కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఇదే పైప్‌లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్‌కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు. మేయర్, కమిషనర్‌కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు. అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఇదే పైప్‌లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్‌కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు. మేయర్, కమిషనర్‌కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు. అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
- కరీంనగర్‌లో దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి, దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని తోటలో ఉన్న ఆయన ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, మాజీ ఎమ్మెల్యేలు నాగుల సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్తో పాటు పలువురు ముఖ్య నేతలు పొన్నం సత్తయ్య ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య అందించిన సేవలను నాయకులు, కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. ఆయన ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.4
- కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ లో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ పనులకు టెండర్...యూసీఎఫ్ నుండి మరో 80 కోట్లు డంపింగ్ యార్డ్ కు వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ పనులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ స్కీం నిధుల్లో భాగంగా 16 కోట్లతో చేపట్టిన డంపింగ్ యార్డు పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పర్యటించారు. కరీంనగర్ లోని 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ భూమి పూజ చేశారు. 42వ డివిజన్ లోని భగత్ నగర్ మమత థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని పొలాడి ఆనందరావు అపార్ట్ మెంట్ గల్లీలో 50 లక్షల రూపాయల Uidf నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కరీంనగర్ 49వ డివిజన్ లోని భాగ్యనగర్ బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో 50 లక్షల యూఐడిఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ లోని పోచమ్మ కమాన్ సమీపంలో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక శ్రీ గాయత్రి అసోయేషన్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. 13వ డివిజన్ లోని శివనగర్ బైపాస్ రోడ్ సమీపంలోని లారెల్ (Laureal) స్కూల్ వద్ద 75 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మీడియాతో సంజయ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కు సంబంధించి పనులను వేగవంతం చేస్తామన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా మరో 80 కోట్లను డంపింగ్ యార్డ్ పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ లోని ప్రతి డివిజన్ లో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామని, గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.3
- సిరిసిల్లలో పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన. సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.1
- డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్‌లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.1
- శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: HMS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని HMS రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 నెలలుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. గనుల్లో పనిచేసే కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు తక్షణమే అందించాలని కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.1
- కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఇదే పైప్‌లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్‌కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు. మేయర్, కమిషనర్‌కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు. అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.1