Shuru
Apke Nagar Ki App…
ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---
Ramugowd Matta
ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---
- Ramugowd Mattaఆత్రేయపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్అందరికి ధన్యవాదములు అన్నయ్యలు!దయచేసి ఈ వార్తను అందరికి సేర్ చెయ్యండి.మా గ్రామ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం 🙏8 hrs ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి..................... భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 20.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 23 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,45,344 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. వర్షాలు, ఎగువ ప్రవాహాలు కొనసాగితే సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.1
- సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక సాకేతపురి దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా . ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రము , ఆకుపూజ హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని,కోరిని కోర్కెలు తీర్చే ఇష్టదైవమని ఆయనకు తమలపాకు దండ, సింధూరం సమర్పించిన ఎలాంటి కష్టాలు దరిచేరవుఅని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది అని అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ,ఈ ఆలయ కేంద్రం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆలయ ఎప్పుడు నిర్మాణానికి భక్తులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ధన రూపేనా, వస్తురూపేనా సహాయ సహకారాలు అందించి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు .ఈ కార్యక్రమంలో భక్తులు ,మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు4
- *దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు* *ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):* ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు: సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- ఆప్యాతలు కొలువైనను గడ్డ శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి గడ్డపై ఇలాంటి రోజు వస్తుంది అని ఎవరైనా అనుకున్నారా..... ??? తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష రాముడు నడయాడిన భద్రాద్రి నేలపై న్యాయం కోసం ఆడబిడ్డ ఆవేదన తల్లి దండ్రుల కుటుంబ వివాదంలో తనను దూరం చేశారంటూ కూతురి ఆవేదన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారిన మహిళ నిరసన భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారింది. తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదులుకున్న శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి నేలపై, తన తండ్రి ప్రేమ కోసం ఓ ఆడబిడ్డ న్యాయం కోరుతూ దీక్షకు కూర్చోవడం పలువురిని కలచివేస్తోంది. దీక్షకు కూర్చున్న మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తనను తండ్రి దూరం చేశారని ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో మాట్లాడి విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై తీవ్ర ఆరోపణలు తన తల్లి దాంపత్య జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొందని కూతురు ఆరోపించింది. భర్త తన తల్లిని మానసికంగా వేధించడంతో పాటు, ఆమెను ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో చేర్పించారని తెలిపింది. అయితే తనకు ఎలాంటి మానసిక సమస్య లేదని నిరూపించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొంది. కొన్నేళ్లుగా తన తల్లిని భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం దీక్ష తమ సమస్యను పలువురి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని బాధితురాలు వాపోయింది. ప్రభావశీల వ్యక్తుల అండదండలు ఉండటంతో ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది. తండ్రి ప్రేమ కోసం కూతురు రోడ్డుపై దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కుటుంబం వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇరువర్గాల వాదనలు పూర్తిస్థాయిలో తెలుసుకొని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. రాముడు నడయాడిన నేలపై.. తండ్రి ప్రేమ కోసం కూతురి కన్నీటి పోరాటం.1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విలేకరి హల్ చల్-టాయ్ పిస్టల్ తో బెదిరింపులు అక్షరం ముక్క రాదు.. కానీ చేతిలో అక్రిడిటేషన్ కార్డు ఉంది. చికెన్ షాపులో పని చేసే వ్యక్తి విలేకరి అవతారం ఎత్తి మైలవరంలో హల్ చల్ చేస్తున్నాడు. అతడే కుంభ గోవింద్ అలియాస్ వజ్రం. అసలేం జరిగింది? ఈ నెల 5వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు మైలవరంలో తనిఖీలు చేశారు. సాధారణంగా విలేకరి అయితే ఫోటోలు తీస్తాడు. కానీ ఈ గోవింద్ మాత్రం అధికారుల పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఇప్పుడు వైరల్ అవుతోంది. అధికారులు వెళ్లిపోగానే అసలు కథ మొదలైంది. హోటళ్లు, షాపుల యజమానుల దగ్గరకు వెళ్లి కేసులు కాకూడదంటే డబ్బులు ఇవ్వండి అంటూ అక్రిడిటేషన్ కార్డు చూపుతూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు. కారులో టాయ్ పిస్టల్ : బాధిత హోటల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కారును నున్న వద్ద గుర్తించారు. కారులో సోదా చేయగా అచ్చం నిజమైన పిస్టల్ ను పోలిన టాయ్ పిస్టల్ బయటపడింది.ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.1
- భద్రాచలం: తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ దీక్ష.. న్యాయం కోసం కూతురి పోరాటం... భద్రాచలం: తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చ నీయాంశంగా మారింది. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తన తండ్రి తనను దూరం చేశారని దీక్షకు దిగిన మహిళ ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిని కూడా భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని ఆరోపించింది. కుటుంబ సమస్యపై పలువురిని ఆశ్రయించినా న్యాయం జరగలేదని, ప్రభావశీలుల అండదండల కారణంగా తమకు న్యాయం దక్కడం లేదని పేర్కొంది. దీంతో న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది. అధికారులు స్పందించి ఇరువర్గాల వాదనలు విని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- భద్రాచలం: మూడు నెలలుగా వెలగని వీధిలైట్లు............. భద్రాచలం: రాజీవ్‌నగర్ కాలనీ మొదటి లైన్‌లో (రూపా స్కూల్ వెనుక సందు) మూడు నెలలుగా వీధిలైట్లు వెలగడం లేదు. దీంతో రాత్రివేళ ప్రాంతమంతా అంధకారంలో మగ్గుతోంది. ట్యూషన్ల నుంచి వచ్చే విద్యార్థులు, ఉద్యోగాల నుంచి ఇళ్లకు చేరే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. చీకటితో ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాల భయం నెలకొంది. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. వీధిలైట్లు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.1
- సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. దీనితోసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో బత్తలపల్లిలో విషాదం నెలకొంది టీచర్స్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. శ్రీశైలంలో ఓ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు.మృతుల్లో అన్న సుధాకర్, నలుగురు చెల్లెళ్లలో మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి ఉన్నారు. 14 ఏళ్ల బాలుడు మణి కూడా మృతి, మణి మల్లేశ్వరి కుమారుడిగా సమాచారం1