logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

56వ డివిజన్‌లో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు శ్రీకారం : మేయర్ మహంకాళి స్వామి రామగుండం నగరపాలక ఏరియాలోనీ స్థానిక 56వ డివిజన్‌లో ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొమ్ము స్వప్న–వేణు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో UGD పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఎల్లయ్య గారు హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ, నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన డ్రైనేజీ, రహదారులు, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

4 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
4 hrs ago

56వ డివిజన్‌లో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు శ్రీకారం : మేయర్ మహంకాళి స్వామి రామగుండం నగరపాలక ఏరియాలోనీ స్థానిక 56వ డివిజన్‌లో ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న UGD (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొమ్ము స్వప్న–వేణు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో UGD పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ శ్రీ మహంకాళి స్వామి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ ఎల్లయ్య గారు హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ, నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన డ్రైనేజీ, రహదారులు, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ధర్మపురి పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి ప్రత్యేక పూజలు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో గల విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 15న స్థానిక విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చివరి రోజు స్థాపిత మండపారాధన... విశ్వకర్మ హోమం... పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.శ్రీ లలిత సహస్రనామ దేవి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకొని వెళ్లి స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ధర్మపురి పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి ప్రత్యేక పూజలు 
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో గల విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 15న స్థానిక విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చివరి రోజు స్థాపిత మండపారాధన... విశ్వకర్మ హోమం... పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.శ్రీ లలిత సహస్రనామ దేవి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకొని వెళ్లి స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_కర్ణాల నాగరాజు
    కర్ణాల నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ, అన్నదానం.. కార్యక్రమంలో పాల్గొన్న : మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్లా వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
    1
    జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ, అన్నదానం.. కార్యక్రమంలో  పాల్గొన్న : మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్లా వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    48 min ago
  • తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాo సుంకరి సంపత్ అల్ ఇండియా అగ్రికల్చర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, భూస్వామ్య విధానానికి, జామిందార్లకు, జాగిర్దారులకు, వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాడు 10 లక్షల ఎకరాల భూమిని పంచిందని, పదివేల గ్రామాలకు విస్తరించి నాలుగు వేల గ్రామ రాజ్యలను ఏర్పాటు చేసింది . ప్రపంచ చరిత్రలో గుర్తింపు పొందిన ఈ పోరాటాన్ని వక్రీకరించాలని బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుంది. ఈ పోరాటానికి సంబంధం లేని సంస్థలు రాజకీయ పార్టీలు ఈ పోరాటాన్ని విశ్లేషిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఆంధ్ర మహాసభ పేరుతో ఏర్పడ సంస్థ భాష సంస్కృతిక రంగాలకు విస్తరించి నాటి నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుషానికి వ్యతిరేకంగా సంఘం పెట్టి ఎర్రజెండా నాయకత్వన వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసింది ఈ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాల్ని అర్పించారని పేదల రాజ్యం రావాలని భూస్వాముల పెట్టుబడిదారుల గుండెల్లో గుణపాలు దింపింది ఈ పోరాటం అని గుర్తు చేశారు. దీని స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు కార్మికులు సంస్థలు అనేక ప్రజా ఉద్యమాల్ని నడిపాయని గుర్తు చేశారు. ఈ పోరాటాన్ని తట్టుకోలేక నిజాం ప్రభువు ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో చేతులు కలిపి హైదరాబాద్ సంస్థనాన్ని ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో విలీనం చేశారు. ఈ విలీనం అనంతరం కమ్యూనిస్టు పార్టీలపైన సాయుధ పోరాటం నడిపిన కార్యకర్తల పైన రెండు సంవత్సరాల పాటు నెహ్రు సైన్యాలు నిర్బంధాన్ని ప్రయోగించి వేలాది మందిని జైల్లో పెట్టింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను గ్రామాలలో ఎక్కడికక్కడ కాల్పులు జరిపి చంపించారని గుర్తు చేశారు. ఇంత వీరోచితంగా స్థాయినటువంటి ఈ పోరాటాన్ని బిజెపి ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లిం వ్యతిరేక పోరాటంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తుంది. నిజాం ప్రభువు ముస్లిం, గ్రామాలలో జమీందారులుగా జాగిర్ధాలుగా విసునూరు రామచంద్రారెడ్డి లాంటి నరహంతకులు ప్రజలను హింసించారు. ఈ పోరాటంలో జమీందారులకు జాగిర్దారులకు వ్యతిరేకంగా షేక్ బంధకి, మొగ్ధం మోయినవుద్దీన్, అశ్వవుల్లా ఖాన్, సోయబుల్లాఖాన్, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, అనభేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతి రెడ్డి బద్దం ఎల్లారెడ్డి చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య తాను నాయక్, ఆరుట్ల కమలాదేవి. లాంటి ఎందరో వీరులు కులానికి, మతానికి ప్రాంతానికి ,వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగిన ఒక వర్గ పోరాటం అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో పేద ప్రజలందరికీ ఇండ్లు ఇళ్లస్థలాల కోసం , నిరుపేదలకు భూములు పంచాలని డిమాండ్ తో రానున్న కాలంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సంఘం నాయకులు ఈ వెంకటేష్, బాలరాజు, సాగర్ రాజు ,తదితరులు పాల్గొన్నారు...
    2
    తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాo సుంకరి సంపత్ అల్ ఇండియా అగ్రికల్చర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, భూస్వామ్య విధానానికి, జామిందార్లకు, జాగిర్దారులకు, వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాడు 10 లక్షల ఎకరాల భూమిని పంచిందని, పదివేల గ్రామాలకు విస్తరించి నాలుగు వేల గ్రామ రాజ్యలను ఏర్పాటు చేసింది . ప్రపంచ చరిత్రలో గుర్తింపు పొందిన ఈ పోరాటాన్ని వక్రీకరించాలని బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుంది. ఈ పోరాటానికి సంబంధం లేని సంస్థలు రాజకీయ పార్టీలు ఈ పోరాటాన్ని విశ్లేషిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఆంధ్ర మహాసభ పేరుతో ఏర్పడ సంస్థ భాష సంస్కృతిక రంగాలకు విస్తరించి నాటి నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుషానికి వ్యతిరేకంగా సంఘం పెట్టి ఎర్రజెండా నాయకత్వన వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసింది ఈ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాల్ని అర్పించారని పేదల రాజ్యం రావాలని భూస్వాముల పెట్టుబడిదారుల గుండెల్లో గుణపాలు దింపింది ఈ పోరాటం అని గుర్తు చేశారు. దీని స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు కార్మికులు సంస్థలు అనేక ప్రజా ఉద్యమాల్ని నడిపాయని గుర్తు చేశారు. ఈ పోరాటాన్ని తట్టుకోలేక నిజాం ప్రభువు ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో చేతులు కలిపి హైదరాబాద్ సంస్థనాన్ని ఇండియన్  యూనియన్ గవర్నమెంట్ లో విలీనం చేశారు.  ఈ విలీనం అనంతరం కమ్యూనిస్టు పార్టీలపైన సాయుధ పోరాటం నడిపిన కార్యకర్తల పైన రెండు సంవత్సరాల పాటు నెహ్రు సైన్యాలు నిర్బంధాన్ని ప్రయోగించి వేలాది మందిని జైల్లో పెట్టింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను గ్రామాలలో ఎక్కడికక్కడ కాల్పులు జరిపి చంపించారని గుర్తు చేశారు.  
ఇంత వీరోచితంగా స్థాయినటువంటి ఈ పోరాటాన్ని బిజెపి ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లిం వ్యతిరేక పోరాటంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తుంది. నిజాం ప్రభువు ముస్లిం, గ్రామాలలో జమీందారులుగా జాగిర్ధాలుగా విసునూరు రామచంద్రారెడ్డి లాంటి నరహంతకులు  ప్రజలను హింసించారు.
ఈ పోరాటంలో జమీందారులకు జాగిర్దారులకు వ్యతిరేకంగా షేక్ బంధకి, మొగ్ధం మోయినవుద్దీన్, అశ్వవుల్లా ఖాన్,  సోయబుల్లాఖాన్, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, అనభేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతి రెడ్డి బద్దం  ఎల్లారెడ్డి చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య తాను నాయక్, ఆరుట్ల కమలాదేవి. లాంటి ఎందరో వీరులు కులానికి, మతానికి ప్రాంతానికి ,వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగిన ఒక వర్గ పోరాటం అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో పేద ప్రజలందరికీ ఇండ్లు ఇళ్లస్థలాల కోసం , నిరుపేదలకు భూములు పంచాలని డిమాండ్ తో రానున్న కాలంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సంఘం నాయకులు ఈ వెంకటేష్, బాలరాజు, సాగర్ రాజు ,తదితరులు పాల్గొన్నారు...
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షా... కాంగ్రెస్ పాలన నైజామ్ ను తలపిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ పదేళ్ళు తెలంగాణ లో కెసిఆర్ బంగారు పాలన సాగిస్తే, రేవంత్ రెడ్డి పాలన నిజాం పాలనను తలపిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల తెలంగాణ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ను జీవన్ రెడ్డి ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించిన తెలంగాణ ప్రదాత కెసిఆర్ అని కొనియాడారు. పదవులు తృణ ప్రాయంగా త్యాగం చేసి, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, గిరిజనులకు 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. తెలంగాణ్ రాష్ట్ర భవిషత్ కేసీఆర్ అని, కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం స్పూర్తి తో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని సాధించుకున్న తెలంగాణ పరుల పాలు కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
    2
    తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షా... కాంగ్రెస్ పాలన నైజామ్ ను తలపిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ
పదేళ్ళు తెలంగాణ లో కెసిఆర్ బంగారు పాలన సాగిస్తే,  రేవంత్ రెడ్డి పాలన నిజాం పాలనను తలపిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు.
జగిత్యాల తెలంగాణ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ను జీవన్ రెడ్డి ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించిన తెలంగాణ ప్రదాత కెసిఆర్ అని కొనియాడారు.
పదవులు తృణ ప్రాయంగా త్యాగం చేసి, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, గిరిజనులకు 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. తెలంగాణ్ రాష్ట్ర భవిషత్ కేసీఆర్ అని, కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం స్పూర్తి తో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని సాధించుకున్న తెలంగాణ పరుల పాలు కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    43 min ago
  • ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    1
    ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్
కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు
ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు
జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • వార్డులో పర్యటించి వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి
    1
    వార్డులో పర్యటించి వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • బండి సంజయ్‌కు బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం: మాజీ సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఎందుకు విచారణ జరపడం లేదని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తీవ్రంగా నిలదీశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బాగోతాన్ని బట్టబయలు చేస్తుంటే ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, కరీంనగర్ అభివృద్ధి అంతా కేంద్రమంత్రే చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మంచి జరిగితే బీజేపీ ఖాతాలో వేసుకుంటూ, చెడు జరిగితే ఆ నెపాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రుద్దుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
    4
    బండి సంజయ్‌కు బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం: మాజీ సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఎందుకు విచారణ జరపడం లేదని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తీవ్రంగా నిలదీశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బాగోతాన్ని బట్టబయలు చేస్తుంటే ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, కరీంనగర్ అభివృద్ధి అంతా కేంద్రమంత్రే చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మంచి జరిగితే బీజేపీ ఖాతాలో వేసుకుంటూ, చెడు జరిగితే ఆ నెపాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రుద్దుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • వేములవాడ రాజన్న ఆలయ ప్రాశస్త్యంపై ప్రత్యేక పాట- సినీ గేయ రచయిత చంద్రబోస్ వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీ గేయ రచయిత చంద్రబోస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ వేములవాడ రాజన్న మా ఇంటి ఇలవేల్పని, కుమారుడి వివాహం సందర్భంగా మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. 31 ఏళ్ల సినీ ప్రస్థానంలో 880 సినిమాలకు 3,800కు పైగా పాటలు రాశానని తెలిపారు. భగవంతుడి అనుగ్రహంతో వేములవాడ రాజన్న చరిత్రపై పాట రాస్తానని చంద్రబోస్ చెప్పారు. రాజన్న చరిత్ర, విశిష్టత, ప్రాశస్త్యాన్ని చాటేలా సరళమైన భాషలో మధురమైన పాట రాస్తానని తెలిపారు.
    2
    వేములవాడ రాజన్న ఆలయ ప్రాశస్త్యంపై ప్రత్యేక పాట- సినీ గేయ రచయిత చంద్రబోస్
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీ గేయ రచయిత చంద్రబోస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ  వేములవాడ రాజన్న మా ఇంటి ఇలవేల్పని, కుమారుడి వివాహం సందర్భంగా  మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. 31 ఏళ్ల సినీ  ప్రస్థానంలో
880 సినిమాలకు 3,800కు పైగా పాటలు రాశానని తెలిపారు. భగవంతుడి అనుగ్రహంతో వేములవాడ రాజన్న చరిత్రపై పాట రాస్తానని  చంద్రబోస్ చెప్పారు. రాజన్న చరిత్ర, విశిష్టత, ప్రాశస్త్యాన్ని చాటేలా సరళమైన భాషలో మధురమైన పాట రాస్తానని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    51 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.