Shuru
Apke Nagar Ki App…
రామ్‌కిషన్ శాస్త్రి ఆశయ సాధనకు ఐక్యంగా ముందుకు పోవాలి: ప్రభాకర్ రెడ్డి ADB: ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. CPI జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రామ్‌కిషన్ శాస్త్రి స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్మిక-కర్షక సమస్యలపై పోరాడిన ఘనత శాస్త్రిదేనని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Mallaiah Potta
రామ్‌కిషన్ శాస్త్రి ఆశయ సాధనకు ఐక్యంగా ముందుకు పోవాలి: ప్రభాకర్ రెడ్డి ADB: ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. CPI జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రామ్‌కిషన్ శాస్త్రి స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్మిక-కర్షక సమస్యలపై పోరాడిన ఘనత శాస్త్రిదేనని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- * (ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు):* *2016 దివ్యాంగుల హక్కుల చట్టం పూర్తి అమలు* రాష్ట్రంలో దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీనికై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి. దివ్యాంగులందరికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇళ్లు': సురక్షితమైన నివాసం మరియు ఆత్మగౌరవం కోసం ప్రతి దివ్యాంగుడికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇల్లు' మంజూరు చేయాలి. పెన్షన్ల పెంపు: దివ్యాంగుల పెన్షన్‌ను ₹6,000కు, అలాగే తీవ్ర వైకల్యం కలిగిన వారికి ₹15,000కు తక్షణమే పెంచాలి. బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ: ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. ఉచిత ప్రయాణ సౌకర్యం: ఆర్టీసీ బస్సులతో పాటు హెచ్‌ఎంఆర్ (HMR) మెట్రో రైళ్లలో కూడా దివ్యాంగులందరికీ ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలి. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం ఇవ్వాలి. స్వతంత్ర కార్యాలయాల ఏర్పాటు: జీవో 34 ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దివ్యాంగుల వ్యవహారాల కోసం ప్రత్యేక స్వతంత్ర కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం: దివ్యాంగ విద్యార్థులకు సరైన విద్య అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన (Special Education) ఉపాధ్యాయులను నియమించాలి. సదరమ్ (SADAREM) సేవల మార్పు: రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్థోపెడిక్ సదరన్ క్యాంపులను హైదరాబాద్‌కు మార్చి, దివ్యాంగులకు సేవలను మరింత చేరువ చేయాలి.3
- సీసీఐపై ఎమ్మెల్యే,ఎంపీ స్పందించాలి : టీఏజిఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ ఆదిలాబాద్: సీసీఐ సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. పరిశ్రమ పునరుద్ధరణపై ఎమ్మెల్యే, ఎంపీ వెంటనే స్పందించి అసెంబ్లీ, పార్లమెంట్‌లో చర్చించాలని కోరారు. సీసీఐ సాధన రిలే దీక్షలు మంగళవారం 38వ రోజుకు చేరగా TAGS జిల్లా కమిటీ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి ఆదిలాబాద్ అభివృద్ధికి చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో TAGS జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, కొట్నాక్ సక్కు, పెందూర్ గోవింద్, మెస్రం నగేష్, కుంర దివంజి, కుంరం భీంరావు తదితరులు పాల్గొన్నారు.1
- వాడవాడలా కొలువు తీరిన గణనాథులు.. భక్తుల ప్రత్యేక పూజలు.. నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. వాడవాడలా చిన్న పెద్ద అంతా కలిసి భారీ గణనాథులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మండపాలను విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. అనంతరం భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.1
- టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.1
- *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం** *కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు* *బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్* ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- ముల్కలపేట–రాచర్ల మార్గంలో అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు మరమ్మత్తులు చేపట్టాలని సూచన ముల్కలపేట–రాచర్ల గ్రామాల మధ్య మంగలి ఒర్రెపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తైన కొద్దికాలానికే రహదారిపై పగుళ్లు కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పగుళ్లకు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.1
- రిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బోథ్ MLA అనిల్ జాదవ్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదేశించారు.3
- *నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన * *దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రేస్ ప్రభుత్వాలు* *విఫలమయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు* క్యాంపు కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్, పలువురు నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అణచివేత, బానిసత్వం, అస్తిత్వ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారన్నారు. తెలంగాణ రాష్త్రంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామి ఇచ్చిన బీఆర్ఎస్, కాంగ్రేస్లు... కేవలం ఓ వర్గం ఓట్ల కోసం, వారి మెప్పు కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. 17న ఉదయం ప్రతి బూత్ స్తాయిలో పార్టీ ఆద్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని, *నరేంద్ర మోది 28 యేళ్ల* *సుదీర్ఘ ప్రజా సేవను* *దీవించేలా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా* *సాయంత్రం 7 గంటలకు* *ప్రతి ఇంటి ముందు* *ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు* కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద రాష్ట్ర నాయకులు అశోక్. జిల్లా అధికార ప్రతినిధి. gv రమణ. సుభాష్ శైలేందర్ . రమేష్ అంకత్. శేఖవత్. వెంకటస్వామి. దేవన్న. రాకేష్ తదితరులు పాల్గొన్నారు3
- ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి : శ్రీకాంత్ రెడ్డి తాంసి: మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, ప్రాథమిక విద్యతో పాటు వివిధ సంక్షేమ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, స్పెషల్ ఆఫీసర్ సతీష్ యాదవ్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ గణేష్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1