logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ముల్కలపేట–రాచర్ల మార్గంలో అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు మరమ్మత్తులు చేపట్టాలని సూచన ముల్కలపేట–రాచర్ల గ్రామాల మధ్య మంగలి ఒర్రెపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తైన కొద్దికాలానికే రహదారిపై పగుళ్లు కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పగుళ్లకు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

1 hr ago
user_M S SRIDHAR
M S SRIDHAR
Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
1 hr ago

ముల్కలపేట–రాచర్ల మార్గంలో అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు మరమ్మత్తులు చేపట్టాలని సూచన ముల్కలపేట–రాచర్ల గ్రామాల మధ్య మంగలి ఒర్రెపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తైన కొద్దికాలానికే రహదారిపై పగుళ్లు కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పగుళ్లకు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యం., కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు రామగుండంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుందంటూ కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం అయింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్లో మన సమస్యలపై కమిషనర్కు అర్జీ పెట్టుకున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని వివరణ కోరెందుకురాగా మీతో మాట్లాడేది ఏమీ లేదనీ చెబుతూ అటెండర్ తో బయటికి వెళ్ళగొట్టించారని కార్పొరేటర్ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇన్చార్జి కమిషనర్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ ఇన్చార్జి కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు చేస్తున్న నిరసనలో బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
    1
    ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యం., కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
రామగుండంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుందంటూ కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం అయింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్లో మన సమస్యలపై కమిషనర్కు అర్జీ పెట్టుకున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని వివరణ కోరెందుకురాగా మీతో మాట్లాడేది ఏమీ లేదనీ చెబుతూ అటెండర్ తో బయటికి వెళ్ళగొట్టించారని కార్పొరేటర్ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇన్చార్జి కమిషనర్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ ఇన్చార్జి కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు చేస్తున్న నిరసనలో బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఇదే పైప్‌లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్‌కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు. మేయర్, కమిషనర్‌కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు. అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    1
    కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు.
రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు.
ఇదే పైప్‌లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్‌కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు.
అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు.
మేయర్, కమిషనర్‌కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు.
టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు.
అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • సిరిసిల్లలో పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన. సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.
    1
    సిరిసిల్లలో  పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన.

సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ లో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ పనులకు టెండర్...యూసీఎఫ్ నుండి మరో 80 కోట్లు డంపింగ్ యార్డ్ కు వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ పనులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ స్కీం నిధుల్లో భాగంగా 16 కోట్లతో చేపట్టిన డంపింగ్ యార్డు పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పర్యటించారు. కరీంనగర్ లోని 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ భూమి పూజ చేశారు. 42వ డివిజన్ లోని భగత్ నగర్ మమత థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని పొలాడి ఆనందరావు అపార్ట్ మెంట్ గల్లీలో 50 లక్షల రూపాయల Uidf నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కరీంనగర్ 49వ డివిజన్ లోని భాగ్యనగర్ బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో 50 లక్షల యూఐడిఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ లోని పోచమ్మ కమాన్ సమీపంలో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక శ్రీ గాయత్రి అసోయేషన్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. 13వ డివిజన్ లోని శివనగర్ బైపాస్ రోడ్ సమీపంలోని లారెల్ (Laureal) స్కూల్ వద్ద 75 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మీడియాతో సంజయ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కు సంబంధించి పనులను వేగవంతం చేస్తామన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా మరో 80 కోట్లను డంపింగ్ యార్డ్ పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ లోని ప్రతి డివిజన్ లో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామని, గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
    3
    కరీంనగర్ లో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ పనులకు టెండర్...యూసీఎఫ్ నుండి మరో 80 కోట్లు డంపింగ్ యార్డ్ కు వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి
కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ పనులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ స్కీం నిధుల్లో భాగంగా 16 కోట్లతో చేపట్టిన  డంపింగ్ యార్డు పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పర్యటించారు. కరీంనగర్ లోని 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ భూమి పూజ చేశారు. 42వ డివిజన్ లోని భగత్ నగర్ మమత థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని  పొలాడి ఆనందరావు అపార్ట్ మెంట్ గల్లీలో 50 లక్షల రూపాయల Uidf నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.  అనంతరం కరీంనగర్ 49వ డివిజన్ లోని భాగ్యనగర్ బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో 50 లక్షల యూఐడిఎఫ్ నిధులతో నిర్మించిన  సీసీ రోడ్డు, డ్రెయిన్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ లోని పోచమ్మ కమాన్ సమీపంలో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక శ్రీ గాయత్రి అసోయేషన్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. 13వ డివిజన్ లోని శివనగర్ బైపాస్ రోడ్ సమీపంలోని లారెల్ (Laureal) స్కూల్ వద్ద 75 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన  సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మీడియాతో సంజయ్  మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కు సంబంధించి పనులను వేగవంతం చేస్తామన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా  మరో 80 కోట్లను డంపింగ్ యార్డ్ పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ లోని ప్రతి డివిజన్ లో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామని, గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • *కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళన - పోరాటాలపై పెడుతున్న ఆంక్షలు-నిర్భంధాల ఖండిస్తున్నాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక నిరసన దీక్షలు సందర్భంగా బొమ్మెనసురేష్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి*మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన -పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది సబబు కాదు, 2026 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన అంగన్వాడీ, ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులను సైతం తెల్లవారిఝూము నుండే వేటాడారు, వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు. పోలీసుల ఈ చర్యల మూలంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న సిఐటియు నాయకులను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడమే. రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్భంధం, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 16 జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక దీక్షలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో, *సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు క్లైమెంటు వెస్లీ,ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు, పి సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ సుగుణ, విజయ,నంద ఇంద్రమాల, మౌనిక, కోశాధికారి లక్ష్మి, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు B.లలిత, జిల్లా ఉపాధ్యక్షులు కవిత, భాగ్య,కళ గంగామణి, వనజ,లావణ్య, మద్దతుగా, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసo.శంభు* తదితరులు పాల్గొన్నారు,
    1
    *కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళన - పోరాటాలపై పెడుతున్న ఆంక్షలు-నిర్భంధాల ఖండిస్తున్నాం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక  నిరసన దీక్షలు సందర్భంగా బొమ్మెనసురేష్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి*మాట్లాడుతూ 
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన -పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది సబబు కాదు,
2026 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన అంగన్వాడీ, ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులను సైతం తెల్లవారిఝూము నుండే వేటాడారు, వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు. పోలీసుల ఈ చర్యల మూలంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న సిఐటియు నాయకులను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడమే.
రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్భంధం, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 16 జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక దీక్షలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో, *సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు క్లైమెంటు వెస్లీ,ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు, పి సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ సుగుణ, విజయ,నంద ఇంద్రమాల, మౌనిక, కోశాధికారి లక్ష్మి, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు B.లలిత, జిల్లా ఉపాధ్యక్షులు కవిత, భాగ్య,కళ గంగామణి, వనజ,లావణ్య, మద్దతుగా, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసo.శంభు* తదితరులు పాల్గొన్నారు,
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    1 hr ago
  • శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    1
    శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    23 hrs ago
  • చెన్నూరు: చెత్త సేకరణలో వివక్ష.. ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తుడు చెన్నూరు మండలం అంగరాజుపల్లిలో చెత్త సేకరణ విషయంలో వివక్ష చూపుతున్నారని గ్రామానికి చెందిన తిరుపతి ఆరోపించారు. జనరల్ వార్డు కాలనీలో మాత్రమే చెత్త బండి ద్వారా వ్యర్థాలను సేకరిస్తున్నారని, ఇతర వార్డులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డుల్లోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    చెన్నూరు: చెత్త సేకరణలో వివక్ష.. ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తుడు
చెన్నూరు మండలం అంగరాజుపల్లిలో చెత్త సేకరణ విషయంలో వివక్ష చూపుతున్నారని గ్రామానికి చెందిన తిరుపతి ఆరోపించారు. జనరల్ వార్డు కాలనీలో మాత్రమే చెత్త బండి ద్వారా వ్యర్థాలను సేకరిస్తున్నారని, ఇతర వార్డులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డుల్లోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు,అప్రమత్తంగా విధులు నిర్వహించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ కార్యాలయంలో ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో డీసీపీలు,అడిషనల్ డీసీపీ (అడ్మిన్), ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు,ఎస్‌ఐలు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా పోలీస్ స్టేషన్,డివిజన్,జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ,చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాల్లో కేసుల ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో నమోదైన తీవ్రమైన నేరాలు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు,పోక్సో కేసులు, అదృశ్యమైన వ్యక్తుల కేసులు,గంజాయి కేసులు,రోడ్డు ప్రమాద కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాత కేసుల దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ వారీగా ఆన్‌లైన్‌లో నమోదైన పెండింగ్ అంశాలను సమీక్షించారు. నేరాల నియంత్రణకు అధికారులు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కూడా చర్చించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో చోటుచేసుకునే పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నచిన్న విషయాలు కూడా పోలీసులకు తెలిసే విధంగా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. తీవ్రమైన నేరాలు, పోక్సో,ఎస్సీ,ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికలు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. తీవ్రమైన నేరాలు, యూఐ కేసులపై డీసీపీలు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వారానికోసారి సమీక్షించాలని సూచించారు. ఆస్తి నేరాలు, గొలుసు దొంగతనాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని,సీసీఎస్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో కనిపించే విధంగా పోలీసింగ్, విస్తృతంగా గస్తీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రజలతో సంబంధాలను మరింత పెంచాలని ఆదేశించారు. మహిళలు,బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను నిర్దేశిత కాలపరిమితిలోగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.షీ టీమ్స్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని, వినాయక మండపాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తుతో పాటు కోర్టు కేసుల పరిష్కారంపై కూడా అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసి,నేర నిర్ధారణ శాతాన్ని పెంచేందుకు డీసీపీలు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.కోర్టు కేసుల పురోగతిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను (ఎన్‌బీడబ్ల్యూ) ప్రత్యేక దృష్టితో అమలు చేయాలని ఆదేశించారు. గంజాయి అక్రమ సరఫరా,రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అదృశ్యమైన వ్యక్తుల కేసులను డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.ఆర్థిక నేరాల్లో నేరపూరితంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, చట్టప్రకారం స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. సైబర్ నేర విభాగం పనితీరును పోలీస్ కమిషనర్ అభినందించారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాల్సిన ప్రతి సందర్భంలో తప్పనిసరిగా కేసు నమోదు చేయాలని సూచించారు.డీజీపీ, సీసీసీ పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లను కూడా త్వరితగతిన విచారించాలని, ఫిర్యాదు నిజమని తేలితే కేసు నమోదు చేయాలని,తప్పుడు ఫిర్యాదుల విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్,పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ,మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డితో పాటు ఇతర సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు,ఎస్‌ఐలు పాల్గొన్నారు.
    1
    సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు,అప్రమత్తంగా విధులు నిర్వహించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ కార్యాలయంలో ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో డీసీపీలు,అడిషనల్ డీసీపీ (అడ్మిన్), ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు,ఎస్‌ఐలు పాల్గొన్నారు.
సమావేశంలో ముందుగా పోలీస్ స్టేషన్,డివిజన్,జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ,చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాల్లో కేసుల ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో నమోదైన తీవ్రమైన నేరాలు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు,పోక్సో కేసులు, అదృశ్యమైన వ్యక్తుల కేసులు,గంజాయి కేసులు,రోడ్డు ప్రమాద కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాత కేసుల దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ వారీగా ఆన్‌లైన్‌లో నమోదైన పెండింగ్ అంశాలను సమీక్షించారు. నేరాల నియంత్రణకు అధికారులు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కూడా చర్చించారు.
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో చోటుచేసుకునే పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నచిన్న విషయాలు కూడా పోలీసులకు తెలిసే విధంగా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
తీవ్రమైన నేరాలు, పోక్సో,ఎస్సీ,ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికలు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. తీవ్రమైన నేరాలు, యూఐ కేసులపై డీసీపీలు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వారానికోసారి సమీక్షించాలని సూచించారు.
ఆస్తి నేరాలు, గొలుసు దొంగతనాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని,సీసీఎస్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో కనిపించే విధంగా పోలీసింగ్, విస్తృతంగా గస్తీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రజలతో సంబంధాలను మరింత పెంచాలని ఆదేశించారు.
మహిళలు,బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను నిర్దేశిత కాలపరిమితిలోగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.షీ టీమ్స్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని, వినాయక మండపాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
కేసుల దర్యాప్తుతో పాటు కోర్టు కేసుల పరిష్కారంపై కూడా అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసి,నేర నిర్ధారణ శాతాన్ని పెంచేందుకు డీసీపీలు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.కోర్టు కేసుల పురోగతిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను (ఎన్‌బీడబ్ల్యూ) ప్రత్యేక దృష్టితో అమలు చేయాలని ఆదేశించారు.
గంజాయి అక్రమ సరఫరా,రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అదృశ్యమైన వ్యక్తుల కేసులను డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.ఆర్థిక నేరాల్లో నేరపూరితంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, చట్టప్రకారం స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.
సైబర్ నేర విభాగం పనితీరును పోలీస్ కమిషనర్ అభినందించారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాల్సిన ప్రతి సందర్భంలో తప్పనిసరిగా కేసు నమోదు చేయాలని సూచించారు.డీజీపీ, సీసీసీ పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లను కూడా త్వరితగతిన విచారించాలని, ఫిర్యాదు నిజమని తేలితే కేసు నమోదు చేయాలని,తప్పుడు ఫిర్యాదుల విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్,పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ,మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డితో పాటు ఇతర సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు,ఎస్‌ఐలు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభవార్త చెప్పారు..! డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వచ్ఛ భారత్ పథకం కింద ఇప్పటికే 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యూసీఎఫ్ నిధుల నుంచి మరో 80 కోట్ల రూపాయలను డంపింగ్ యార్డ్ కోసం వెచ్చిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్‌లో 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు. గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.. ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం అని బండి సంజయ్ తెలిపారు. యూసీఎఫ్ కింద కరీంనగర్‌కు మొత్తం 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నామని.. కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌కు టెండర్లు.. యూసీఎఫ్ నుంచి మరో 80 కోట్లు.. కరీంనగర్ అభివృద్ధికి భారీ ప్రణాళిక..!
    3
    కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభవార్త చెప్పారు..!
డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వచ్ఛ భారత్ పథకం కింద ఇప్పటికే 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యూసీఎఫ్ నిధుల నుంచి మరో 80 కోట్ల రూపాయలను డంపింగ్ యార్డ్ కోసం వెచ్చిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు.
కరీంనగర్‌లో 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు.
గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.. ప్రతి డివిజన్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం అని బండి సంజయ్ తెలిపారు.
యూసీఎఫ్ కింద కరీంనగర్‌కు మొత్తం 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.
పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నామని.. కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
డంపింగ్ యార్డ్‌కు టెండర్లు.. యూసీఎఫ్ నుంచి మరో 80 కోట్లు.. కరీంనగర్ అభివృద్ధికి భారీ ప్రణాళిక..!
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.