Shuru
Apke Nagar Ki App…
చెన్నూరు: చెత్త సేకరణలో వివక్ష.. ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తుడు చెన్నూరు మండలం అంగరాజుపల్లిలో చెత్త సేకరణ విషయంలో వివక్ష చూపుతున్నారని గ్రామానికి చెందిన తిరుపతి ఆరోపించారు. జనరల్ వార్డు కాలనీలో మాత్రమే చెత్త బండి ద్వారా వ్యర్థాలను సేకరిస్తున్నారని, ఇతర వార్డులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డుల్లోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
M S SRIDHAR
చెన్నూరు: చెత్త సేకరణలో వివక్ష.. ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తుడు చెన్నూరు మండలం అంగరాజుపల్లిలో చెత్త సేకరణ విషయంలో వివక్ష చూపుతున్నారని గ్రామానికి చెందిన తిరుపతి ఆరోపించారు. జనరల్ వార్డు కాలనీలో మాత్రమే చెత్త బండి ద్వారా వ్యర్థాలను సేకరిస్తున్నారని, ఇతర వార్డులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డుల్లోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- ఇంజనీర్లు పాత్ర కీలకం. ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి రామగుండం పునర్నిర్మాణంలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర కీలకమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది శక్తి కి మించి శ్రమిస్తూ అభివృద్దిలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుత ఇంజినీర్లు చిత్త శుద్దితో సేవలందిస్తూ నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడకుండా మన్నికగా సుదీర్ఘ కాలం నిలిచి ఉండేలా రోడ్లు , కాలువల నిర్మాణం చేపడుతున్నారని అభినందించారు. రామగుండం నగరాన్ని అధ్భుతoగా తీర్చి దిద్దాలనే స్థానిక ఎం ఎల్ ఎ లక్ష్యానికి అనుగుణంగా ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంజనీర్లు పని చేసి పాలవర్గానికి మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్ , ఎ ఇ లు మీర్ , తేజస్విని , సౌమ్య , మనోజ్ , అన్వేష్ , నవీన్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నవీన్ , అశోక్ , కళ్యాణ్ , శ్రావణ్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి కజంపురం రాజేందర్ తో పాటు , నగర పాలక సంస్థ కార్పొరేటర్లు గట్ల రమేష్ , వడ్లూరి రవి , కొలని కవిత , బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్ మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలి… మభ్యపెట్టడం ఆపాలి! హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ యునైటెడ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నాన్ పొలిటికల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో… ప్రభుత్వం రెండుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పి… చివరకు సమస్యను దాటవేయడం మోసపూరిత చర్య అంటూ మండిపడ్డారు. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు తెలంగాణ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్ల కనకరాజు మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌తో పాటు ఆకుల మల్లేశం, తప్పట్ల మల్లేశం, ఎస్కే సలీం, మెట్పల్లి రాజు, లక్ష్మణ్ తదితరులు కరీంనగర్ నుంచి ధర్నాలో పాల్గొన్నారు.1
- వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.3
- నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు. కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.1
- శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.1
- మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 147.53 మీటర్లకు చేరుకుంది. మొత్తం 20.1754 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 18.8695 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 2,959 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీంకు 264 క్యూసెక్కులు, ఎన్టీపీసీ అవసరాలకు 121 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరువవుతోంది.1
- తెలంగాణ సాయుధ పోరాటాన్ని హైజాక్ చేయాలని చూస్తున్న బిజెపి : ఖని లో జరిగిన స్ఫూర్తి సభలో సిపిఐ నేతలు కామ్రేడ్ కలవేని శంకర్, తాండ్ర సదానందం. తెలంగాణ సాయధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని,ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ , జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం లు డిమాండ్ చేశారు. మంగళ వారం స్థానిక మెయిన్ చౌరస్తా లో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభ సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోషిక మోహన్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటానికి సీపీఐ కామ్రేడ్ కలవేన శంకర్, తాండ్ర సదానందం లు పూల మాలలు వేశారు.అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నీ తెలంగాణలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశ పాలన లో మగ్గుతూ అనేక అవస్ధలు పడుతున్నారని నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ,మఖ్దూం మోహియొద్దిన్ లు ఇచ్చిన సాయుధ పోరాట పిలుపునందుకొని నిజాం సేనలతో దొరలు భూస్వాములతో వీరోచితంగా పోరాడి 4500 మంది కమ్యూనిస్టులు అమరులైనారని అన్నారు.తొలి అమరుడు దొడ్డి కొమురయ్య,షేక్ బందగి లాంటి ఎందరో వీరుల రక్తంతో తెలంగాణ గడ్డ ఎరుపెక్కిందని అన్నారు.మూడు వేల గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచారని తెలిపారు.ఇంతటి చారిత్రక పోరాటాన్ని బిజెపి హైజాక్ చేయాలని చూస్తున్నదని, హిందూ ముస్లిం అంటూ మతోన్మాదాన్ని పెంచి పోసిస్తున్నదని విమర్శించారు. కమ్యూనిస్టులు రజాకా ర్లతో చెలిమి చేశారని అబద్ధపు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదని ఆరోపించారు. చరిత్ర తెలియని బిజెపి నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తే చరిత్రహీనులుగా మిగులుతారని వారన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె.కనకరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ తాళ్లపల్లి మల్లయ్య , కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ మాటే టి శంకర్,శనిగరపు చంద్రశేఖర్, ఆసాల రమ , రేణుకుంట్ల ప్రీతం,ఆసాల నవీన్, పడాల కనకరాజు, బూడిద మల్లేష్, అబ్దుల్ కరీం,శనిగరపు తిరుమల,దుబాసి రేణుక , సుధీర్,గుంపుల కుమారస్వామి, కె.జగన్ ,జైపాల్ రెడ్డి,ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.1
- బండ్లగూడలో రౌడీ షీటర్ దారుణ హత్య?* హైదరాబాద్:సెప్టెంబర్ 15 మేడ్చల్ జిల్లా నాగోల్ పోలీసు స్టేషన్ పరిధి లోని బండ్లగూడ ప్రాంతంలో రౌడీ షీటర్ నయీమ్ ను కొంతమంది దుండ గులు సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపారు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణ భయంతో పక్కనే ఉన్న సుప్రీం వైన్స్ లోకి అతను వెళ్లిన దుండగులు వదలలేదు ఆ వైన్స్ లోనే దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. అనంతరం నిందితు లు అక్కడి నుంచి కారులో పరారయ్యా రు. ఈ హత్య గురించి సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నా రు. పరిస్థితిని పరిశీలించి, వివరాలు సేకరించారు. హత్య కు గురైన వ్యక్తిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్ గా పోలీ సులు గుర్తించారు. ఈ హత్యకు పాత కక్షలే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తు న్నామని, నిందితులు ఉపయోగించిన కారు ఆచూకీ కోసం, వారిని పట్టుకునేం దుకు ప్రత్యేక బృం దాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.1
- हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से काटा हैदराबाद: 15 सितंबर मेचल जिले के नागशोल (नागोल) पुलिस स्टेशन के अंतर्गत आने वाले बंडलागुडा इलाके में सोमवार रात कुछ अज्ञात हमलावरों ने एक राउडी शीटर की बेरहमी से हत्या कर दी। मृतक की पहचान भद्राद्री कोठागुडेम जिले के इलेन्दु निवासी राउडी शीटर नईम के रूप में हुई है। पुलिस से मिली जानकारी के अनुसार, हमलावरों से जान बचाकर भागने की कोशिश कर रहा नईम पास ही स्थित 'सुप्रीम वाइन शॉप' के अंदर घुस गया था। लेकिन, बेखौफ हमलावरों ने उसे बख्शा नहीं और वाइन शॉप के अंदर ही धारदार हथियारों से ताबड़तोड़ वार कर उसकी हत्या कर दी। इस सनसनीखेज वारदात को अंजाम देने के बाद आरोपी मौके से एक कार में सवार होकर फरार हो गए। पुरानी रंजिश हो सकती है वजह घटना की सूचना मिलते ही नागगोल पुलिस तुरंत हरकत में आई और मौके पर पहुंचकर स्थिति का जायजा लिया तथा साक्ष्य जुटाए। पुलिस का शुरुआती तौर पर मानना है कि इस हत्या के पीछे पुरानी रंजिश मुख्य कारण हो सकती है। विशेष टीमों का गठन पुलिस ने बताया कि घटनास्थल और आसपास लगे सीसीटीवी कैमरों के फुटेज खंगाले जा रहे हैं। इसके साथ ही, आरोपियों द्वारा इस्तेमाल की गई कार का पता लगाने और फरार हमलावरों को दबोचने के लिए विशेष टीमों (स्पेशल पुलिस टीमों) का गठन कर सघन तलाशी अभियान शुरू कर दिया गया है।1