*దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు* *ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):* ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు: సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు* *ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):* ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’
మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు: సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే
ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఈ
సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విలేకరి హల్ చల్-టాయ్ పిస్టల్ తో బెదిరింపులు అక్షరం ముక్క రాదు.. కానీ చేతిలో అక్రిడిటేషన్ కార్డు ఉంది. చికెన్ షాపులో పని చేసే వ్యక్తి విలేకరి అవతారం ఎత్తి మైలవరంలో హల్ చల్ చేస్తున్నాడు. అతడే కుంభ గోవింద్ అలియాస్ వజ్రం. అసలేం జరిగింది? ఈ నెల 5వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు మైలవరంలో తనిఖీలు చేశారు. సాధారణంగా విలేకరి అయితే ఫోటోలు తీస్తాడు. కానీ ఈ గోవింద్ మాత్రం అధికారుల పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఇప్పుడు వైరల్ అవుతోంది. అధికారులు వెళ్లిపోగానే అసలు కథ మొదలైంది. హోటళ్లు, షాపుల యజమానుల దగ్గరకు వెళ్లి కేసులు కాకూడదంటే డబ్బులు ఇవ్వండి అంటూ అక్రిడిటేషన్ కార్డు చూపుతూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు. కారులో టాయ్ పిస్టల్ : బాధిత హోటల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కారును నున్న వద్ద గుర్తించారు. కారులో సోదా చేయగా అచ్చం నిజమైన పిస్టల్ ను పోలిన టాయ్ పిస్టల్ బయటపడింది.ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.1
- విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు. నేలకొండపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్ఐ మధు తదితరులు పాల్గొన్నారు.1
- జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పాదయాత్రకు భారీ సంఘీభావం | కారేపల్లిలో ప్రజా సంఘాల మద్దతు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రకు కారేపల్లిలో అడుగడుగునా సంఘీభావం లభించింది. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను మొదలుపెట్టారు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, అంబేద్కర్ యువజన సంఘం, ఆటో యూనియన్ తదితర సంఘాల నాయకులు పాదయాత్రలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో ఇస్తాం.. ఇదిగో చేస్తాం అంటూ హామీలు ఇవ్వడమే తప్ప, ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల కనీస అవసరమైన సొంత ఇంటి స్థలం సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు... పెరిగిన పత్తి ధర ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,975, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.25, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి మాత్రం రూ.200 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.1
- తిరుమలాయపాలెం ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించన తిప్పరెడ్డి గూడెం రైతులు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తిప్పరెడ్డి గూడెం దళిత రైతులు ఈ రోజు సిపిఐంల్ న్యూ డెమోక్రసి పార్టీ అధ్యరలో ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించినరు. 128సర్వ్ నెంబర్ లో14ఎకరాల20కుంటాలపేదల భూమి లో సీతారామ ప్రజక్ట్ కాలువలు తవ్వి పేదలకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ అది ప్రభత్వ భూమి అని తప్పుడు పత్రాలు,పోర్జరి సంతకాలు సూపించి పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు 50 సంవత్సరాలుగా సేద్యంలో ఉంటూన్న రైతులనుగత ఆరు సంవత్సరాల నుంచి సీతారామ కాలవ పేరుతో పేదల భూములు లాక్కొని ఆ పేదల భూముల్లో కాలువల తవ్వి ఆనాటి ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వ భూమి గా చూపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిప్పారెడ్డి గూడెం రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం అందేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపినారు.1
- హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం.................. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.1
- కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు.బండమీది తండాకు చెందిన భూక్యా మంగ్యా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 21 న నిందితులు తాళం పగులగొట్టి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.చోరీ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన కిన్నెర మధు,ముదిగొండ వెంకన్నను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీ చేసిన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కూసుమంచి సీఐ సంజీవ్ తెలిపారు.1
- సారు.. పింఛను ఇప్పించండి..?* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సెంటర్:- అశ్వారావుపేట* *స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?* *యాంకర్ వాయిస్:* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. *వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది. *వాయిస్* నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది. ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది. *వాయిస్* కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు. *వాయిస్* నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. *వాయిస్ ఓవర్* నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..1
- భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి..................... భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 20.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 23 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,45,344 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. వర్షాలు, ఎగువ ప్రవాహాలు కొనసాగితే సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.1