుల సంఘాలు పెట్టుకొని ఇతరులను చిన్నచూపు చూస్తూ వారి జ్ఞానవంతులని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఈ అజ్ఞానాన్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరు రెడ్డి, చౌదరి తమ పిల్లలకు పేర్లు పెట్టాలి.1
- జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.1
- శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది. రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.1
- ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---2
- విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు. నేలకొండపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్ఐ మధు తదితరులు పాల్గొన్నారు.1
- జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పాదయాత్రకు భారీ సంఘీభావం | కారేపల్లిలో ప్రజా సంఘాల మద్దతు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రకు కారేపల్లిలో అడుగడుగునా సంఘీభావం లభించింది. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను మొదలుపెట్టారు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, అంబేద్కర్ యువజన సంఘం, ఆటో యూనియన్ తదితర సంఘాల నాయకులు పాదయాత్రలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో ఇస్తాం.. ఇదిగో చేస్తాం అంటూ హామీలు ఇవ్వడమే తప్ప, ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల కనీస అవసరమైన సొంత ఇంటి స్థలం సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విలేకరి హల్ చల్-టాయ్ పిస్టల్ తో బెదిరింపులు అక్షరం ముక్క రాదు.. కానీ చేతిలో అక్రిడిటేషన్ కార్డు ఉంది. చికెన్ షాపులో పని చేసే వ్యక్తి విలేకరి అవతారం ఎత్తి మైలవరంలో హల్ చల్ చేస్తున్నాడు. అతడే కుంభ గోవింద్ అలియాస్ వజ్రం. అసలేం జరిగింది? ఈ నెల 5వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు మైలవరంలో తనిఖీలు చేశారు. సాధారణంగా విలేకరి అయితే ఫోటోలు తీస్తాడు. కానీ ఈ గోవింద్ మాత్రం అధికారుల పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఇప్పుడు వైరల్ అవుతోంది. అధికారులు వెళ్లిపోగానే అసలు కథ మొదలైంది. హోటళ్లు, షాపుల యజమానుల దగ్గరకు వెళ్లి కేసులు కాకూడదంటే డబ్బులు ఇవ్వండి అంటూ అక్రిడిటేషన్ కార్డు చూపుతూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు. కారులో టాయ్ పిస్టల్ : బాధిత హోటల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కారును నున్న వద్ద గుర్తించారు. కారులో సోదా చేయగా అచ్చం నిజమైన పిస్టల్ ను పోలిన టాయ్ పిస్టల్ బయటపడింది.ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.1
- కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు.బండమీది తండాకు చెందిన భూక్యా మంగ్యా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 21 న నిందితులు తాళం పగులగొట్టి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.చోరీ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన కిన్నెర మధు,ముదిగొండ వెంకన్నను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీ చేసిన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కూసుమంచి సీఐ సంజీవ్ తెలిపారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు... పెరిగిన పత్తి ధర ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,975, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.25, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి మాత్రం రూ.200 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.1