విద్యే సమాజ అభివృద్ధికి పునాది : ఎమ్మెల్యే వేముల వీరేశం.. నకిరేకల్ నియోజకవర్గo:- ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన విద్యా వారోత్సవాల కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే Vemula Veeresham ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యే సమాజ అభివృద్ధికి మూలాధారమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే గారు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
విద్యే సమాజ అభివృద్ధికి పునాది : ఎమ్మెల్యే వేముల వీరేశం.. నకిరేకల్ నియోజకవర్గo:- ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన విద్యా వారోత్సవాల కార్యక్రమానికి ప్రభుత్వ విప్,
నకిరేకల్ ఎమ్మెల్యే Vemula Veeresham ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యే సమాజ అభివృద్ధికి మూలాధారమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను
సాధించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన
విద్యార్థులకు ఎమ్మెల్యే గారు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.1
- తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ఆలస్యం నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు – “అత్త, కోడలు రావాలి” అంటూ రాస్తారోకోతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. 40 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తొర్రూరు–మహబూబాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ కేంద్రానికి సంబంధించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అత్త (ఝాన్సీ రెడ్డి), కోడలు (యశస్విని రెడ్డి) రావాలి” అంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.1
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.1