-టేకులగూడెం లో ఘణ నాధుని దగ్గర అన్నదాన కార్యక్రమం. -దాతలు కుర్సం మధుసుదన్ వి.ఆర్.ఓ -అనసూర్య కుటుంబం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక గణనాథుడు కొలువు తిరడం జరిగింది.గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయకుడు ప్రతిష్టకోవడం ఎంతో సంతోషంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఇలా ప్రతిష్టించుకుని ఐదు రోజుల వరకు పూజలు నిర్వహిస్తామని ఎంతో భక్తి శ్రద్దలతో, భజనలతో నిర్వహిస్తామని ఆలయ కమిటీ వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఏటా ఒక కుటుంబం అన్నదానం చేస్తున్నారని వారు అన్నారు. ఈ సంవత్సరం గ్రామం లో నివసిస్తున్న వి.ఆ.ర్.ఓ గా పనిచేస్తున్న కుర్సం మధుసూదన్ రావు -అనసూర్య దంపతులు ఈ సారి అన్నదానం కార్యక్రమనికి సహకరించడం జరిగిందిని సహకరించిన వారి కుటుంబం వరసిద్ధి గణనాధుని ఆశీస్సులు వారి కుటుంబంపై మెండుగ ఉండాలని వేడుకున్నారు.ఎంతో సంతోషంగా నిర్వహించిన ఈ అన్నదాన సంతర్పణం లో గ్రామంలోని భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో పూజారి వాసం లక్ష్మణ్ రావు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ వాసం ఆనందరావు,గ్రామ సర్పంచ్ చిడెం బాలకృష్ణ, కోడె రవి,ఆలయ యూత్ కమిటీ వాసం పవన్,పూనెం సందీప్,వాసం శ్రీకాంత్, కుర్సం వంశీ, వాసం తరుణ్ కుమార్, కోడె రవి, పాయం సర్వేష్, అన్నదానం చేసిన దాతలు కుర్సం మధుసూదన్ రావు - అనసూర్య,గ్రామస్థులు పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
-టేకులగూడెం లో ఘణ నాధుని దగ్గర అన్నదాన కార్యక్రమం.
-దాతలు కుర్సం మధుసుదన్ వి.ఆర్.ఓ -అనసూర్య కుటుంబం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక గణనాథుడు కొలువు తిరడం జరిగింది.గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయకుడు ప్రతిష్టకోవడం ఎంతో సంతోషంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఇలా ప్రతిష్టించుకుని ఐదు రోజుల వరకు పూజలు నిర్వహిస్తామని ఎంతో భక్తి శ్రద్దలతో, భజనలతో నిర్వహిస్తామని ఆలయ కమిటీ వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అన్నదాన కార్యక్రమము
నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఏటా ఒక కుటుంబం అన్నదానం చేస్తున్నారని వారు అన్నారు. ఈ సంవత్సరం గ్రామం లో నివసిస్తున్న వి.ఆ.ర్.ఓ గా పనిచేస్తున్న కుర్సం మధుసూదన్ రావు -అనసూర్య దంపతులు ఈ సారి అన్నదానం కార్యక్రమనికి సహకరించడం జరిగిందిని సహకరించిన వారి కుటుంబం వరసిద్ధి గణనాధుని ఆశీస్సులు వారి కుటుంబంపై మెండుగ ఉండాలని వేడుకున్నారు.ఎంతో సంతోషంగా నిర్వహించిన ఈ అన్నదాన సంతర్పణం లో గ్రామంలోని భక్తులందరూ కూడా
పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో పూజారి వాసం లక్ష్మణ్ రావు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ వాసం ఆనందరావు,గ్రామ సర్పంచ్ చిడెం బాలకృష్ణ, కోడె రవి,ఆలయ యూత్ కమిటీ వాసం పవన్,పూనెం సందీప్,వాసం శ్రీకాంత్, కుర్సం వంశీ, వాసం తరుణ్ కుమార్, కోడె రవి, పాయం సర్వేష్, అన్నదానం చేసిన దాతలు కుర్సం మధుసూదన్ రావు - అనసూర్య,గ్రామస్థులు పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
- NSUI ఆధ్వర్యంలో ఖనిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖని రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఆనాడు సామాన్య ప్రజలు ప్రజా చైతన్యంతో సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా పోరాటానికి మద్దతుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిర్వహించిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గం సుగమం కావడం చారిత్రక పరిణామమని అన్నారు. ఈ ప్రజా పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన పరిణామమని మెంటం ఉదయ్ రాజ్ పేర్కొన్నారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దు: మెంటం ఉదయ్ రాజ్ తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను కొందరు బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెంటం ఉదయ్ రాజ్ విమర్శించారు. సెప్టెంబర్ 17నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో నిర్వహించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని,దేశ స్వాతంత్ర సమయంలోనే హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్వామి రామానంద తీర్థ గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన ప్రముఖ పోరాట యోధులని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో బీజేపీకి చెందిన నాయకుల పాత్రను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల చరిత్రను మతపరమైన, రాజకీయ విభజనలకు ఉపయోగించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, NSUI నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- fabo dry cleaning rising sun school kotha wada warangal 1.dry cleaning 2 wash&steam iron for kg(120)only 3.wash&flod 4. 1ps shirt 👕 100/- 5. 1ps pant 👖 100/- 6.only iran 30/- callme : 8523042635 haryana maa adrass rising sun high school offizet1
- గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* *కురవి:* గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో *మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో* భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి సత్యవతి రాథోడ్ గారు పాలాభిషేకం నిర్వహించారు* అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...* *“గిరిజనుల ఆరాధ్య దైవం మాజీ సీఎం కేసీఆర్ గారు* గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది *విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు* గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ గారి పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. *కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి *దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది* కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు1
- ఘనంగా ప్రజా పాలన దినోత్సవం జాతీయ జెండాఎగరసిన విప్ రామ చంద్రు నాయక్. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనానాన్ని స్వీకరించిన ప్రభుత్వ విప్ డాక్ట ర్ రామ చంద్రు నాయక్. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో కృషి చేస్తుందని జిల్లాలో 1 వేయి 44 పాఠశాలలో 94 973 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. నెల్లికుదురు, నరసింహుల పేట లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా ఎంపిక చేసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. గూడూరు మండలం ముదిగొండ కురవి మండలం అయ్యగారిపళ్లి గ్రామాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి అన్నారు. ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 3 వేల 685 ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేసీ రాష్ట్రంలోనే నాలుగవ స్థానాన్ని మహిపాల్ జిల్లా సాధించడం అభినందించదగ్గ విషయం అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 2026... 27 వానాకాలం సీజన్ కు గాను 214,625 మంది కి 268 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పథకం ద్వారా 770 మంది మృతి చెందిన రైతులకు 38 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ స్నేహా శభరీష్ , జిల్లా ఎస్పీ శభరీష్ , జిల్లా అధికారులు , పుర ప్రముఖులు.1
- ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు1
- Amjed, ullah khan spokesman Mbt.. Joined Teenmar mallana padayatra Amjed, ullah khan spokesman Mbt.. Joined Teenmar mallana padayatra Relare rela ganga joined padayatre1
- ప్రభుత్వ విప్ ,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్రు నాయక్ కి తప్పిన ప్రమాదం. ఎమ్మెల్యే వాహనం లో పవర్ బ్యాoక్ పేలి కారు క్యాబిన్ లో మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్., కారు మంటలను నుంచి బయటపడిన ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, సిబ్బంది.. మహబూబాబాద్ లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వస్తుండగా చింత పల్లి శివారులో సంఘటన డ్రైవర్ కి స్వల్ప గాయాలు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. మరో వాహనంలో మహబూబాబాద్ కి పయనం అయినా ఎమ్మెల్యే.. మహబూబాబాద్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్...1
- 56వ డివిజన్‌లో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు శ్రీకారం : మేయర్ మహంకాళి స్వామి రామగుండం నగరపాలక ఏరియాలోనీ స్థానిక 56వ డివిజన్‌లో ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొమ్ము స్వప్న–వేణు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో UGD పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఎల్లయ్య గారు హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ, నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన డ్రైనేజీ, రహదారులు, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- *తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం.!* *బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!* తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది... దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.! ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న... బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,.. నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది.. మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.! సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!1